నీకు నాకు కుదిరెను జంట
చిత్రం : పసుపు పారాణి (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
నీకు నాకు కుదిరెను జంట..
చూసేవారికి కన్నుల పంట
కుదిరెను జంట... ఆహా..
కన్నుల పంట...ఆహా
అది రాసిన దేవుడి వేడుక...
ముడి వేసిన పెద్దల కోరిక
నీకు నాకు కుదిరెను జంట..
చూసేవారికి కన్నుల పంట
కుదిరెను జంట... ఓహో..
కన్నుల పంట...ఆహా
చరణం 1 :
అత్త కళ్ళలో కొత్త మెరుపులు...
మావ ఒంటిలో పాము మెళికలు
అత్త కళ్ళలో కొత్త మెరుపులు...
మావ ఒంటిలో పాము మెళికలు
నా కాళ్ళు కడిగే వేళ కోసం
వల్లమాలిన పలవరింతలు
మొత్తానికి నా చిత్తానికి తెగ నచ్చిన వరుడు..
నేనేనంటా.. అంటా.. నేనేనంటా ... నేనంటా
నీకు నాకు కుదిరెను జంట..
చూసేవారికి కన్నుల పంట
కుదిరెను జంట... ఓహో..
కన్నుల పంట...ఆహా
నీకు నాకు కుదిరెను జంట..
చూసేవారికి కన్నుల పంట
కుదిరెను జంట... ఓహో..
కన్నుల పంట...ఆహా
చరణం 2 :
ఎన్ని నేర్చెనో బావగారు...
ఎంత తీయనో ఆ మాట తీరు
ఎన్ని నేర్చెనో బావగారు...
ఎంత తీయనో ఆ మాట తీరు
తనకున్న కోరిక తీరాలని
ఎన్ని కమ్మని కలవరింతలో
అహా.. మొత్తానికి నా చిత్తానికి తెగ నచ్చిన పడుచు
నేనేనంటా.. అంటా... నేనేనంటా... నేనంటా
నీకు నాకు కుదిరెను జంట..
చూసేవారికి కన్నుల పంట
కుదిరెను జంట... ఓహో..
కన్నుల పంట...ఆహా
నీకు నాకు కుదిరెను జంట..
చూసేవారికి కన్నుల పంట
కుదిరెను జంట... ఓహో..
కన్నుల పంట...ఆహా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి