వీడే ధీర వీర సూర భీమసేనుడు
చిత్రం : మండే గుండెలు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
వీడే ధీర వీర సూర భీమసేనుడు..
వీడే ధీర వీర సూర భీమసేనుడు...
వీడి దెబ్బకెవరైనా దిమ్మ తిరిగిపోతాడు
భలే రోసగాడు... మహా మోసగాడు...
సూదల్లే వచ్చాడు... దబ్బనమైతేలాడు
వీడే ధీర వీర సూర భీమసేనుడు..
చరణం 1 :
ఒక్క మాటతో రేపావు పౌరుషాన్ని...
ఒక్క చూపుతో కదిపావు హృదయాన్ని
ఒక్క మాటతో రేపావు పౌరుషాన్ని...
ఒక్క చూపుతో కదిపావు హృదయాన్ని
అది ఆగనంటోందా?... ఇది పోరు పెడుతోందా?
అది ఆగనంటోందా?... ఇది పోరు పెడుతోందా?
రెంటికీ వెయ్యనా కౌగిలింత కళ్ళాన్ని
వీడే ధీర వీర సూర భీమసేనుడు...
వీడి దెబ్బకెవరైనా దిమ్మ తిరిగిపోతాడు
వీడే ధీర వీర సూర భీమసేనుడు... అహా..
చరణం 2 :
ఎగరేసుకుపోతాను బంతిలాగా...
ముద్దు చేసుకుంటాను ముద్దబంతి లాగా
ఎగరేసుకుపోతాను బంతిలాగా...
ముద్దు చేసుకుంటాను ముద్దబంతి లాగా
చూసుకుంటాలే నిన్ను పైటలాగా
చూసుకుంటాలే నిన్ను పైటలాగా
దాచుకుంటాలే.... తాళిబొట్టులాగా
అహా... వీడే ధీర వీర సూర భీమసేనుడు
చరణం 3 :
నువ్వు 'ఊ ' అంటే ఊపుతా లోకాన్ని...
నువ్వు 'సై ' అంటే దింపుతా స్వర్గాన్ని
నువ్వు 'ఊ ' అంటే ఊపుతా లోకాన్ని...
నువ్వు 'సై ' అంటే దింపుతా స్వర్గాన్ని
నీ లోకం నాతోనే... నా స్వర్గం నీలోనే
నీ లోకం నాతోనే... నా స్వర్గం నీలోనే
రెండు కలిసి ఉన్నది రెండు జతల కళ్ళలోనే
అహ..హ.. హా..
వీడే ధీర వీర సూర భీమసేనుడు...
వీడి దెబ్బకెవరైనా దిమ్మ తిరిగిపోతాడు
భలే రోసగాడు... మహా మోసగాడు...
సూదల్లే వచ్చాడు... దబ్బనమైతేలాడు
వీడే ధీర వీర సూర భీమసేనుడు..
వీడే ధీర వీర సూర భీమసేనుడు..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి