RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, జూన్ 2022, బుధవారం

రాధాకృష్ణుల ప్రణయగీతం | Radhakrishna song | Brindavanam | RKSS Creations

రాధాకృష్ణుల ప్రణయగీతం:



గీత రచన : రామకృష్ణ దువ్వు, 

స్వరకల్పన : చిప్పాడ పవన్ కుమార్ (ప్రవీణ్)

గానం : T కృష్ణ రావు, మూల శ్రీలత,

ఆల్బం : బృందావనం 

రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం.


 

పల్లవి:

రాధ:

కృష్ణానా ఊపిరి నీవేరా

నా కళ్ళు చూసేది నీ రూపమే

నీ పదముల సవ్వడికే నా హృదయం ఆడేది

కృష్ణ:

రాధికానా ఉనికి నీకోసమే..

నీ చూపులే నా నయనాలు..

నా హృదిలో చేతనము నీవే చెలీ..

రాధ, కృష్ణ:

నేనూ నీవూ వేరుగ లేము

జగతిన ఎపుడూ కలసుంటాము..

 

చరణం 1:

రాధ:

ప్రతి తరువూ మన ప్రేమను చూసి

పరవశించి కమ్మని ఫలముల నిచ్చాయి

కృష్ణ:

రాధాకృష్ణుల జంటగ చూసి

గువ్వలన్ని ప్రేమ పాటలే పాడాయి

రాధ:

నీ మోహనరాగపు పరవశంబున

మబ్బులు ప్రేమ చినుకులు కురిశాయి..

కృష్ణ:

పూదోటలన్నీ స్వాగతించిగ

ప్రేమ సౌరభాలు గుప్పించాయి

రాధ, కృష్ణ:

నీవూ నేనూ జతగా వుంటే

ప్రతి ఆణువణువూ ప్రేమమయం

 

చరణం 2:

రాధ:

గోపాలా నీ ప్రేమ లో నేను రసరాగిణిని..

నా తనువూ మనసూ పలికేను నీ నామమే

 

కృష్ణ:

నేనెపుడూ  నీ నామమునే స్మరింతు సఖీ..

నీ పదములు తాకిన పుడమి పులకరించును

 

రాధ:

భువిలో దివిలో ఏ యుగమైనా

కృష్ణుని సరసన నిలుచును ఈ రాధ

కృష్ణ:

సుమ సమమైన ప్రియ చరణములు

నా శిరసున దాల్చి తరింతు ప్రేమ మయీ ..

రాధ, కృష్ణ:

నీవూ నేనూ జతగా వుంటే

ప్రతి ఆణువణువూ ప్రేమమయం

 

।।కృష్ణనా ఊపిరి।।


- RKSS Creations

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు