RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
vennelaina cheekataina లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vennelaina cheekataina లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మే 2022, సోమవారం

వెన్నెలైనా చీకటైనా | Vennelaina Cheekataina | Song Lyrics | Pachani Kapuram (1985)

 వెన్నెలైనా చీకటైనా



చిత్రం:  పచ్చని కాపురం (1985)

సంగీతం:  చక్రవర్తి

గీతరచయిత:  సినారె

నేపధ్య గానం:  ఏసుదాస్, జానకి



పల్లవి:


    ఆ..ఆ..ఆ..


    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

    నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము

    ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము

    నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు

    ప్రేమకు మనమే తీరాలు


    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

    నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము


చరణం 1:


    జ్ఞాపకమేదో.. నీడల్లె తారాడే.. 

స్వప్నాలేవో.. నీ కళ్ళ దోగాడే

    కౌగిలింతలోన గాలి ఆడకూడదు.. 

చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు

    నీ సర్వమూ.. నాదైనదీ..

    నేను దేహమల్లె.. నీవు ప్రాణమల్లె 

ఏకమైన రాసలీలలోనా..


    వెన్నెలైనా.. చీకటైనా.. 

చేరువైనా.. దూరమైనా


చరణం 2:


    అంతంలేనీ.. నీ రాగ బంధంలో.. 

అంచున నిలిచీ.. నీ వైపే చూస్తున్నా

    పున్నమింత కట్టుకున్న పూలడోలలు.. 

ఎన్నడింక చెప్పవమ్మ బాలసారలు

    ఆ ముద్దులే.. మూడైనవీ..

    బాలచంద్రుడొస్తే.. నూలుపోగులిస్తా.. 

ఇంటి దీపమయ్యేదింకా ప్రేమా


    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

    నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము

    ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము

    నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు

    ప్రేమకు మనమే తీరాలు..


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు