ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది
చిత్రం : బాబు (1975)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, రమోల
పల్లవి :
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది..
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది..
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
బూరెలంటి బుగ్గల్లో ఎరుపొచ్చింది..
పువ్వులంటి కన్నుల్లో మెరుపొచ్చింది
ఛీ పో.. ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది..
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
చరణం 1 :
దాచుకోమ్మ యీ వగలు కాచుకోమ్మ కొన్నాళ్ళు
దాచుకోమ్మ యీ వగలు కాచుకోమ్మ కొన్నాళ్ళు
తప్పదులే తలంబ్రాలు... ఆ పైన తిరునాళ్ళు
తలచుకొని తలచుకొని నిదురరాని నీ కళ్ళు
తలచుకొని తలచుకొని నిదురరాని నీ కళ్ళు
తెల్లారిపొతాయి చెంగల్వ రేకులు...
తెల్లారిపొతాయి చెంగల్వ రేకులు
అబ్బా.. ఊరుకో..
ఓయమ్మో ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
చరణం 2 :
పూలజడ వేసుకొని బుగ్గచుక్క పెట్టుకుని
పూలజడ వేసుకొని బుగ్గచుక్క పెట్టుకుని
బొలెడన్ని ఆశలతో బోధపడని బెదురుతో..
తడబడుతూ గదిలోకి అడుగు పెట్టగానే..
తడబడుతూ గదిలోకి అడుగు పెట్టగానే..
యిలా.. అబ్బా..
వాటేసుకుంటాడు వాటమైన మొనగాడు
వాటేసుకుంటాడు వాటమైన మొనగాడు
ఛీ పో.. ఓయమ్మో..
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి