నేడే తెలిసింది ఈనాడే తెలిసింది
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంతరావు
గీతరచయిత: సి నారాయణ రెడ్డి
నేపధ్య గానం: మహమ్మద్ రఫీ, జానకి
పల్లవి:
నేడే ..తెలిసింది.. ఈనాడే తెలిసింది
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
కమ్మని కలకే రూపం వస్తే...ఏ...
కమ్మని కలకే రూపం వస్తే ..
అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
తీయని పాటకు ప్రాణం వస్తే ...ఏ...
తీయని పాటకు ప్రాణం వస్తే ..
అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
చరణం 1:
ఇంత మంచి రూపానికి ..
అంత మంచి మనసుంటుందని
ఇంత మంచి రూపానికి ..
అంత మంచి మనసుంటుందని
ఆ మనసున అంతరాలకు
తావన్నది లేనే లేదని
ఆ మనసున అంతరాలకు
తావన్నది లేనే లేదని
అది వలచే దొకసారే ననీ ...
ఆ వలపే విడిపో లేనిదనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...
చరణం 2:
ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...
ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...
మారుమూల పల్లెలోన ..
మధుర గానముదయించేనని
మారుమూల పల్లెలోన ..
మధుర గానముదయించేనని
శిలలకైన ఆ గానం...
పులకింతలు కలిగించేననీ
శిలలకైన ఆ గానం ...
పులకింతలు కలిగించేననీ
అది జతగా నను చేరాలని ..
నా బ్రతుకే శృతి చేయాలని
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
కమ్మని కలకే రూపం వస్తే ..
అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది ...
తీయని పాటకు ప్రాణం వస్తే ..
అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి