RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, ఏప్రిల్ 2025, గురువారం

నా మది నిన్ను పిలిచింది | Naa madi ninnu Pilichindi | Song Lyrics | Aradhana (1976)

నా మది నిన్ను పిలిచింది



చిత్రం: ఆరాధన (1976)

సంగీతం: ఎస్. హనుమంతరావు

గీతరచయిత: సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం: మహమ్మద్ రఫీ


పల్లవి:


ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...

ప్రియతమా...


నా మది నిన్ను పిలిచింది గానమై

వేణు గానమై నా ప్రాణమై

నా మది నిన్ను పిలిచింది గానమై

వేణు గానమై నా ప్రాణమై


చరణం 1:


ఎవ్వరివో నీవు నే నెరుగలేను

ఏ పేరున నిన్ను నే పిలువగలను

ఎవ్వరివో నీవు నే నెరుగలేను

ఏ పేరున నిన్ను నే పిలువగలను


తలపులలోనే నిలిచేవు నీవే

తొలకరి మెరుపుల రూపమై


నా మది నిన్ను పిలిచింది గానమై

వేణు గానమై నా ప్రాణమై 


చరణం 2:


ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను

ఈ మూగబాధ ఎందాక దాచేను

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను

ఈ మూగబాధ ఎందాక దాచేను


వేచిన మదినే వెలిగింప రావే

ఆరని అనురాగ దీపమై


నా మది నిన్ను పిలిచింది గానమై

వేణు గానమై నా ప్రాణమై

నా మది నిన్ను పిలిచింది గానమై

వేణు గానమై నా ప్రాణమై


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నవ్వు నవ్వించు | Navvu Navvinchu | Song Lyrics | Lakshmi Nivasam (1968)

నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు  చిత్రం: లక్ష్మీ నివాసం (1968) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల పల్లవి: నవ్వు..నవ్విం...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు