వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే
చిత్రం : రెండు కుటుంబాల కథ (1970)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
వేణుగానలోలుని గన..
వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో
సకల జగము సోలునులే.....
జగము సోలునులే....
వేణుగానలోలుని గన..
వేయి కనులు చాలవులే
చరణం 1:
చిన్ననాడు గోపెమ్మల
చిత్తములలరించి...
మన్ను తిన్న ఆ నోటనే
మిన్నులన్నీ చూపించి...
కాళీయుణి పడగలపై...
లీలగా నటియించి...
సురలు నరులు మురిసిపొవా...
ధరణినేలు గోపాలుణి...
వేణుగానలోలుని గన..
వేయి కనులు చాలవులే....
చరణం 2 :
అతని పెదవి సోకినంత
అమృతము కురిసేను...
అతని చేయి తాకినంత
బ్రతుకే విరిసేను..
సుందర యమునా...
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
సుందర యమునా తటిలో......
సుందర యమునా తటిలో
సుందర యమునా తటిలో..
బృందావన సీమలలో..
కలసి మెలిసి అలసి సొలసి
వలపు తెలుపు వేళలో...
వేణుగానలోలుని గన..
వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో
సకల జగము సోలునులే.....
జగము సోలునులే...
వేణుగానలోలుని గన..
వేయి కనులు చాలవులే
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి