RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, మే 2024, ఆదివారం

దగాలు చేసి దిగాలు పడ్డా | Dagalu Chesi Digalu Padda | Song Lyrics | Muddula Koduku (1979)

దగాలు చేసి దిగాలు పడ్డా



చిత్రం :  ముద్దుల కొడుకు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


దగాలు చేసి దిగాలు పడ్డా 

దసరాబుల్లోడా

సవాలు చేస్తా జవాబు చెప్పర 

సరదా చిన్నోడా


దగాలు చేసి దిగాలు పడ్డా 

దసరాబుల్లోడా

సవాలు చేస్తా జవాబు చెప్పర 

సరదా చిన్నోడా

చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా..

చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా


చరణం 1 :


మనసునే కదిలించావు... 

మమతలే వెలిగించావు

మనిషిలా ప్రేమించావు... 

ప్రేమకై జీవించావు

మనసునే కదిలించావు... 

మమతలే వెలిగించావు

మనిషిలా ప్రేమించావు... 

ప్రేమకై జీవించావు


ఆరాధనే మరచీ... 

అంతస్తులే వలచీ..ఈ

ఆరాధనే మరచీ... 

అంతస్తులే వలచీ

ఆస్తిపరుల ముద్దులకొడుకై... 

ఆదమరచి ఉన్నావా?

ఆత్మబలం విడిచావా?


లేదు..లేదు..మరచిపోలేదు..Never


చిన్నోడా..దసరబుల్లోడా..

చిన్నోడా..దసరబుల్లోడా


దగాలుచేసి దిగాలుపడ్డా 

దసరాబుల్లోడా

సవాలు చేస్తా జవాబు చెప్పర 

సరదా చిన్నోడా


చరణం 2 : 


బంగారుబాబుల ఆట... 

బంగారుబొమ్మల వేట

అదృష్టవంతులు పాడే... 

అల్లరిచిల్లరి వేలంపాట

బంగారుబాబుల ఆట... 

బంగారుబొమ్మల వేట

అదృష్టవంతులు పాడే... 

అల్లరిచిల్లరి వేలంపాట


నీ ఆటపాటలలో... 

నీ ఆడుగుజాడలలో..ఓఓఓ

నీ ఆటపాటలలో... 

నీ ఆడుగుజాడలలో..ఓఓఓ

అందాల జాబిలి బ్రతుకే... 

అమావాస్య చేసావా సమాధి కట్టేసావా


నేను సమాధి కట్టానా..NO..NO


ఉన్న మాటకే ఉలికిపడి... 

లేని మనసునే

తడుముకునే... 

మోసగాడు ఒక మనిషేనా..ఆ


ఏమిటి... ఏవర్ని గురించి నువ్వనేది?


నిప్పులాంటిది నీ గతం... 

తప్పతాగినా ఆరదు

ఎంత దాచినా దాగదు... 

నిన్ను దహించక తప్పదు


Stop it


తప్పదు... Stop it


తప్పదు... Stop it


తప్పదు... I Say Stop it


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు