RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

15, జూన్ 2022, బుధవారం

కారున్న మైనరు | Karunna Mainaru | Song Lyrics | Minor Babu (1973)

కారున్న మైనరు కాలం మారింది మైనరు



Movie : Minor Babu (1973),

Lyrics : Acharya Atreya,

Music : T chalapathirao,

Singer : P Susheela,



పల్లవి:

కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. 

ఇక తగ్గాలి మీ జోరూ

మా చేతికి వచ్చాయి తాళాలు.. 

మా చేతికి వచ్చాయి తాళాలు.. హత్తెరి


కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. 

ఇక తగ్గాలి మీ జోరూ

మా చేతికి వచ్చాయి తాళాలు.. 

మా చేతికి వచ్చాయి తాళాలు


చరణం: 1

రొడ్డెంత బాగుంటే.. మీకంత హుషారు

దాన్నేసి నోళ్ళ మీదనే.. ఎక్కించి పోతారు

రొడ్డెంత బాగుంటే.. మీకంత హుషారు

దాన్నేసి నోళ్ళ మీదనే.. ఎక్కించి పోతారు


మేమెక్కి కూచుంటే.. మీరెమైపోతారూ

మేమెక్కి కూచుంటే.. మీరెమైపోతారు

మా పక్క నింత చోటిస్తే చాలంటారు.. హత్తెరి


కారున్న మైనరు.. కాలం మారింది మైనరు 

ఇక తగ్గాలి మీ జోరూ

మా చేతికి వచ్చాయి తాళాలు.. 

మా చేతికి వచ్చాయి తాళాలు.. హత్తెరి


చరణం: 2

పదునైన కన్నెపిల్ల ఎదురైతే.. 

పళ్ళికిలించి ప్రేమపాఠాలెన్నో చెప్తారూ

పదునైన కన్నెపిల్ల ఎదురైతే.. 

పళ్ళికిలించి ప్రేమపాఠాలెన్నో చెప్తారూ


పెళ్ళాడమంటేనే.. గొప్పోళ్ళ మంటారూ

పెళ్ళాడమంటేనే.. గొప్పోళ్ళ మంటారూ

మా ప్రేమముందు బీదోళ్ళు మీరే నంటాను


కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. 

ఇక తగ్గాలి మీ జోరూ

మా చేతికి వచ్చాయి తాళాలు.. 

మా చేతికి వచ్చాయి తాళాలు


చరణం: 3

నీ వెంట నేనొస్తే.. నీ డబ్బు చూస్తాను

నా వెంట నువ్వు వచ్చావా.. లోకాన్నే చూస్తావు


లోకాన్నీ చూడందే.. నువు మనిషివి కాలేవు

లోకాన్నీ చూడందే.. నువు మనిషివి కాలేవు

మావాడివైతే కలకాలం బతికుంటావు.. హత్తెరి


కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. 

ఇక తగ్గాలి మీ జోరూ

మా చేతికి వచ్చాయి తాళాలు.. 

మా చేతికి వచ్చాయి తాళాలు.. హత్తెరి


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు