RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, సెప్టెంబర్ 2024, ఆదివారం

గాంధి పుట్టిన దేశమా ఇది | Gandhi Puttina Desama Idi | Song Lyrics | Pavitra Bandham (1971)

గాంధి పుట్టిన దేశమా ఇది



చిత్రం:  పవిత్ర బంధం (1971)

సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత:  ఆరుద్ర

నేపధ్య గానం:  ఘంటసాల


పల్లవి:


గాంధి పుట్టిన దేశమా ఇది

నెహ్రు కోరిన సంఘమా ఇది

గాంధి పుట్టిన దేశమా ఇది

నెహ్రు కోరిన సంఘమా ఇది

  

సామ్యవాదం.. రామరాజ్యం.. 

సంభవించే కాలమా

గాంధి పుట్టిన దేశమా...


చరణం 1:


సస్యశ్యామల దేశం.. 

ఐనా నిత్యం క్షామం

సస్యశ్యామల దేశం.. 

ఐనా నిత్యం క్షామం


ఉప్పోంగే నదులజీవజలాలు.. 

ఉప్పు సముద్రం పాలు

యువకుల శక్తికి భవితవ్యానికి 

ఇక్కడ తిలోదకాలు

ఉన్నది మనకు ఓటు.. 

బ్రతుకు తెరువుకే లోటు


గాంధి పుట్టిన దేశమా ఇది..

నెహ్రు కోరిన సంఘమా ఇది

సామ్యవాదం.. రామరాజ్యం.. 

సంభవించే కాలమా

గాంధి పుట్టిన దేశమా...


చరణం 2:


సమ్మె ఘోరావు దొమ్మీ... 

బస్సుల దహనం లూటీ

సమ్మె ఘోరావు దొమ్మీ... 

బస్సుల దహనం లూటీ


శాంతి సహనం సమధర్మంపై 

విరిగెను గుండా లాఠీ

అధికారంకై పెనుగులాటలో... 

అన్నాదమ్ముల పోటీ

హెచ్చెను హింసా ద్వేషం.. 

ఏమౌతుందీ దేశం


గాంధి పుట్టిన దేశమా ఇది..

నెహ్రు కోరిన సంఘమా ఇది

సామ్యవాదం.. రామరాజ్యం.. 

సంభవించే కాలమా

గాంధి పుట్టిన దేశమా...


చరణం 3:


వ్యాపారాలకు పర్మిట్... 

వ్యవహారాలకు లైసెన్స్

అర్హత లేని ఉద్యోగాలకు.. 

లంచం ఇస్తే ఓ యస్

సిఫార్సు లేనిదే స్మశాన మందు 

దొరకదు రవ్వంత చోటు

పేరుకు ప్రజలది రాజ్యం.. 

పెత్తందార్లకే భోజ్యం


గాంధి పుట్టిన దేశమా ఇది..

నెహ్రు కోరిన సంఘమా ఇది

సామ్యవాదం.. రామరాజ్యం.. 

సంభవించే కాలమా

గాంధి పుట్టిన దేశమా...


- పాటల ధనుస్సు 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు