RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, జూన్ 2022, శుక్రవారం

సారి సో సారి | Sorry so Sorry | Song Lyrics | Kannavari Kalalu (1974)

సారి... సో సారి



చిత్రం :  కన్నవారి కలలు (1974)

సంగీతం :  వి. కుమార్

గీతరచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల 



పల్లవి : 


 సారి... సో సారి.. నా మాట విను ఇంకోకసారి

 సారి... సో సారి... నా మాట విను ఇంకోకసారి 


ప్రేమించలేదు నిన్ను... ఈ బ్రహ్మచారి

పెళ్ళాడితే నిన్ను... నా దారే గోదారి 


 సారి... సో సారి... నా మాట విను ఇంకోకసారి

చూడు.. ఇటు చూడు..

నా వంక చూసి మాటాడు...

చూడు.. ఇటు చూడు..

నా వంక చూసి మాటాడు...

ప్రేమించలేదా నువ్వు.. నన్నే ఏరికోరి

కాదంటే వదలను నిన్ను... ఓ బ్రహ్మచారి 


 సారి... సో సారి... నా మాట విను ఇంకోకసారి 


చరణం 1 : 


నిన్న కాక అటు మొన్ననె కాదా... 

కళ్ళు కళ్ళు కలిపేవు..

అవునూ.. 


వెన్నలాంటి నా మనసును దోచి... 

బాసలెన్నో  చేశావు...

అవునూ.. 


నిన్న కాక అటు మొన్ననె కాదా... 

కళ్ళు కళ్ళు కలిపేవు

వెన్నలాంటి నా మనసును దోచి... 

బాసలెన్నో  చేశావు

ఆశపెంచి మురిపించిన నువ్వే... 

మనిషి మారిపోయావు 


తప్పు తెలుసుకొన్నాను... 

మనసు మార్చుకొన్నాను

నా తప్పు తెలుసుకొన్నాను... 

మనసు మార్చుకొన్నాను

కాబోయే శ్రీమతి ఇలా.. 

ఉండ కూడదనుకొన్నాను 


 సారి... సో సారి... నా మాట విను ఇంకోకసారి 


చరణం 2: 


తిండిపోతులా తింటే కాదు... 

వండే చిన్నది కావాలి...

ఊ..హు..హు...హు... 


ఏడుపు అంటే నాకు గిట్టదు... 

ఎపుడూ నవ్వుతు వుండాలీ..

అలాగా.. 


తిండిపోతులా తింటే కాదు... 

వండే చిన్నది కావాలి

ఏడుపు అంటే నాకు గిట్టదు... 

ఎపుడూ నవ్వుతు వుండాలీ

చీటికి మాటికి అలగకూడదు... 

తోడూ నీడగ వుండాలి 


వంట నేర్చుకొంటాను... రియల్లీ..

నవ్వులు చిందిస్తాను... ప్రామిస్ ... 


వంట నేర్చుకోంటాను... నవ్వులు చిందిస్తాను

నీతోటే నేనుంటాను... నీమాటే వింటాను 


అయితే ఇక రేపే మ్రోగేను పెళ్ళి సన్నాయి

ఎల్లుండే నీ చేతుల్లో ఉంటుంది పాపాయి

జో...హాయీ హాయీ జో హయీ...హాయీ జో..


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు