చిటుకు చిటుకు చిటుకుమంటు
చిత్రం : మంచి బాబాయ్ (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
హాయ్..యా..
అహా...
అహా.. చిటుకు చిటుకు చిటుకుమంటు..
చిటికెలేసి ఎగురుకుంటు
చిటుకు చిటుకు చిటుకుమంటు..
చిటికెలేసి ఎగురుకుంటు
దూసుకుని వస్తున్నాడోయ్ క్రిష్టయ్య..
సోకులతో తెస్తున్నాడోయ్... ఒ..ఓ..ఓ..ఓయ్
చిటుకు చిటుకు చిటుకుమంటు..
చిటికెలేసి ఎగురుకుంటు
దూసుకుని వస్తున్నాడోయ్ క్రిష్టయ్య..
సోకులతో తెస్తున్నాడోయ్
అహా.. చిటుకు చిటుకు చిటుకుమంటు..
చిటికెలేసి ఎగురుకుంటు
చిటుకు చిటుకు చిటుకుమంటు..
చిటికెలేసి ఎగురుకుంటు
వయ్యారాలు ఒలకబోసెనోయ్ గోపెమ్మ..
వగలెన్నో ఆరబోసెనోయ్ ..ఒ..ఓ..ఓ..ఓయ్..
చిటుకు చిటుకు చిటుకుమంటు..
చిటికెలేసి ఎగురుకుంటు
వయ్యారాలు ఒలకబోసెనోయ్ గోపెమ్మ..
వగలెన్నో ఆరబోసెనోయ్
చరణం 1 :
క్రిష్టయ్య చేసిన పాడు అల్లరి..
చెప్పుకుంటే సిగ్గు చేటు.. హరి హరి
ఆ ఇంటిలో దూరి.. ఈ కొంపలో దూరి
ఉట్టి మీద జున్ను పాలు.. ఉట్టి మీద కాజేసె
చట్టిలో ఉన్న వెన్న.. పొట్ట నిండా మెక్కేసె
జలకాలాడుకుంటూ.. చిలకల కులుకులుంటే
చీరలను కొట్టెసి.. చెట్టు మీదకెక్కేసె ...
చెట్టు మీదకెక్కేసె
పాలు పితికే పడచును పైటపట్టి లాగేసే
ముగ్గు లేసే పడతికి బుగ్గ మీద బురద పూసె
చల్ల చిలికే భామకు చక్కిలి గిలి చేసె
నీళ్ళు మోసే మగువ నీటి కడవ తూటు చేసె
చల్లని వెన్నెల్లో పిల్లన గ్రోవి ఊది
మగువ రప్పించి .. మత్తు మందు గుప్పించి
రాసకేళి పేరుతో.. రచ్చరచ్చ చేసేసె
రాసకేళి పేరుతో.. రచ్చరచ్చ చేసేసె
క్రిష్టయ్య చేసిన పాడు అల్లరి..
చెప్పుకుంటే సిగ్గు చేటు హరి హరి
య్.. క్రిష్టయ్య చేసిన మంచి పనులు
మీకేమి తెలుసులే కాకమ్మలు
అన్నీ తన ఇల్లే.. అన్నీ తన ఊళ్ళే
అందుకే ఇంటింట నందబాలుడున్నాడే
తిన్నది వెన్న కాదే.. కోడల్ల పాపాలే
తాగింది పాలు కాదే.. అత్తల కోపాలే
సంసారమే కొలను.. స్నానాలే కోరికలు
కావవి చీరలు.. కళ్ళకు కమ్మిన పొరలు
ఎక్కింది చెట్టు కాదే.. అందని పై మెట్టు
మాయపొరల తొలగింపే..
మాధవుని లోగుట్టు .. మాధవుని లోగుట్టు
పడుచులనెందుకని ఉడికించెనో తెలుసా?
రాపిడి పెడితేనే రవ్వ విలువ తెలుసునని
పిల్లలగ్రోవిలోని పిలుపేమిటో తెలుసా?
ఆత్మల కలిపేదే ఆనంద సూత్రమది
ఏమిటా రాసకేళి.. కాదది కామకేళి
ఏమిటా రాసకేళి.. కాదది కామకేళి
తెలియకుంటే మోహమది..
తెలుసుకుంటే మోక్షమది
కృష్టయ్య చేసిన మంచి పనులు..
ఇప్పుడైన తెలిసెనా కాకమ్మలు
మీకు ఇప్పుడేనా తెలిసెనా కాకమ్మలు
చరణం 2 :
మెట్టవేదాంతమింక కట్టిపెట్టవోయ్...
ఉత్తుత్తి మాటలతో బెట్టు చూపకోయ్
కృష్టయ్య పస ఎంతో తేల్చమంటావా?
గుట్టలెక్కమంటావా? ... పిట్టలెక్కమంటావా?
గుట్టలొద్దు మిట్టలొద్దు.. ఉట్టీకొట్టవోయ్
నీ గట్టితనం జెట్టితనం చూపెట్టవోయ్
ఉట్టికొట్టి చూపుతాను... గోపెమ్మా
తాళిబొట్టూ కట్టి ఏలుతాను గున్నమ్మా
చిటుకు చిటుకు చిటుకుమంటు..
చిటికెలేసి ఎగురుకుంటు
దూసుకుని వస్తున్నాడోయ్ క్రిష్టయ్య..
సోకులతో తెస్తున్నాడోయ్
చిటుకు చిటుకు చిటుకుమంటు..
చిటికెలేసి ఎగురుకుంటు
వయ్యారాలు ఒలకబోసెనోయ్ గోపెమ్మ..
వగలెన్నో ఆరబోసెనోయ్
ఒ..ఓ..ఓ..ఓయ్.. ఒ..ఓ..ఓ..ఓయ్..
ఒ..ఓ..ఓ..ఓయ్.. ఒ..ఓ..ఓ..ఓయ్..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి