RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ragam teese koyila లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ragam teese koyila లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, మే 2022, శనివారం

రాగం తీసే కోయిలా | Ragam teese koyila | Song Lyrics | Naga Malli (1980)

రాగం తీసే కోయిలా



చిత్రం: నాగమల్లి (1980)

సంగీతం: రాజన్-నాగేంద్ర

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


రాగం తీసే కోయిలా.. 

కోయకు గుండెలు తీయగా

రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా


బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా

బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా

పిలవని.. పిలుపుగా ..రాకే నీవిలా


రాగం తీసే కోయిలా.. 

కోయకు గుండెలు తీయగా

రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా


చరణం 1:


జంటని ఎడబాసినా.. 

ఒంటరి నా బ్రతుకునా

మల్లెల సిరివెన్నెల.. 

మంటలు రేపగా...


వయసుల నులి వెచ్చని.. 

వలపుల మనసిచ్చిన

నా చెలి చలి వేణువై.. 

వేదనలూదగా...


తొలకరీ పాటలే.. తోటలో పాడకే.. 

పదే పదే పదే పదాలుగా


రాగం తీసే కోయిలా.. 

కోయకు గుండెలు తీయగా

రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా


చరణం 2:


పగిలిన నా హృదయమే.. 

రగిలెనే ఒక రాగమై

అడవిలో వినిపించిన.. 

ఆమని పాటగా...


అందమే నా నేరమా.. 

పరువమే నా పాపమా

ఆదుకోమని చెప్పవే.. 

ఆఖరి మాటగా...


గుండెలో మురళిని.. గొంతులో ఊదకే.. 

పదే పదే పదే పదాలుగా...


రాగం తీసే కోయిలా.. 

కోయకు గుండెలు తీయగా

రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు