RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, మే 2024, సోమవారం

ఇది నా హృదయం ఇది నీ నిలయం | Idi Naa Hrudayam | Song Lyrics | Sri Tirupathi Venkateswara Kalyanam (1979)

ఇది నా హృదయం ఇది నీ నిలయం



చిత్రం :  శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)

సంగీతం :  పెండ్యాల

రచన  : దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి,

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


ఇది నా హృదయం.. 

ఇది నీ నిలయం..

ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. 

అందని ఆనందాలయం


ఇది నా హృదయం .. 

ఇది నీ నిలయం

ఇది సురమునియోగీశ్వరుల చూపులకు.. 

అందని ఆనందాలయం

ఇది నా హృదయం .. 


చరణం 1 :


ఇది నా "శ్రీ" నివాసం... 

ఇది నీ రాణి వాసం

ఇది నా "శ్రీ" నివాసం... 

ఇది నీ రాణి వాసం

నాపై నీకింత అనురాగమా?... 

నా పై మీకింత ఆదరమా..

ఇది నీ ప్రణయ డోళ.. 

ఇది నా ప్రభువుని లీలా .. ఆ .. ఆ..


ఇది నా హృదయం .. 

ఇది నీ నిలయం

ఇది సురమునియోగీశ్వరుల చూపులకు 

అందని ఆనందాలయం

ఇది నా హృదయం .. 


చరణం 2 :


ఎల్లలోకముల ఏలేవారికి 

ఈడా... జోడా ఈ సిరి?

వికుంఠపురిలో విభువక్షస్థలి 

విడిది చేయు నా దేవేరి ..

ఇది నా భాగ్యం... ఇది మన భోగం..


ఇది నా హృదయం .. 

ఇది నీ నిలయం...

ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. 

అందని ఆనందాలయం

ఇది నా హృదయం ..


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు