లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల,
గీతరచయిత : పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం : ఘంటసాల,
పల్లవి :
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుషప్రపంచం
లేచింది మహిళాలోకం
చరణం 1 :
ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా...
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
చరణం 2:
పల్లెటూళ్ళలో పంచాయితీలు
పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పంచాయితీలు
పట్టణాలలో ఉద్యోగాలు
అది యిది యేమని అన్ని రంగముల...
అది యిది యేమని అన్ని రంగముల
మగధీరులనెదిరించారు
నిరుద్యోగులను పెంచారు
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
చరణం 3:
చట్టసభలలో సీట్ల కోసం
భర్తల తోనే పోటీ చేసి
చట్టసభలలో సీట్ల కోసం
భర్తల తోనే పోటీ చేసి
డిల్లి సభలో పీఠం వేసి...
డిల్లి సభలో పీఠం వేసి
లెక్చర్ లెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారు
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుషప్రపంచం
లేచింది, నిద్ర లేచింది
నిద్ర లేచింది మహిళాలోకం
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి