RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kathanayakudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kathanayakudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, సెప్టెంబర్ 2024, బుధవారం

మంచివాడు మా బాబాయి | Manchivadu maa Babayi | Song Lyrics | Kathanayakudu (1969)

మంచివాడు మా బాబాయి 



చిత్రం : కథానాయకుడు (1969)

సంగీతం : టి.వి. రాజు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : పి సుశీల, బెంగళూరు లత 


పల్లవి :


మంచివాడు మా బాబాయి

మామాటే వింటాడోయి 

కోపం మాని తాపం మాని 

మాతో వుంటాడోయి


మంచివాడు మా బాబాయి

మామాటే వింటాడోయి 

కోపం మాని తాపం మాని 

మాతో వుంటాడోయి


చరణం 1 :


రామలక్ష్మణులు మీరయ్యా

మీలో కలతలు ఏలయ్యా

నీతికి నిలబడు నీ తమ్మునిపై 

నిందలెందుకయ్యా 


మంచివాడు మా బాబాయి

మామాటే వింటాడోయి 

కోపం మాని తాపం మాని 

మాతో వుంటాడోయి


చరణం 2 :


అమ్మానాన్న వాలే చూసే 

అన్నా వదినా వున్నారు 

అన్నయ్యేదో అనగానే 

అలుక ఎందుకయ్యా 

అలుక ఎందుకయ్యా 


మంచివాడు మా బాబాయి

మామాటే వింటాడోయి 

కోపం మాని తాపం మాని 

మాతో వుంటాడోయి


చరణం 3 :


మంచి మనసుతో బాబాయి 

మనకు కానుకలు తెచ్చాడు 

మూగ నోములు విడవాలి 

ముగ్గురు కలసి నవ్వాలి 


మంచివాడు మా బాబాయి

మామాటే వింటాడోయి 

కోపం మాని తాపం మాని 

మాతో వుంటాడోయి


- పాటల ధనుస్సు 


22, సెప్టెంబర్ 2024, ఆదివారం

ఇంతేనయా తెలుసుకోవయా | Intenaya Telusukovayya | Song Lyrics | Kathanayakudu (1969)

ఇంతేనయా తెలుసుకోవయా



చిత్రం : కథానాయకుడు (1969)

సంగీతం : టి.వి. రాజు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి : 


హావ్ హావ్ హావ్ లలలలా

లాల్ల లలలల

హావ్ హావ్ హావ్ లలలలా

లాల్ల లలలల

లా... లా... లా… లలలల


ఇంతేనయా తెలుసుకోవయా

ఈ లోకం ఇంతేనయా

లా లలల లా లలల లా లలల

ఇంతేనయా తెలుసుకోవయా

ఈ లోకం ఇంతేనయా

నీతీ లేదు నిజాయితి లేదు... 

ధనమే జగమయ్యా


తక్చికి బుంబుం తకచికి బుంబుం

బ బా బి బీ బు బొ బ బ

తక్చికి బుంబుం తకచికి బుంబుం

బ బా బి బీ బు బొ బ బ


చరణం 1 :


డాబులు కొట్టి మోసం చేసి 

జేబులు నింపేరు హొ హహహ

డాబులు కొట్టి మోసం చేసి 

జేబులు నింపేరు

పాపం పుణ్యం పరమార్థాలు 

పంచకు రానీరు

ఎవరికి వారే యమునా తీరే 

ఇదే ప్రపంచమయా


ఇంతేనయా తెలుసుకోవయా

ఈ లోకం ఇంతేనయా


జింగించక జింగించక

జింగించక జింగించక


జింగించక జింగించక

జింగించక జింగించక


చరణం 2 :


పైసా తోటి సీసా చేరి 

జల్సా చేసింది... వావ్వ....

పైసా తోటి సీసా చేరి 

జల్సా చేసింది

మనసే లేని సొగసే ఉండి 

మైమరపించింది

పైన పటారం లోన లొటారం 

ఇదే ప్రపంచమయా


ఇంతేనయా తెలుసుకోవయా

ఈ లోకం ఇంతేనయా


తక్చికి బుంబుం తకచికి బుంబుం

బ బా బి బీ బు బొ బ బ

తక్చికి బుంబుం తకచికి బుంబుం

బ బా బి బీ బు బొ బ బ


చరణం 3 :


మంచిని చేసే మనిషిని నేడు 

వంచన చేసేరు... ఆహా

మంచిని చేసే మనిషిని నేడు 

వంచన చేసేరు

గొంతులు కోసే వాడికి నేడు 

గొడుగులు పట్టేరు

దొంగలు దొరలై ఊళ్ళే దోచిరి 

ఇదే ప్రపంచమయా


ఇంతేనయా తెలుసుకోవయా

ఈ లోకం ఇంతేనయా

యో.. యో.. య్య...


- పాటల ధనుస్సు 


2, ఫిబ్రవరి 2022, బుధవారం

ముత్యాల జల్లు కురిసే | Mutyala Jallu Kurise | Song Lyrics | Kathanayakudu (1969)

ముత్యాల జల్లు కురిసే



చిత్రం: కథానాయకుడు (1969)

సంగీతం: టి.వి. రాజు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: సుశీల



పల్లవి:


ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ముత్యాల జల్లు కురిసే... 

రతనాల మెరుపు మెరిసే...

వయసు మనసు పరుగులు తీసే... 

అమ్మమ్మా...


ముత్యాల జల్లు కురిసే... 

రతనాల మెరుపు మెరిసే...

వయసు మనసు పరుగులు తీసే... 

అమ్మమ్మా...


చరణం 1:


ఎనక జన్మల నా నోములన్నీ... 

ఇప్పుడు పండినవమ్మా..ఆ..ఆ..ఆ..

ఎనక జన్మల నా నోములన్నీ... 

ఇపుడు పండినవమ్మా

తనకు తానే నా రాజు నాతో....

తనకు తానే నా రాజు నాతో... 

మనసు కలిపేనమ్మా..


ముత్యాల జల్లు కురిసే... 

రతనాల మెరుపు మెరిసే

వయసు మనసు పరుగులు తీసే... 

అమ్మమ్మా...


చరణం 2:


ముద్దు మోమును అద్దాన చూపి... 

మురిసిపోయాడమ్మా..ఆ..ఆ..

ముద్దు మోమును అద్దాన చూపి... 

మురిసిపోయాడమ్మా

మల్లెపూల పల్లకిలోనా... 

ఒళ్ళు మరిచేనమ్మా...

మల్లెపూల పల్లకిలోనా... 

ఒళ్ళు మరిచేనమ్మా..ఆ..ఆ..


ముత్యాల జల్లు కురిసే... 

రతనాల మెరుపు మెరిసే

వయసు మనసు పరుగులు తీసే... 

అమ్మమ్మా


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు