RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
saptapadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
saptapadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జులై 2026, బుధవారం

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా | Govullu Tellana Gopayya Nallana | Song Lyrics | Saptapadi (1981)

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా 


చిత్రం : సప్తపది (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి 


పల్లవి :


గోవుల్లు తెల్లన... గోపయ్య నల్లనా... 

గోధూళి ఎర్రనా... ఎందువలనా...

గోవుల్లు తెల్లన... గోపయ్య నల్లనా...

గోధూళి ఎర్రనా... ఎందువలనా...

గోధూళి ఎర్రనా ఎందువలనా...  


చరణం 1 :


తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా... 

ఎందుకుండవ్

కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా...  

ఏమో


తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా

కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా

గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా

గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా


ఆ పొద్దు పొడిచేనా.... 

ఈ పొద్దు గడిచేనా....

ఎందువలనా అంటే అందువలనా

ఎందువలనా అంటే దైవఘటనా


గోవుల్లు తెల్లన... గోపయ్య నల్లనా

గోధూళి ఎర్రనా... ఎందువలనా

హొయ్ ఒయ్ గోధూళి ఎర్రనా 

ఎందువలనా  


చరణం 2 :


పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ... 

పాపం

అల్లన మోవికీ తాకితే గేయాలూ... 

హా హా హా...

పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ

అల్లన మోవికీ తాకితే గేయాలూ


ఆ మురళి మూగైనా... 

ఆ పెదవి మోడైనా

ఆ గుండె గొంతులో... 

ఈ పాట నిండదా

ఈ కడిమీ పూసేనా... 

ఆ కలిమీ చూసేనా....


ఎందువలనా అంటే 

అందువలనా

ఎందువలనా అంటే 

దైవఘటనా

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా

గోధూళి ఎల్లనా ఎందువలనా

గోధూళి ఎర్రనా ఎందువలనా

లలాల లాలలా లల్లల... 


- పాటల ధనుస్సు 


నెమలికి నేర్పిన నడకలివి | Nemaliki Nerpina Nadakalivi | Song Lyrics | Saptapadi (1981)

నెమలికి నేర్పిన నడకలివి 


చిత్రం : సప్తపది (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ జానకి 


పల్లవి :


నెమలికి నేర్పిన నడకలివీ...

మురళికి అందని పలుకులివి..

శృంగార సంగీత 

నృత్యాభినయవేళ

చూడాలి నా నాట్యలీల.... 


నెమలికి నేర్పిన నడకలివీ...

మురళికి అందని పలుకులివి..

శృంగార సంగీత 

నృత్యాభినయవేళ

చూడాలి నా నాట్యలీల....


నెమలికి నేర్పిన... అ...

నెమలికి నేర్పిన నడకలివి..


చరణం 1 :


కలహంసలకిచ్చిన పదగతులు... 

ఎలకోయిల మెచ్చిన స్వరజతులు

కలహంసలకిచ్చిన పదగతులు... 

ఎలకోయిల మెచ్చిన స్వరజతులు


ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు... 

ఏవేవో కన్నుల కిన్నెరలు

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు... 

ఏవేవో కన్నుల కిన్నెరలు


కలిసి మెలిసి కళలు విరిసి 

మెరిసిన కాళిదాసు 

కమనీయ కల్పనానల్ప 

శిల్ప మణి మేఖలను... 

శకుంతలను.... 

ఓ..ఓ..ఓ. 

నెమలికి నేర్పిన నడకలివి


చరణం 2 :


చిరునవ్వులు అభినవ మల్లికలు... 

సిరిమువ్వలు అభినయ దీపికలు

చిరునవ్వులు అభినవ మల్లికలు... 

సిరిమువ్వలు అభినయ దీపికలు


నీలాల కన్నుల్లో తారకలు... 

తారాడే చూపుల్లో చంద్రికలు

నీలాల కన్నుల్లో తారకలు... 

తారాడే చూపుల్లో చంద్రికలు


కురులు విరిసి... మరులు 

కురిసి  మురిసిన 

రవివర్మ చిత్రలేఖనా లేఖ్య 

సరస సౌందర్య రేఖను...

శశిరేఖను.... 


నెమలికి నేర్పిన నడకలివి..

మురళికి అందని పలుకులివి..

శృంగార సంగీత 

నృత్యాభినయవేళ

చూడాలి నా నాట్యలీల....

నెమలికి నేర్పిన నడకలివి..


- పాటల ధనుస్సు 


భామనే సత్య భామనే | Bhamane Satyabhamane | Song Lyrics | Saptapadi (1981)

భామనే సత్య భామనే


చిత్రం : సప్తపది (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ జానకి 


పల్లవి :


భామనే! సత్య భామనే!

సత్య భామనే.. సత్య భామనే

సత్య భామనే..  సత్య భామనే

వయ్యారి ముద్దుల...

వయ్యారి ముద్దుల... 

సత్యా భామనే.. సత్య భామనే 


చరణం 1 :


భామనే పదియారువేల 

కోమలులందరిలోనా

భామనే పదియారువేల 

కోమలులందరిలో..


లలనా! చెలియా!  

మగువా!  సఖియా!

రామరో గోపాలదేవుని.. 

ప్రేమను దోచినదాన..

రామరో గోపాలదేవుని.. 

ప్రేమను దోచిన సత్య భామనే.... .

సత్యా భామనే 


చరణం 2 :


ఇంతినే... చామంతినే....  

మరుదంతినే.... విరిబంతినే.....

ఇంతినే చామంతినే 

మరుదంతినే విరిబంతినే


జాణతనమున సతులలో...

జాణతనమున సతులలో... 

నెరజాణనై! నెరజాణనై!

నెరజాణనై.. వెలిగేటిదాన 

భామనే.... సత్య భామనే! 


- పాటల ధనుస్సు 


7, జులై 2026, మంగళవారం

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది | Ye Kulamu needante | Song Lyrics | Saptapadi (1981)

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది 


చిత్రం :  సప్తపది (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి 


పల్లవి :


ఏ కులము నీదంటే 

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు... 

మా కులమే లెమ్మంది


ఏ కులము నీదంటే 

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు... 

మా కులమే లెమ్మంది 


చరణం 1 :


ఏడు వర్ణాలు కలిసి 

ఇంద్రధనస్సవుతాది

అన్నీ వర్ణాలకు ఒకటే 

ఇహము పరముంటాది


ఏడు వర్ణాలు కలిసి 

ఇంద్రధనస్సవుతాది

అన్నీ వర్ణాలకు ఒకటే 

ఇహము పరముంటాది


ఏ కులము నీదంటే... 

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు... 

మా కులమే లెమ్మంది 


చరణం 2 :


ఆది నుంచి ఆకాశం మూగది... 

అనాదిగా తల్లి ధరణి మూగది

ఆది నుంచి ఆకాశం మూగది... 

అనాదిగా తల్లి ధరణి మూగది


నడుమ వచ్చి 

ఉరుముతాయి మబ్బులు

నడుమ వచ్చి 

ఉరుముతాయి మబ్బులు

ఈ నడమంత్రపు మనుషులకే 

మాటలు... ఇన్ని మాటలు


ఏ కులము నీదంటే 

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు... 

మా కులమే లెమ్మంది


- పాటల ధనుస్సు 


6, జులై 2026, సోమవారం

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి | Akhilandeswari Chamundeswari | Song Lyrics | Saptapadi (1981)

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి 


చిత్రం : సప్తపది (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల 


సాకీ :


ఓంకార పంజర శుకీమ్... 

ఉపనిషదుద్యాన కేళికల కంఠీమ్..

ఆగమ విపిన మయూరీ ... ఆర్యాం.. 

అంతర్విభావ యేత్ గౌరీమ్!!


పల్లవి :


అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి... 

పాలయమామ్ గౌరీ.. 

పరిపాలయమామ్... గౌరి

అఖిలాండేశ్వరి... 

చాముండేశ్వరి...

పాలయమామ్ గౌరీ... 

పరిపాలయమామ్.. గౌరి


చరణం 1:


శుభగాత్రి గిరిరాజపుత్రి.. 

అభినేత్రి శర్వార్ధ గాత్రీ

ఆ...శుభగాత్రి గిరిరాజపుత్రి.. 

అభినేత్రి శర్వార్ధ గాత్రీ...


సర్వార్థ సంధాత్రి 

జగదేక జనయిత్రి.. 

చంద్రప్రభా ధవళకీర్తి..

సర్వార్థ సంధాత్రి 

జగదేక జనయిత్రి.. 

చంద్రప్రభా ధవళకీర్తి..


చతుర్బాహు సంరక్షిత శిక్షిత 

చతుర్దశాంతర భువనపాలిని

కుంకుమరాగశోభిని 

కుసుమ బాణ సంశోభిని

మౌనసుహాసిని... గానవినోదిని... 

భగవతి.. పార్వతి... దేవీ


అఖిలాండేశ్వరి... 

చాముండేశ్వరి...

పాలయమామ్ గౌరీ... 

పరిపాలయమామ్ గౌరి 


చరణం 2:


శ్రీహరి ప్రణయాంబురాశి... 

శ్రీపాద విచలిత క్షీరాంబురాశి

శ్రీహరి ప్రణయాంబురాశి... 

శ్రీపాద విచలిత క్షీరాంబురాశి


శ్రీపీఠ సంవర్ధినీ... డోలాసురమర్ధిని

శ్రీపీఠ సంవర్ధినీ... డోలాసురమర్ధిని


ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి... 

ధైర్యలక్ష్మి... విజయలక్ష్మి

ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి... 

ధైర్యలక్ష్మి... విజయలక్ష్మి

ఆదిలక్ష్మి... విద్యాలక్ష్మి... 

గజలక్ష్మి... సంతానలక్ష్మి

సకలభోగసౌభాగ్యలక్ష్మి... 

శ్రీమహాలక్ష్మి... దేవీ...


అఖిలాండేశ్వరి... 

చాముండేశ్వరి... 

పాలయమామ్ గౌరీ... 

పరిపాలయమామ్ గౌరి 


చరణం 3 :


ఇందువదనే... కుందరదనే... 

వీణా పుస్తక ధారిణే

ఇందువదనే... కుందరదనే... 

వీణా పుస్తక ధారిణే


శుకశౌనకాది... వ్యాసవాల్మీకి... 

మునిజన పూజిత శుభచరణే

శుకశౌనకాది... వ్యాసవాల్మీకి... 

మునిజన పూజిత శుభచరణే...


సరస సాహిత్య... స్వరస సంగీత... 

స్తనయుగళే

సరస సాహిత్య... స్వరస సంగీత... 

స్తనయుగళే

వరదే అక్షరరూపిణే... 

శారదే దేవీ


అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి.. 

పాలయమామ్ గౌరీ... 

పరిపాలయమామ్ గౌరి 


చరణం 4 :


వింధ్యాటవీ వాసినే... 

యోగసంధ్యాసముద్భాసినే

సింహాసనస్థాయినే... 

దుష్టహరరంహక్రియాశాలినే


విష్ణుప్రియే... సర్వలోకప్రియే... 

సర్వనామప్రియే... 

ధర్మసమరప్రియే..

హే... బ్రహ్మచారిణే... 

దుష్కర్మవారిణే..

హే... విలంబితకేశపాశినే....

మహిషమర్దనశీల... 

మహితగర్జనలోల..

భయద నర్తన కేళికే... కాళికే..

దుర్గమాగమదుర్గ వాసినే 

దుర్గే దేవీ...


- పాటల ధనుస్సు 

6, జూన్ 2026, శనివారం

వ్రేపల్లియ ఎద ఝల్లున | Vrepalliya Eda Jhalluna | Song Lyrics | Saptapadi (1981)

వ్రేపల్లియ ఎద ఝల్లున 


చిత్రం :  సప్తపది (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, సుశీల  


పల్లవి :


వ్రేపల్లియ ఎద ఝల్లున 

పొంగిన రవళీ

నవరస మురళీ...  

ఆ నందన మురళీ

ఇదేనా...  ఇదేనా... 

ఆ మురళి... మోహనమురళీ

ఇదేనా...  ఆ మురళీ


వ్రేపల్లియ ఎద ఝల్లున 

పొంగిన రవళీ

నవరస మురళీ...  

ఆ నందన మురళీ

ఇదేనా...  ఆ మురళి... 

మోహనమురళీ

ఇదేనా... ఆ మురళీ 


చరణం 1 :


కాళింది మడుగునా 

కాళీయుని పడగల

ఆబాలగోపాల

మాబాల గోపాలుని

కాళింది మడుగునా 

కాళీయుని పడగల

ఆబాలగోపాల

మాబాల గోపాలుని

అచ్చెరువున అచ్చెరువున 

విచ్చిన కన్నులజూడ

అచ్చెరువున అచ్చెరువున 

విచ్చిన కన్నులజూడ

తాండవమాడిన సరళి...  

గుండెల మ్రోగిన మురళి

ఇదేనా... ఇదేనా ఆ మురళీ 


చరణం 2 :


అనగల రాగమై తొలుత 

వీనులలరించి

అనలేని రాగమై మరలా 

వినిపించీ.. మరులే కురిపించి

అనగల రాగమై తొలుత 

వీనులలరించి

అనలేని రాగమై మరలా 

వినిపించీ.. మరులే కురిపించి

జీవన రాగమై.. 

బృందావన గీతమై

ఆ.. జీవన రాగమై...  

బృందావన గీతమై

కన్నెల కన్నుల కలువల 

వెన్నెల దోచిన మురళి

ఇదేనా... ఇదేనా ఆ మురళీ


వేణుగానలోలుని 

మురిపించిన రవళి..

నటనల సరళి 

ఆ నందనమురళీ

ఇదేనా ఆ మురళి...  

మువ్వల మురళీ

ఇదేనా ఆ మురళీ... 


చరణం 3 :


మధురానగరిలో 

యమునా లహరిలో

ఆ రాధ ఆరాధనా 

గీతి పలికించి

మధురానగరిలో 

యమునా లహరిలో

ఆ రాధ ఆరాధనా 

గీతి పలికించి

సంగీత నాట్యాల 

సంగమ సుఖ వేణువై

ఆ....... ఆ....... ఆ.....


సంగీత నాట్యాల 

సంగమ సుఖ వేణువై

రాసలీలకే ఊపిరిపోసిన 

అందెల రవళి

ఇదేనా.. ఇదేనా ఆ మురళీ


వ్రేపల్లియ ఎద ఝల్లున 

పొంగిన రవళీ

నవరస మురళీ... 

ఆ నందన మురళీ

ఇదేనా ఇదేనా ఆ మురళి... 

మోహనమురళీ

ఇదేనా ఆ మురళీ..


- పాటల ధనుస్సు 


4, మార్చి 2022, శుక్రవారం

మరుగేలరా ఓ రాఘవా | Marugelara o Raghava | Song Lyrics | Saptapadi (1982)

మరుగేలరా ఓ రాఘవా


Moive : Saptapadi (1982)

Music: K.V.Mahadevan 
Lyricist: Thyagaraja
Singer: S.Janaki 


మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా 
మరుగేల చరాచరరూప పరాత్పర 
సూర్య సుధాకర లోచనా 
మరుగేల చరాచరరూప పరాత్పర 
సూర్య సుధాకర లోచనా
మరుగేలరా ఓ రాఘవా 

అన్ని నీవనుచు అంతరంగమునా 
అన్ని నీవనుచు అంతరంగమునా 
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా 
అన్ని నీవనుచు అంతరంగమునా 
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా 
నిన్నెగాని మదినీ  ఎన్నజాలనురులా 
నిన్నెగాని మదీనెన్నజాలనురుల 
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా 
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా 

పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు