RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
lechindi nidra lechindi mahila lokam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
lechindi nidra lechindi mahila lokam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మే 2024, ఆదివారం

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం | Lechindi Nidra Lechindi | Song Lyrics | Gundamma Katha (1962)

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం



చిత్రం : గుండమ్మ కథ (1962)

సంగీతం : ఘంటసాల,

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  

నేపధ్య గానం : ఘంటసాల,

 

పల్లవి :


లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం

దద్దరిల్లింది పురుషప్రపంచం

లేచింది మహిళాలోకం


చరణం 1 :


ఎపుడో చెప్పెను వేమనగారు

అపుడే చెప్పెను బ్రహ్మంగారు

ఎపుడో చెప్పెను వేమనగారు

అపుడే చెప్పెను బ్రహ్మంగారు

ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా...

ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా

విస్సన్న చెప్పిన వేదం కూడా


లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం


చరణం 2:


పల్లెటూళ్ళలో పంచాయితీలు

పట్టణాలలో ఉద్యోగాలు

పల్లెటూళ్ళలో పంచాయితీలు

పట్టణాలలో ఉద్యోగాలు

అది యిది యేమని అన్ని రంగముల...

అది యిది యేమని అన్ని రంగముల

మగధీరులనెదిరించారు

నిరుద్యోగులను పెంచారు


లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం


చరణం 3:


చట్టసభలలో సీట్ల కోసం

భర్తల తోనే పోటీ చేసి

చట్టసభలలో సీట్ల కోసం

భర్తల తోనే పోటీ చేసి

డిల్లి సభలో పీఠం వేసి...

డిల్లి సభలో పీఠం వేసి

లెక్చర్ లెన్నో దంచారు

విడాకు చట్టం తెచ్చారు


లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం

దద్దరిల్లింది పురుషప్రపంచం

లేచింది, నిద్ర లేచింది

నిద్ర లేచింది మహిళాలోకం


- పాటల ధనుస్సు  



పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు