RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, మే 2025, శుక్రవారం

ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను | Ee Priyuraliki Pelle | Song Lyrics | Amara Prema (1978)

ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను



చిత్రం : అమర ప్రేమ (1978)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వీటూరి

నేపధ్య గానం : సుశీల  


పల్లవి : 


ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..

ప్రేమ ఫలించేనే

ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..

ప్రేమ ఫలించేనే


ఇంక పూవల్లే గువ్వల్లే నవ్వెనూ.. 

ఎన్నో ఊహల్లో ఉయ్యలలూగేను

ఇంక పూవల్లే గువ్వల్లే నవ్వెనూ.. 

ఎన్నో ఊహల్లో ఉయ్యలలూగేను


ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను.. 

ప్రేమ ఫలించేనే 


చరణం 1 :


పాడె నా గుండెలో నా ఊసులేవో... 

తీయని సంగీతం

నేడే కురిసే పూలజల్లు ఎదలో మాధుర్యం


పాడె నా గుండెలో నా ఊసులేవో..

తీయని సంగీతం

నేడే కురిసే పూలజల్లు..

ఎదలో మాధుర్యం..

నాలో మాధుర్యం..


ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను.. 

ప్రేమ ఫలించేనే


చరణం 2 :


పిలిచి నీ కళ్ళతోనే కోరుకుంటే... 

కలుగును ఆవేశం

వలచే నీ వయసు మేలుకుంటే... 

రగులును వ్యామోహం

నాలో... వ్యామోహం..


పిలిచి నీ కళ్ళతోనే కోరుకుంటే... 

కలుగును ఆవేశం

వలచే నీ వయసు మేలుకుంటే... 

రగులును వ్యామోహం

నాలో... వ్యామోహం..


ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..

ప్రేమ ఫలించేనే


- పాటల ధనుస్సు 



బాల పావురమా ఒక గూడు కడదామా | Bala Pavurama | Song Lyrics | Amara Prema (1978)

బాల పావురమా ఒక గూడు కడదామా


చిత్రం : అమర ప్రేమ (1978)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వీటూరి

నేపథ్య గానం : బాలు   


పల్లవి : 


బాల పావురమా ఒక గూడు కడదామా

బాల పావురమా ఒక గూడు కడదామా

నీవిలాగే నాతో రారాదా.. రారాదా.. 

ప్రేమించుకుందామా


బాల పావురం ఒక గూడు కడదామా

నీవిలాగే నాతో రారాదా.. రారాదా.. 

ప్రేమించుకుందామా

బాల పావురం... ఒక గూడు కడదామా 


చరణం 1 :


బాధలే వచ్చినా.. ఓర్చుకొందామూ

బ్రతుకులో ఆనందం.. 

పంచుకుందామూ.. నవ్వుకొంటూనే


బాధలే వచ్చినా.. ఓర్చుకొందామూ

బ్రతుకులో ఆనందం.. 

పంచుకుందామూ.. నవ్వుకొంటూనే

ఇద్దరమొకటై ఉందామూ

బాల పావురం ఒక గూడు కడదామా


చరణం 2 :


జీవితం పున్నమిగా చేసుకుందామూ

నవ్వుతూ ఇలాగే ఏకమౌదామూ... 

ఆడుకుందామూ


రమ్మనీ మృత్యువూ చేరువైతేనూ

నవ్వుతూ ఇలాగే.. కలసిపోదామూ... 

కరిగిపోదామూ

అమరము కాదా మన ప్రేమా..


బాల పావురమా ఒక గూడు కడదామా

నీవిలాగే నాతో రారాదా.. రారాదా.. 

ప్రేమించుకుందామా

బాల పావురమా ఒక గూడు కడదామా 


- పాటల ధనుస్సు 


ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా | Dhumdhum dhumaga | Song Lyrics | Allari Pillalu (1978)

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా



చిత్రం :  అల్లరి పిల్లలు (1978)

సంగీతం : సత్యం

గీతరచయిత :  కొసరాజు

నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  

పెత్తనమంతా నాదే

ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... 

అధికారమంతా నాదే

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  

పెత్తనమంతా నాదే

ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... 

అధికారమంతా నాదే


చరణం 1 :


అప్పుడు రాముడు విల్లు విరిచెను 

జానకి కోసం

ఇప్పుడు అన్నీ నే విరిచేస్తా... 

హక్కుల కోసం

అప్పుడు రాముడు విల్లు విరిచెను 

జానకి కోసం

ఇప్పుడు అన్నీ నే విరిచేస్తా... 

హక్కుల కోసం


ఓ.. ఓ.. మహిషాసురిని మర్ధించే కాళి 

లోకం కోసం

మహిషాసురిని మర్ధించే కాళి 

లోకం కోసం

ఇక్కడ చిక్కినవన్నీ ముక్కలు చేస్తా  

ప్రతిష్ట కోసం


హ..హా.. ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  

పెత్తనమంతా నాదే

ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... 

అధికారమంతా నాదే


చరణం 2 :


ద్రౌపది శపధం దుశ్శాసనుని 

డొక్క చీల్చినది నాడు

ద్రౌపది శపధం దుశ్శాసనుని 

డొక్క చీల్చినది నాడు

ఇక్కడ కొంటెతనం ఎవరు చేసినా 

పచ్చడి చేస్తా నేడు

ఇక్కడ కొంటెతనం ఎవరు చేసినా 

పచ్చడి చేస్తా నేడు


ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... 

అధికారమంతా నాదే

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  

పెత్తనమంతా నాదే


చరణం 3 :


తెలవాడి పనిపట్టెను  గాంధి....  

జన్మహక్కు కోసం

విలన్ను తన్నెను ధర్మం కోసం 

ఎన్. టి. రామారావు

తెలవాడి పనిపట్టెను  గాంధి....  

జన్మహక్కు కోసం

విలన్ను తన్నెను ధర్మం కోసం 

ఎన్. టి. రామారావు


చూస్కో దెబ్బా... పోవోయ్ డబ్బా

మోసం సాగదు... ద్వేషం సాగదు

పోవే పో.. పోవే పో....

పో...పో...

పో...పో... 


- పాటల ధనుస్సు 


ఓ రాజులు హోయ్ ఫోజులు | O Rajulu Hey Phojulu | Song Lyrics | Allari Pillalu (1978)

ఓ రాజులు హోయ్ ఫోజులు



చిత్రం :  అల్లరి పిల్లలు (1978)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  కొసరాజు

నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


లలలలా.. లలలలా..

ఓ రాజులు... హోయ్ ఫోజులు.. 

ఈ వెర్రి మొర్రి వేషమెందుకు

నువ్వు సూటుతోటి వస్తే...   

నీ సోకులన్నీ చూస్తే 

దొరబాబల్లే ఉన్నావు 


ఓ బుల్ బులు... అహా జిల్ జిలు 

నిన్నొదిలిపెట్టి ఉండలేనే

రంజురంజు పిల్లా... 

బొంబాయ్  రసగుల్లా 

మనసంతా నీమీదే ఉందే 


చరణం 1 :


అహా.. మగవాళ్ళ వలపు 

మబ్బుల్లో మెరుపు...

అది నాకు తెలుసు పోవయ్యో.. 

హెహెహీ

మగవాళ్ళ వలపు 

మబ్బుల్లో మెరుపు...

అది నాకు తెలుసు పోవయ్యో

కొత్తదాన్ని వలచి పాతదాన్ని మరచి... 

మసిబూసిపోతారయ్యో.... 


ఓ రాజులు... హోయ్ ఫోజులు.. 

ఈ వెర్రి మొర్రి వేషమెందుకు

నువ్వు సూటుతోటి వస్తే...  

నీ సోకులన్నీ చూస్తే 

దొరబాబల్లే ఉన్నావు 


చరణం 2 :


అబ్బెబ్బే అలా కాదు...  

అలాంటి వాణ్ణి కాదు

అబద్ధాల కోరును కాదూ.... ఊ...

అబ్బెబ్బే అలా కాదు...  

అలాంటి వాణ్ణి కాదు

అబద్ధాల కోరును కాదూ.... ఊ...

ఉన్నదంతా ఇస్తా.. 

నా ప్రాణం ఒగ్గేస్తా ... 

నీ ఒళ్ళో వాలేస్తా....


ఓ బుల్ బులు... అహా జిల్ జిలు 

నిన్నొదిలిపెట్టి ఉండలేనే

రంజురంజు పిల్లా... 

బొంబాయ్  రసగుల్లా 

మనసంతా నీమీదే ఉందే

ఉందే... ఉందే... ఉందే


చరణం 3 :


వేళ గాని వేళా.. ఏమిటీ గోలా

విన్నావా పోలీసు ఈలా... విన్నా

వేళ గాని వేళా.. ఏమిటీ గోలా

విన్నావా పోలీసు ఈలా... 


నువ్వు యెస్  అంటే... 

నేను 'సై ' అంటే

అడ్దమే ఉందే లైలా


ఓ రాజులు హోయ్ ఫోజులు.. 

ఈ వెర్రి మొర్రి వేషమెందుకు

రంజురంజు పిల్లా... 

బొంబాయ్  రసగుల్లా 

మనసంతా నీమీదే ఉందే


- పాటల ధనుస్సు 


22, మే 2025, గురువారం

వయ్యారి కళ్ళల్లోనా దాచాడేమో తారల్ని | Vayyari Kallallona | Song Lyrics | RKSS Creations

 వయ్యారి కళ్ళల్లోనా దాచాడేమో తారల్ని


రొమాంటిక్ ప్రేమ  గీతం 

రచన : రామకృష్ణ దువ్వు 

 

పల్లవి:

 

వయ్యారి కళ్ళల్లోనా 

దాచాడేమో తారల్ని

బెమ్మయ్య కేమయ్యిందో 

కొమ్మకిచ్చే వరాల్ని

ఆ కళ్ళల్లో చూశామంటే 

పోలేమమ్మ మాదార్ని

గుండెల్ని పిండేస్తాది 

మాపై విసిరి చూపుల్ని

బతుకే వెలుగును భామను 

చేసుకుంటే సొంతాన్ని

 

చరణం 1:

 

నెలవంక నవ్వుల్లోనా 

వెలిగించాడేమో కాంతుల్ని

చిలకమ్మ పలుకుల్లోనా 

కురిపించాడేమో రాగాల్ని

ఆ నవ్వుల్లో తేలియాడితే 

మరిచేము ఈ లోకాన్ని

మాటలతో మాయ చేస్తాది 

మాపై చూపే ప్రేమల్ని

బ్రతుకంతా వెన్నెలౌను 

చెలియ చేరితే సరసన్ని

 

చరణం 2:

 

తొలిసారి చూపుల్లోనా 

కలిపాడేమో ఊహల్ని

తొలి పరిచయ క్షణాల్లోనా 

నింపాడేమో ఆశల్ని

ఆ ఊహల్లో విహరిస్తే 

మరిచేము ఇల తలపుల్ని

నడకలతో గిలిగింత పెడతది 

చిలికించి వలపుల్ని

స్వర్గమే చేరువౌను 

సతిగ పొందితే ఈ కోమల్ని


- RKSS Creations...

21, మే 2025, బుధవారం

నా రాశి కన్య రాశి | Naa Rasi Kanya Rasi | Song Lyrics | Allari Pillalu (1978)

నా రాశి కన్య రాశి



చిత్రం :  అల్లరి పిల్లలు (1978)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  రాజశ్రీ

నేపథ్య గానం :  బాలు,  సుశీల


పల్లవి :


నా రాశి కన్య రాశి 

నా రాశి మిథున రాశి

కలిసేనా జాతకాలు.. 

కలవాలి జీవితాలు


నా రాశి.. కన్య రాశి.. 

నా రాశి.. మిథున రాశి

కలిసేనా జాతకాలు.. 

కలవాలి జీవితాలు

నా రాశి.. కన్య రాశి...


చరణం 1 :


రాముడు వెలసిన శుభలగ్నములో.. 

నేను నీకై వెలిశాను

జానకి వెలసిన శుభఘడియలలో.. 

నేను నీకై వెలిశాను  


అయితే మనలో అనురాగం.. 

కథగా నిలుచును కలకాలం

మనకిక తప్పదు సహవాసం.. 

నీతో రానా వనవాసం... 


నీ రాశి.. కన్య రాశి.. 

నా రాశి.. మిథున రాశి

కలిసేనా జాతకాలు.. 

కలవాలి జీవితాలు

నా రాశి.. కన్య రాశి...


చరణం 2 :


ఎవరూ చూడని ఏకాంతములో 

ఎదలు ఒకటైపోవాలి..

నాలుక పలికే మాటల వెనుక 

నీ కథలన్నీ తెలియాలి..

ఎవరూ చూడని ఏకాంతములో 

ఎదలు ఒకటైపోవాలి..

నాలుక పలికే మాటల వెనుక 

నీ కథలన్నీ తెలియాలి..


సాగించాలి సంసారం.. 

లేదా రేపే సన్యాసం..

వద్దు ఎందుకు సన్యాసం.. 

బుద్ధిగ చేద్దాం సంసారం..   


నీ రాశి.. కన్య రాశి.. 

నీ రాశి.. మిథున రాశి

కలిసేను  జాతకాలు.. 

కలవాలి జీవితాలు

నా రాశి.. కన్య రాశి...

అహహాహ.. ఆహహహా..


- పాటల ధనుస్సు 


ఏవిటోగా ఉంది ఏదో అడగాలని ఉంది | Yemitoga vundi | Song Lyrics | Bangaru Kanuka (1982)

ఏవిటోగా ఉంది ఏదో అడగాలని ఉంది



చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


ఏవిటోగా ఉంది ఏదో అడగాలని ఉంది 

ఏదో కావాలని తెలియక తికమకగా ఉంది

ఏవిటోగా ఉంది ఏదో అడగాలని ఉంది 

ఏదో కావాలని తెలియక తికమకగా ఉంది

అది ఏవిటో నీకు తెలుసా మిస్ 


ఏవిటోగా ఉంది ఎదలో సొదగా ఉంది

ఏదో కావాలని నిన్నే అడగాలని ఉంది

ఏవిటోగా ఉంది ఎదలో సొదగా ఉంది

ఏదో కావాలని నిన్నే అడగాలని ఉంది

అది ఏమిటో నీకు తెలుసా మిస్టర్


చరణం 1:


అది ఇదీ అని చెప్పలేనీ మూగమనసుతో

అది అదే అని చెప్పుకోనీ కోడెవయసుతో

అది ఇదీ అని చెప్పలేనీ మూగమనసుతో

అది అదే అని చెప్పుకోనీ కోడెవయసుతో


మంచుతెరలు తొలగించాలని.. 

మల్లెపూలు నలిపేయ్యాలని...

మంచుతెరలు తొలగించాలని.. 

మల్లెపూలు నలిపేయ్యాలని...


కసి కసిగా.. ఉసి ఉసిగా...

రెపరెప తపనల అలజడిగా...


ఏవిటోగా ఉంది ఎదలో సొదగా ఉంది

ఏదో కావాలని నిన్నే అడగాలని ఉంది

అది ఏమిటో నీకు తెలుసా మిస్


చరణం 2:


శృతి మరీ మించుతున్న కొత్త లయలతో

రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో

శృతి మరీ మించుతున్న కొత్త లయలతో

రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో


ఎదకు నిన్ను అదిమెయ్యాలని... 

ఎల్లలన్ని చిదిమెయ్యాలని...

ఎదకు నిన్ను అదిమెయ్యాలని... 

ఎల్లలన్ని చిదిమెయ్యాలని...


తడి తడిగా పొడి పొడిగా...

తహ తహలాడిన సందడిగా...


ఏవిటోగా ఉంది ఏదో అడగాలని ఉంది 

ఏదో కావాలని తెలియక తికమకగా ఉంది

అది ఏవిటో నీకు తెలుసా మిస్


ఏవిటోగా ఉంది ఎదలో సొదగా ఉంది

ఏదో కావాలని నిన్నే అడగాలని ఉంది

అది ఏమిటో నీకు తెలుసా మిస్టర్


- పాటల ధనుస్సు 


నడకా హంసధ్వని రాగమా | Nadaka Hamsadhwani Ragama | Song Lyrics | Bangaru Kanuka (1982)

నడకా హంసధ్వని రాగమా

 


చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, జానకి 


పల్లవి :


నడకా హంసధ్వని రాగమా 

ఆది నడుమా గగనంలో కుసుమమా 

నడకా హంసధ్వని రాగమా 

ఆది నడుమా గగనంలో కుసుమమా 


మణిపురిలో వయ్యారమా 

పురివిప్పిన మయూరమా 


నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే 

శ్రుతిలయానుబంధమే 

స్వరజతి కల్యాణమే 


నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే  


చరణం 1 :


హిమగిరికా సరిఝరి వాహినిలో 

అలరేగిన సితవర్ణ తురంగమా 

హిమకర కర మహిమాన్విత నిశీధిలో 

చెలరేగిన చేకోరిక విహంగామా 


పరువాల పతంగమా...  

హృదయాల మృదంగమా 

వసంత పంచమ సుస్వరమా 

వార్షుకాభ్రసడ్జమ నిస్వనమా 


స గారి...  సరిసని. .  పా  నిసరి 

స స   ప ప   ప ప ప ప  గపగరిస  


నడకా......  హంసధ్వని రాగమా....  

నడకే హంసధ్వని రాగామే  


చరణం 2 :


కాశ్మీర మందార  కుసుమంలో 

మధువులైన పెదవుల మకరందామా 

కన్యాకుమారి కౌగిలింతలలో 

కదలి పొంగు కడలీతరంగమా 


నా జీవన దాహమా  నా జవ్వన మొహమా 

అరుణచరణ యుగ చారణమా 

మధురగతుల మదవారణమా 


సరి  సరి  ప గ ద ప  గప  నిప   నిసరి 

నిస గరి  సరి  స ని గ ప  గరిస  


నడకా......  హంసధ్వని రాగమా....  

నడకే హంసధ్వని రాగామే 


చరణం 3 : 


నా మానస సరోవరస్థీరంలో 

కలికి నెలలు చిలికే కల్హారమా 

కలహంసలు కలలు కన్న స్వప్నంలో 

హింసపడిన హంసల నయగారమా 


నడకే ఒక నాట్యమా... 

నడకే ఒక నాట్యమా...  

నామృగేంద్రమధ్యమా

శరత్వేణురవరంజితమా .... 

శరదంబరచెంచల సంచితమా 


తకున్దరి తకఝను... తకున్దరి తకఝను

తధిగిన తొం తకిట తొం తక తొం త


నడకా హంసధ్వని రాగమా 

ఆది నడుమా గగనంలో కుసుమమా 

మణిపురిలో వయ్యారమా 

పురివిప్పిన మయూరమా 


నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే 

శ్రుతిలయానుబంధమే 

స్వరజతి కల్యాణమే  


నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే


- పాటల ధనుస్సు 


19, మే 2025, సోమవారం

కసురుకున్న కళ్ళది | Kasurukunna Kalladi | Song Lyrics | Bangaru Kanuka (1982)

కసురుకున్న కళ్ళది



చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి 

నేపథ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


కసురుకున్న కళ్ళది 

పెసరకాయ వేళ్ళది

కసురుకున్న కళ్ళది 

పెసరకాయ వేళ్ళది

ఏమౌతాదో ఏమో వస్తే కౌగిళ్ళకి


పూలా పొదరిళ్ళకి... 

పూలా పొదరిళ్ళకి


ఉడుం పట్టు పిల్లడు.. 

ఊరికంత అల్లుడు

ఉడుం పట్టు పిల్లడు.. 

ఊరికంత అల్లుడు


ఏమిస్తాడో ఏమో వస్తే కౌగిళ్ళకి

అహా హా...  హా  

పూలా పొదరిళ్ళకి... హా.. 

పూలా పొదరిళ్ళకి


చరణం 1 :


పిసినిగొట్టు నడుమ్మీద 

పిలక జళ్ళది

విసిరిగొట్టు కొంగుల్లో 

పొంగే పరవళ్ళది


పిసినిగొట్టు నడుమ్మీద 

పిలక జళ్ళది

విసిరిగొట్టు కొంగుల్లో 

పొంగే పరవళ్ళది


సెలయేటి ఉరవళ్ళది... 

చలిగాలి సణుగుళ్ళది

సెలయేటి ఉరవళ్ళది... 

చలిగాలి సణుగుళ్ళది


ఏమొతాదో ఏమో 

ఎండా ఎన్నళ్ళకి... అహా.. ఏయ్


చీరాసందిళ్ళకి... 

తీపీ సందిళ్ళకి 


కసురుకున్న కళ్ళది 

పెసరకాయ వేళ్ళది

ఏమిస్తాడో ఏమో వస్తే కౌగిళ్ళకి


పూలా పొదరిళ్ళకి... హా.. 

పూలా పొదరిళ్ళకి


చరణం 2 :


చెంత కొచ్చి చేయి పడితే 

ఇంక చెల్లడు

బుగ్గ గట్టి చేతికిస్తే 

మొగ్గైనా గిల్లడు 


చెంత కొచ్చి చేయి పడితే 

ఇంత చెల్లడు  

బుగ్గ గట్టి చేతికిస్తే 

మొగ్గైనా గిల్లడు 


సరసాల ఈ గుంటడు... 

సరదాకి బాగుంటడు

సరసాల ఈ గుంటడు... 

సరదాకి బాగుంటడు


ఏమిస్తాడో ఏమో 

నా ఇరవై ఏళ్ళకి

చీరా కుచ్చిళ్ళకి.. హా.. 

చిలిపి వత్తిళ్ళకి


ఉడుం పట్టు పిల్లడు.. 

ఊరికంత అల్లుడు


ఏమౌతాదో ఏమో వస్తే కౌగిళ్ళకి 

పోదాం సందేళకి.. 

పూలా పొదరిళ్ళకి 


- పాటల ధనుస్సు 


15, మే 2025, గురువారం

కాపురం కొత్త కాపురం | Kapuram Kotha Kapuram | Song Lyrics | Kotha Kapuram (1975)

కాపురం కొత్త కాపురం



చిత్రం :  కొత్త కాపురం (1975)

సంగీతం :  కె. వి. మహదేవన్

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం :  సుశీల, బాలు

 


పల్లవి :


కాపురం కొత్త కాపురం.. 

కాపురం కొత్త కాపురం

ఆలుమగలు కట్టుకున్న..  

అనురాగ గోపురం

కాపురం కొత్త కాపురం

ఆలుమగలు కట్టుకున్న..  

అనురాగ గోపురం.. 

కాపురం కొత్త కాపురం


చరణం 1 :


పాకలో ఉన్నా అది 

పసిడి మేడగా.. 

మండుటెండలో ఉన్నా 

మల్లెల  నీడగా

పాకలో ఉన్నా అది 

పసిడి మేడగా..  

మండుటెండలో ఉన్నా 

మల్లెల  నీడగా


ఉన్నంతలో చెప్పలేని 

తీపిని అందించేది

గోరంతలో కొండంత 

తృప్తిని కలిగించేది   


కాపురం కొత్త కాపురం .. 

ఆలుమగలు కట్టుకున్న..

అనురాగ గోపురం.. 

కాపురం కొత్త కాపురం 


చరణం 2 :


తన పతియే కనిపించే 

దైవమనీ.. 

తన సతియే ఫలియించిన 

పుణ్యమనీ

తన పతియే కనిపించే 

దైవమనీ..

తన సతియే ఫలియించిన 

పుణ్యమనీ

ఒకరినొకరు తెలుసుకునీ.. 

ఒకటిగా నడచుకొనీ 

బ్రతుకంతా పచ్చదనం

బ్రతుకంతా పచ్చదనం.. 

అందించుకొనేదే.. 

కాపురం కొత్త కాపురం

     

చరణం 3 :


చీకటిలో చిరునవ్వులు 

వెలిగించుకొనీ.. 

బాధలలో అనందం 

పంచుకొనీ

చీకటిలో చిరునవ్వులు 

వెలిగించుకొనీ.. 

బాధలలో అనందం 

పంచుకొనీ

కలిమిలో పొంగక.. 

లేమిలో క్రుంగక 

వెలుగునీడ లొక్కటిగా 

కలబోసి చూసేదే.. 


కాపురం కొత్త కాపురం.. 

ఆలుమగలు కట్టుకున్న..

అనురాగ గోపురం.. 

కాపురం కొత్త కాపురం


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు