ఇంతేనయా తెలుసుకోవయా
చిత్రం : కథానాయకుడు (1969)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
హావ్ హావ్ హావ్ లలలలా
లాల్ల లలలల
హావ్ హావ్ హావ్ లలలలా
లాల్ల లలలల
లా... లా... లా… లలలల
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
లా లలల లా లలల లా లలల
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
నీతీ లేదు నిజాయితి లేదు...
ధనమే జగమయ్యా
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
చరణం 1 :
డాబులు కొట్టి మోసం చేసి
జేబులు నింపేరు హొ హహహ
డాబులు కొట్టి మోసం చేసి
జేబులు నింపేరు
పాపం పుణ్యం పరమార్థాలు
పంచకు రానీరు
ఎవరికి వారే యమునా తీరే
ఇదే ప్రపంచమయా
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
జింగించక జింగించక
జింగించక జింగించక
జింగించక జింగించక
జింగించక జింగించక
చరణం 2 :
పైసా తోటి సీసా చేరి
జల్సా చేసింది... వావ్వ....
పైసా తోటి సీసా చేరి
జల్సా చేసింది
మనసే లేని సొగసే ఉండి
మైమరపించింది
పైన పటారం లోన లొటారం
ఇదే ప్రపంచమయా
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
చరణం 3 :
మంచిని చేసే మనిషిని నేడు
వంచన చేసేరు... ఆహా
మంచిని చేసే మనిషిని నేడు
వంచన చేసేరు
గొంతులు కోసే వాడికి నేడు
గొడుగులు పట్టేరు
దొంగలు దొరలై ఊళ్ళే దోచిరి
ఇదే ప్రపంచమయా
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
యో.. యో.. య్య...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి