RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, జూన్ 2022, శనివారం

కసిగా ఉంది కసి కసిగా ఉంది | Kasiga vundi | song Lyrics | Eduruleni Manishi (1975)

కసిగా ఉంది.. కసి కసిగా ఉంది



చిత్రం :  ఎదురులేని మనిషి (1975)

సంగీతం :  కె. వి. మహదేవన్

గీతరచయిత : ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల, బాలు  



పల్లవి :


కసిగా ఉంది..  కసి కసిగా ఉంది

కలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుంది

కసుక్కుమంటూ కాటేయ్‌ మంటుంది


కసిగా ఉంది.. కసి కసిగా ఉంది

కలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుంది

కస కస నిన్నూ నవిలేయ్‌ మంటుంది

కసిగా ఉంది.. ఆ.. హా.. కసి కసిగా ఉంది



చరణం 1 :



నీ ఛాతీ చూస్తే నిన్న రాతిరి గుర్తుకు వస్తూంది..  అబ్బా

నీ కండలు చూస్తే గుండె నిండా గుబులే పుడుతూంది

నీ ఛాతీ చూస్తే నిన్న రాతిరి గుర్తుకు వస్తూంది

నీ కండలు చూస్తే గుండె నిండా గుబులే పుడుతూంది


గుబులంతా నీ కళ్ళల్లోనే గుబగుబమంటూంది..  లలల..

గుబులంతా నీ కళ్ళల్లోనే గుబగుబమంటూంది .. ఓహో..

అది కొత్త కొత్త కథలను రోజూ చెప్పక చెపుతూంది        


      

కసిగా ఉంది.. కసి కసిగా ఉంది..

కలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుంది

కసుక్కుమంటూ కాటేయ్‌ మంటుంది..

కసిగా ఉంది.. కసి కసిగా ఉంది




చరణం 2 :



ఎంత కాలం నీ కోసం ఎదురు చూస్తూ ఉండేది

ఎదురు తిరిగే పరువాన్ని అదుపులోన ఉంచేది

ఎంత కాలం నీ కోసం ఎదురు చూస్తూ ఉండేది

ఎదురు తిరిగే పరువాన్ని అదుపులోన ఉంచేది


అదుపులోన ఉండనిదాన్ని అనుభవించాలి..  అ

అదుపులోన ఉండనిదాన్ని అనుభవించాలి..

అనుభవానికి రాని దాన్ని వదులుకోవాలి  



కసిగా ఉంది కసి కసిగా ఉంది

కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది

కస కస నిన్నూ నవిలేయ్‌ మంటుంది

కసిగా ఉంది.. కసి కసిగా ఉంది




చరణం 3 :


నీ అండలేక అందరికీ నే నలుసై పోయాను

నువ్వుండగా ఏ మొనగాడు నా జోలికి రాలేడు

నీ అండలేక అందరికీ నే నలుసై పోయాను

నువ్వుండగా ఏ మొనగాడు నా జోలికి రాలేడు

అందుకేగా ఆడదానికో మగవాడుండాలి

అందుకేగా ఆడదానికో మగవాడుండాలి

ఉంటే చాలదు అందుకు తగ్గ మగసిరి ఉండాలి


కసిగా ఉంది.. కసి కసిగా ఉంది.. 

కలవక కలవక కలిసినందుకు.. 

కస్సుమంటుంది 

కసుక్కుమంటూ కాటేయ్‌ మంటుంది.. 

కసిగా ఉంది.. కసి కసిగా ఉంది

కసిగా ఉంది.. ఆ.. కసి కసిగా ఉంది.. 

కసిగా ఉంది.. ఆ.. హా..కసి కసిగా ఉంది


పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే | Godariki Ye oddaina | Song Lyrics | Mana Oori Katha (1976)

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే చిత్రం :  మన ఊరి కథ (1976) సంగీతం :  జె.వి. రాఘవులు గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం :  బాలు, సుశీల  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు