జయ జయ రామా సమరవిజయ రామా
సాహిత్యం : శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య
ఆల్బం : శ్రీరామ గానామృతం
గానం : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :
జయ జయ రామా సమరవిజయ రామా
భయహర నిజభక్తపారీణ రామా
చరణం 1 :
జలధి బంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లు విరిచిన సీతారామా
అలసుగ్రీవునేలిన అయోధ్యరామా
కలగి యజ్ఞముగాచే కౌసల్యరామా
చరణం 2 :
అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గాచే కోదండరామా
ధర నహల్యపాలిటి దశరథరామా
హరురాణినుతుల లోకాభిరామా
చరణం 3 :
అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణ రామా
వితత మహిమల శ్రీవేంకటాద్రిరామా
మతిలోన బాయని మనువంశ రామా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి