RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, మే 2025, శుక్రవారం

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా | Dhumdhum dhumaga | Song Lyrics | Allari Pillalu (1978)

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా



చిత్రం :  అల్లరి పిల్లలు (1978)

సంగీతం : సత్యం

గీతరచయిత :  కొసరాజు

నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  

పెత్తనమంతా నాదే

ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... 

అధికారమంతా నాదే

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  

పెత్తనమంతా నాదే

ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... 

అధికారమంతా నాదే


చరణం 1 :


అప్పుడు రాముడు విల్లు విరిచెను 

జానకి కోసం

ఇప్పుడు అన్నీ నే విరిచేస్తా... 

హక్కుల కోసం

అప్పుడు రాముడు విల్లు విరిచెను 

జానకి కోసం

ఇప్పుడు అన్నీ నే విరిచేస్తా... 

హక్కుల కోసం


ఓ.. ఓ.. మహిషాసురిని మర్ధించే కాళి 

లోకం కోసం

మహిషాసురిని మర్ధించే కాళి 

లోకం కోసం

ఇక్కడ చిక్కినవన్నీ ముక్కలు చేస్తా  

ప్రతిష్ట కోసం


హ..హా.. ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  

పెత్తనమంతా నాదే

ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... 

అధికారమంతా నాదే


చరణం 2 :


ద్రౌపది శపధం దుశ్శాసనుని 

డొక్క చీల్చినది నాడు

ద్రౌపది శపధం దుశ్శాసనుని 

డొక్క చీల్చినది నాడు

ఇక్కడ కొంటెతనం ఎవరు చేసినా 

పచ్చడి చేస్తా నేడు

ఇక్కడ కొంటెతనం ఎవరు చేసినా 

పచ్చడి చేస్తా నేడు


ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా... 

అధికారమంతా నాదే

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా...  

పెత్తనమంతా నాదే


చరణం 3 :


తెలవాడి పనిపట్టెను  గాంధి....  

జన్మహక్కు కోసం

విలన్ను తన్నెను ధర్మం కోసం 

ఎన్. టి. రామారావు

తెలవాడి పనిపట్టెను  గాంధి....  

జన్మహక్కు కోసం

విలన్ను తన్నెను ధర్మం కోసం 

ఎన్. టి. రామారావు


చూస్కో దెబ్బా... పోవోయ్ డబ్బా

మోసం సాగదు... ద్వేషం సాగదు

పోవే పో.. పోవే పో....

పో...పో...

పో...పో... 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే | Brahmamokkate Parabrahmamokkate | Annamacharya Keerthana | Annamayya (1997)

 బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య సంకీర్తనలు  గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు