కనులు మాట లాడునని
చిత్రం : మాయని మమత (1970)
రచన : సి నారాయణ రెడ్డి,
సంగీతం : అశ్వథామ,
గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
కనులు మాటలాడునని.. ఈ...
మనసు పాట పాడునని.. ఈ...
కనులు మాటలాడునని..
మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు..
అది కనుగొన్నాను ఈనాడు
కనులు మాటలాడునని..
మనసు పాట పాడునని
కవితలల్లగ విన్నాను..
అది కనుగొన్నాను ఈనాడు
చరణం 1:
మెత్తగ సాగే మేనితీగ
మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ... ఆ.... ఆ... ఆ...ఆ... ఆ...
మెత్తగ సాగే మేనితీగ
మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ మేనితీగ వలపుల పందిట
అల్లుకుంటే.. ఒక అందం
మలయానిలమున చెలి ముంగురుల
మబ్బులూగితే.. ఒక అందం
ఆ ముంగురులే చెలికాణి మోముపై
ముసురుకుంటే.. ఒక అందం
అదే... ముద్దులొలికే అనుబంధం...
కనులు మాటలాడునని..
మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు..
అది కనుగొన్నాను ఈనాడు
చరణం 2:
వేచిన కలువ వెన్నెల జల్లుల
విరిసిపోతే.. మధురానందం
ఆ కలువ చెలువ నెలరాయునిలో
కరిగిపోతే.. మహదానందం
జగములనేలే చంద్రవదనతో
ఎగిసిపోతే.. దివ్యానందం
ఎగిసి ఎగిసి పులకించిన మనసులు
ఏకమైతే.. రసానందం...
అదే... యుగయుగాల అనుబంధం...
- పాటల ధనుస్సు