RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

25, సెప్టెంబర్ 2023, సోమవారం

చూసిన చూపే చూడనీ పదే పదే | Chusina choope chudanee | Song Lyrics | Pasi Hrudayalu (1973)

చూసిన చూపే చూడనీ పదే పదే



చిత్రం:  పసి హృదయాలు (1973)

సంగీతం:  జి.కె. వెంకటేశ్

గీతరచయిత:  సినారె

నేపధ్య గానం:  బాలు, సుశీల


పల్లవి:


    చూసిన చూపే చూడనీ పదే పదే

    దోచిన రూపే దోచనీ పదే పదే

    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా

    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా

    వలచే జంటలకూ సహజం ఇదే ఇదే

    చూసిన చూపే చూడనీ పదే పదే


చరణం 1:


    నా మనసే ఎగిసినదీ...

నీ మీదే అది వాలినదీ

    నా మనసే ఎగిసినదీ...

నీ మీదే అది వాలినదీ

    నా చేయి నీ చేయి...

పెనవేస్తూ పోతుంటే

    నీ పెదవి నా పెదవి ...

ప్రతినిమిషం తోడుంటే

    తేనే వెన్నెలా ...కలయిక అదే అదే

    తేనే వెన్నెలా... కలయిక అదే అదే

    అదే అదే ...హానీమూన్


    చూసిన చూపే చూడని పదే పదే

    దోచిన రూపే దోచనీ పదే పదే

    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా

    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా

    వలచే జంటలకూ సహజం ఇదే ఇదే

    చూసిన చూపే చూడనీ పదే పదే


చరణం 2:


    కౌగిలిలో కలిశామూ...

కమ్మదనంలో కరిగామూ

    ఊ..కౌగిలిలో కలిశామూ...

కమ్మదనంలో కరిగామూ

    చెలరేగే పరువాలే ...

కెరటాలై డీకొంటే

    ప్రతి తరగా ప్రతి నురగా...

మన కథలే చెపుతుంటే

    వలపుల కడలికే ...వంతెన కడదాము

    వలపుల కడలికే ...వంతెన కడదాము

    అదే అదే హానీమూన్...


    చూసిన చూపే చూడని పదే పదే

    దొచిన రూపే దోచనీ పదే పదే

    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా

    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా

    వలచే జంటలకూ సహజం ఇదే ఇదే


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు