RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, ఏప్రిల్ 2025, సోమవారం

తిరుమల మందిర సుందరా | Tirumala mandira Sundara | Song Lyrics | Menakodalu (1972)

తిరుమల మందిర సుందరా



చిత్రం :  మేనకోడలు (1972)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  ఘంటసాల  


పల్లవి :


తిరుమల మందిర సుందరా..  

సుమధుర కరుణా సాగరా

ఏ పేరున నిను పిలిచేనురా.. 

ఏ రూపముగా కొలిచేనురా

తిరుమల మందిర సుందరా.. 

సుమధుర కరుణా సాగరా 


చరణం 1 :


పాలకడలిలో శేష శెయ్యపై 

పవళించిన శ్రీపతివో

పాలకడలిలో శేష శెయ్యపై 

పవళించిన శ్రీపతివో

వెండికొండపై నిండుమనముతో 

వేలిగే గౌరీపతివో

ముగురమ్మలకే మూలపుటమ్మగ 

భువిలో వెలసిన ఆదిశక్తివో


తిరుమల మందిర సుందరా.. 

సుమధుర కరుణా సాగరా


చరణం 2 :


కాంతులు చిందే నీ ముఖ బింబం 

కాంచిన చాలును గడియైనా

కాంతులు చిందే నీ ముఖ బింబం 

కాంచిన చాలును గడియైనా

నీ గుడి వాకిట దివ్వెను నేనై 

వెలిగిన చాలును ఒక రేయైనా

నీ పదముల పై కుసుము నేనై 

నిలచిన చాలును క్షణమైనా


తిరుమల మందిర సుందరా.. 

సుమధుర కరుణా సాగరా

ఏ పేరున నిను పిలిచేనురా.. 

ఏ రూపముగా కొలిచేనురా

తిరుమల మందిర సుందరా.. 

సుమధుర కరుణా సాగరా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు