RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, మే 2024, శుక్రవారం

ఒక్కసారి మందుకొట్టు | Okkasari Mandukottu | Song Lyrics | Muddula Koduku (1979)

ఒక్కసారి మందుకొట్టు



చిత్రం :  ముద్దుల కొడుకు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


ఇంతే సంగతులు... 

చిత్తగించవలెను..అహాహాహా


ఏయ్... ఒక్కసారి మందుకొట్టు మహదేవా

నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా

ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా

నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా


గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ ఆ ఆ

చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆహా..ఆ

గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ

చిటికేసి చిందులేయ్ మహాదేవా..


ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా

నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా


చరణం 1 :


పూనకాల స్వామికి... పానకాలు పొయ్యరా

తందనాల స్వామికి... వందనాలు చెయ్యరా

పూనకాల స్వామికి... పానకాలు పొయ్యరా

తందనాల స్వామికి... వందనాలు చెయ్యరా


వినోదానికి ఇది విందురా... 

మనోవ్యాధికి ఇదే మందురా..ఆహా.. హా

వినోదానికి ఇది విందురా... 

మనోవ్యాధికి ఇదే మందురా


ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా

నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా


చరణం 2 :


తప్పతాగినోడే దానకర్ణుడు... 

తాగి కుప్పకూలినోడే కుంభకర్ణుడు

తప్పతాగినోడే దానకర్ణుడు... 

తాగి కుప్పకూలినోడే కుంభకర్ణుడు


చెప్పకు తిప్పలు మహదేవా... 

చేతికి చిప్పరా గురుదేవా..ఆహాహా..ఆ

చెప్పకు తిప్పలు మహదేవా... 

చేతికి చిప్పరా గురుదేవా


గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ

చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆ..హా..ఆ


ఒక్కసారి మందుకొట్టు మహదేవా

నిన్నొదలి పెడితే... 

ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా


చరణం 3 :


కులాసాలు మితి మీరాయంటే... 

కురుక్షేత్ర రణరంగాలు

విలాసాలు శృతిమించాయంటే... 

శివమెత్తిన శివతాండవాలు

కులాసాలు మితి మీరాయంటే... 

కురుక్షేత్ర రణరంగాలు

విలాసాలు శృతిమించాయంటే... 

శివమెత్తిన శివతాండవాలు 


శంభో శంకర మహదేవా... 

సాంబసదా శివ గురుదేవా

శంభో శంకర మహదేవా... 

సాంబసదా శివ గురుదేవా


ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా

నిన్నొదలి పెడితే... 

ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా


గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ

చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆ..హా..ఆ


ఒక్కసారి మందుకొట్టు మహదేవా

నిన్నొదలి పెడితే... 

ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా

ఇంతే సంగతులు.. చిత్తగించవలెను


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు