జయ జయ శుభకర వినాయక
చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు
పల్లవి:
వక్రతుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురమేదేవ
సర్వ కార్యేషు సర్వదా
ఆ...ఆ...ఆ....ఆ...ఆ.....ఆ....ఆ...
జయ జయ శుభకర వినాయక ...
శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...
శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ...ఆ...ఆ...ఆ....ఆ...ఆ...ఆ..
చరణం 1:
భాహుగానది తీరములోన
బావిలోన వెలసిన దేవ...
మహిలో జనులకు మహిమలు చాటి...
ఇహ పరములనిడు మహానుభావా...
ఇష్టమైనదీ వదిలిన నీ కడ
ఇష్ట కామ్యములు తీర్చే గణపతి...
కరుణను కురియుచు వరములనోసగుచు
నిరతము పెరిగే మహాకృతి...
సకల చరాచర ప్రపంచమే
సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం...
ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం... విఘ్న నాశనం...
కాణిపాకమున నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక ...
శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...
శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
చరణం 2:
పిండి బొమ్మవై ప్రతిభ చూపి
బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలకు ప్రదక్షిణముతో
మహాగణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు ...
గజముఖ గణపతి వైనావు
బ్రహ్మండమునే బొజ్జలో దాచి...
లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తి కూర్పూగా...
లక్ష్మి గణపతి వైనావు
వేద పురాణము లఖిల శాస్త్రములు
కళలు చాటును నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని
విబుధులు చేసే నీ కీర్తనం...
జయ జయ శుభకర వినాయక ...
శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...
శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి