RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

30, జూన్ 2022, గురువారం

చెకుముకి రవ్వ చినబోయింది | Chekumuki ravva | Song Lyrics | Neram Nadi Kadu Akalidi (1976)

చెకుముకి రవ్వ చినబోయింది



చిత్రం :  నేరం నాది కాదు ఆకలిది (1976)

సంగీతం: సత్యం

గీతరచయిత: సినారె

నేపధ్య గానం:  సుశీల



పల్లవి :


చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా

అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  


చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా

అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా

అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా.. 

ఎపుడమ్మా.. ఎపుడమ్మా  



చరణం 1 :


నేడుగాకున్న రేపైనా వసంతం రానే వస్తుంది.. 

ఆహా ఓహో అహా ఓహో

మోడుగావున్న జీవితమే పూలతో ముస్తాబవుతుంది.. 

ఆహా ఓహో అహా ఓహో

నేడుగాకున్న  రేపైనా వసంతం రానే వస్తుంది

మోడుగావున్న జీవితమే పూలతో ముస్తాబవుతుంది


గాలిలా సాగిపోతేనే గమ్యము ఎదురౌతుందమ్మా

ఏరులా పొంగిపోతేనే సాగరం చేరువౌనమ్మా


అయ్యో రామా.. చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా

అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా

అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా.. ఎపుడమ్మా  



చరణం 2 :



అహా ఓహో

మెత్తగా ఉంటే ఈ లోకం నెత్తిపై కాళ్ళు పెడుతుంది.. 

ఆహా ఓహో అహా ఓహో

ఆ కత్తిలా వున్నవాడంటే గులామై కాళ్ళుపడుతుంది.. 

ఆహా ఓహో ఆహా ఓహో

మెత్తగా వుంటే ఈ లోకం నెత్తిపై కాళ్ళు పెడుతుంది

కత్తిలా వున్నవాడంటే గులామై కాళ్ళుపడుతుంది


విత్తనం నేలలో ఉంటే దానికి విలువే లేదమ్మా

మొక్కలా చీల్చుకొస్తేనే దానికీ ఫలితం ఉందమ్మా 


అయ్యో రామా.. చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా

అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా

అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా.. ఎపుడమ్మా  



చరణం 3 :



పచ్చని తీగ పందిరికై వింతగా పరుగులు తీస్తుంది.. 

ఆహా ఓహో ఆహా ఓహో

వెచ్చని పరువం జతకోసం అంతగా ముచ్చట పడుతుంది.. 

ఆహా ఓహో ఆహా ఓహో

పచ్చని తీగ పందిరికై వింతగా పరుగులు తీస్తుంది

వెచ్చని పరువం జతకోసం అంతగా ముచ్చట పడుతుంది


కుమిలిపోతున్న గుండెల్లో తేనెలు కురిపించాలమ్మా

చీకటి కమ్మిన కళ్ళల్లో వెన్నెల చిలికించాలమ్మా


అయ్యో రామా.. చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా

అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా

అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా . . ఎపుడమ్మా


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు