చీకటి వెలుగుల చెలగాటం
చిత్రం : ముద్దుల కొడుకు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
చీకటి వెలుగుల చెలగాటం...
ఎండవానల కోలాటం
హద్దులు మరచిన ఆరాటం...
పొద్దే ఎరగని పోరాటం
చీకటి వెలుగుల చెలగాటం...
ఎండవానల కోలాటం
హద్దులు మరచిన ఆరాటం...
పొద్దే ఎరగని పోరాటం
చీకట వెలుగుల చెలగాటం... మ్మ్
చరణం 1 :
నిద్దరనే నిద్దరపొమ్మని...
నీలికళ్ళు ఎర్రగ చెపితే
కౌగిలినే కమ్ముకుపొమ్మని...
కన్నెచూపు కమ్మగ చెపితే
నిద్దరనే నిద్దరపొమ్మని...
నీలికళ్ళు ఎర్రగ చెపితే
కౌగిలినే కమ్ముకుపొమ్మని...
కన్నెచూపు కమ్మగ చెపితే
ఎప్పటికీ తీరని వలపుల...
తరిమిన కొద్దీ ఉరుముతు ఉంటే
ఎప్పటికీ తీరని వలపుల...
తరిమిన కొద్దీ ఉరుముతు ఉంటే
ఆ నులివెచ్చని ముచ్చటలో...
నా మనసిచ్చిన మచ్చికలో
చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ
చీకటి వెలుగుల చెలగాటం..
ఎండ వానల కోలాటం
చరణం 2 :
సందెగాలి రిమరిమలన్నీ...
చక్కలిగిలి సరిగమలైతే
సందెగాలి రిమరిమలన్నీ...
చక్కలిగిలి సరిగమలైతే
సన్నజాజి ఘుమఘుమలన్నీ...
చలిలో చెలి సరసాలైతే
సన్నజాజి ఘుమఘుమలన్నీ...
చలిలో చెలి సరసాలైతే
పూలగాలి పులకింతలకే...
పురివిప్పిన నిను చూస్తుంటే
పూలగాలి పులకింతలకే...
పురివిప్పిన నిను చూస్తుంటే
కులికే నా చెలి పెదవులలో...
కురిసే కుంకుమ పూవులలో
చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ
చీకటి వెలుగుల చెలగాటం..
ఎండ వానల కోలాటం
చరణం 3 :
మొదటి ముద్దు కొసరే వేళ...
ముగ్గులోకి రానంటుంటే
చివరి హద్దు దాటే వేళ...
సిగ్గు సిగ్గు పడిపోతుంటే
మొదటి ముద్దు కొసరే వేళ...
ముగ్గులోకి రానంటుంటే
చివరి హద్దు దాటే వేళ...
సిగ్గు సిగ్గు పడిపోతుంటే
ఎవ్వరికీ దొరకని నేరం...
ఇద్దరికీ వరమౌతుంటే
ఎవ్వరికీ దొరకని నేరం...
ఇద్దరికీ వరమౌతుంటే
మనలో కలిగిన మైకంలో...
మనమే మిగిలిన లోకంలో
చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ
చీకటి వెలుగుల చెలగాటం...
ఎండవానల కోలాటం
హద్దులు మరచిన ఆరాటం...
పొద్దే ఎరగని పోరాటం..మ్మ్ మ్మ్ మ్మ్
చీకటి వెలుగుల చెలగాటం...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి