RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, మే 2024, శుక్రవారం

ఏమిటోననుకుంటి గోంగూరకి | Yemitonanukonti Gonguraki | Song Lyrics | Intinti Katha (1974)

ఏమిటోననుకుంటి గోంగూరకి



చిత్రం : ఇంటింటి కథ (1974)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : కొసరాజు

నేపధ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి    


పల్లవి : 


ఏమిటోననుకుంటి గోంగూరకి... 

నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి

ఏమిటోననుకుంటి గోంగూరకి... 

నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి 


సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకి... 

వాడు సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకి

సెప్పుకుంటే... అబ్బా.. 

సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...

అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...

ఏమిటోననుకుంటి గోంగూరకి... 

నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి 


చరణం 1 :


సుక్కబొట్టు పెట్టుకొని.. సిగనుపూలు సుట్టుకొని...

పుంగనూరు గట్టుకాడ పుల్లలేరుతుంటేను

సుక్కబొట్టు పెట్టుకొని.. సిగనుపూలు సుట్టుకొని...

పుంగనూరు గట్టుకాడ పుల్లలేరుతుంటేను


ఒంటిగానిగా చూసి ఎంట తగులుకున్నాడే..

చేను చుట్టు తిప్పాడే... చెయ్యి పైన ఏశాడే

చెయ్యి పైన ఏశాడే... ఏశాడే...

అవ్వా... సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...

అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 


ఏమిటోననుకుంటి గోంగూరకి... 

నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి

సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకి...

సెప్పుకుంటే... అబ్బా.. 

సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...

అవ్వా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 


చరణం 2 :


కడవ సంకనెట్టుకొని... కట్ట మీద వస్తుంటే

మర్రిమాను కాడ వాడు మాటేసి ఉన్నాడు

కడవ సంకనెట్టుకొని... కట్ట మీద వస్తుంటే

మర్రిమాను కాడ వాడు మాటేసి ఉన్నాడు


మాయలెన్నో చేశాడే... మనసు విరగదీశాడే

మోజు తీర్చమన్నాడే... ముద్దులీయమన్నాడే

ముద్దులీయమన్నాడే... ఇయ్యమన్నాడే...

అవ్వా... సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...

అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 


ఏమిటోననుకుంటి గోంగూరకి... 

నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి

సిలిపి దొంగ సచ్చినాడే గోంగూరకి...

అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...

అవ్వా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు