RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, మే 2024, శనివారం

అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి | Allarumudduga Perigindi | Song Lyrics | Joodagadu (1979)

అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి



చిత్రం: జూదగాడు (1979)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి

అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి

అత్తవారింటికి తరలింది

మా చెల్లి బంగారు తల్లీ ...

మా అక్కా చక్కనీ చుక్కా ...

పోయిరావమ్మా... పేరు తేవమ్మా... 

బంగారు తల్లీ


అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి

అత్తవారింటికి తరలింది


చరణం 1:


పూజ చేసి.. ఏరి కోరీ.. 

నిన్ను చేసుకుంది

పూజ చేసి.. ఏరి కోరీ.. 

నిన్ను చేసుకుంది


పువ్వుల్లో పెట్టుకో... 

చిరునవ్వుల్లో దాచుకో

మనసారా కాపురాన్ని మలుచుకో...

మా లక్ష్మికి అండగా 

మేమున్నాం తెలుసుకో

బావా.. ఓ .. మా మంచి బావా

బావా.. ఓ .. మా మంచి బావా


అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి

అత్తవారింటికి తరలింది


చరణం 2:


బావగారూ.. మహా గడుసువారూ.. 

మంచి చేసుకో

బావగారూ.. మహా గడుసువారూ.. 

మంచి చేసుకో


చిలిపి పనులు చేశాడో... 

ఆ చెవులు పుచ్చుకో

కట్టుకున్నవాడు కలకాలం 

నీ మదిలోనే ఉన్నా...

తోడబుట్టినాము మమ్ము 

క్షణ కాలం తలుచుకో


చెల్లీ.. ఓ.. బంగారు తల్లీ..

అక్కా.. ఓ.. చక్కని చుక్కా


అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి

అత్తవారింటికి తరలింది

మా చెల్లి బంగారు తల్లీ ...

మా అక్కా చక్కనీ చుక్కా ...

పోయిరావమ్మా... పేరు తేవమ్మా...

బంగారు తల్లీ... బంగారు తల్లీ ...


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు | Nee Jadakuchulu Naa Medakuchulu | Song Lyrics | Shubhalekha (1982)

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు  చిత్రం : శుభలేఖ (1982) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి సాకి :  ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు