RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, మే 2024, శుక్రవారం

చల్లా చల్లని చందమామా | Challa Challani Chandamama | Song Lyrics | Mande Gundelu (1979)

చల్లా చల్లని చందమామా



చిత్రం :  మండే గుండెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


చల్లా చల్లని చందమామా... 

ఇలా వేడెక్కిపోతే ఏలాగమ్మా

చల్లా చల్లని చందమామా... 

ఇలా వేడెక్కిపోతే ఏలాగమ్మా


అత్తమీద కోపం దుత్తమీద చూపేది

అన్యాయం అన్యాయం చల్లారమ్మా

అత్తమీద కోపం దుత్తమీద చూపేది

అన్యాయం అన్యాయం చల్లారమ్మా

దపా దపా దపదపదప... 

దపా దపా దపదపదప


చల్లా చల్లని చందమామా... 

ఇలా వేడెక్కిపోతే ఏలాగమ్మా


చరణం 1 :


దిబ్బరొట్టె వున్నాది తినుకోనూ... 

చేప పులుసు వున్నాది నంజుకోనూ

దిబ్బరొట్టె వున్నాది తినుకోనూ... 

చేప పులుసు వున్నాది నంజుకోనూ


తిని చూడు ఒకసారి రవ్వంతా... 

దెబ్బకు దిగుతుంది వేడంతా

తినిచూడు ఒకసారి రవ్వంతా... 

దెబ్బకు దిగుతుంది వేడంతా


దిగకుంటె నీమీద ఒట్టేనూ... 

తినకుంటే నేనీడే ఛస్తానూ

దిగకుంటె నీమీద ఒట్టేనూ... 

తినకుంటే నేనీడే ఛస్తానూ

దపా దపా దపదపదప... 

దపా దపా దపదపదప


అల్లరల్లరి సత్యభామా... 

అసలే వేడెక్కి వున్నాను ఊర్కోవమ్మా

అల్లరల్లరి సత్యభామా... 

అసలే వేడెక్కి వున్నాను ఊర్కోవమ్మా


అత్త మీద కోపం చూపెందుకు 

నాకు దుత్తల్లే నువ్వే దొరికావమ్మా

అత్తమీద కోపం చూపెందుకు 

నాకు దుత్తల్లే నువ్వే దొరికావమ్మా

భామా భామా భామా భామా భామా.... 

భామా భామా భామా భామా భామా


అల్లరల్లరి సత్యభామా... 

అసలే వేడెక్కి వున్నాను ఊర్కోవమ్మా


చరణం 2 :


దిబ్బరొట్టెకన్నా నీ బుగ్గలున్నవి... 

చేప పులుసు కన్నా నీ పెదవులున్నవి

దిబ్బరొట్టెకన్నా నీ బుగ్గలున్నవి... 

చేప పులుసు కన్నా నీ పెదవులున్నవి


రెండిట్లో చల్లార్చే గుణమున్నదీ... 

ఊర్కొంటే వుసిగొలిపే దుడుకున్నది

రెండిట్లో చల్లార్చే గుణమున్నదీ... 

ఊర్కొంటే వుసిగొలిపే దుడుకున్నది


చవి చూడమంటావ రవ్వంతా... 

నెమరేసుకొంటావు రాత్రంతా

చవి చూడమంటావ రవ్వంతా... 

నెమరేసుకొంటావు రాత్రంతా

దపా దపా దపదపదప...  

పదా పదా పదపదపద


చల్లా చల్లని చందమామా... 

ఇలా వేడెక్కిపోతే ఏలాగమా

అల్లరల్లరి సత్యభామా... 

అసలే వేడెక్కి ఉన్నాను ఊర్కోవమ్మా


అత్త మీద కోపం దుత్తమీద చూపేది... 

అన్యాయం అన్యాయం చల్లారమ్మా

అత్త మీద కోపం చూపెందుకు 

నాకు దుత్తల్లే నువ్వే దొరికావమ్మా

దపా దపా దపదపదప... 

భామా భామా భామభామభామ

లా..లా లాలా లలలలా... 

లా లలలలాలలల్లలల్లా


-  పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు