RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, మే 2025, గురువారం

వినుము చెలి తెలిపెదనే | Vinumu Cheli Telipedanu | Song Lyrics | Intiki Deepam Illale (1961)

వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం



చిత్రం: ఇంటికి దీపం ఇల్లాలే (1961)

సంగీతం: విశ్వనాథన్ రామమూర్తి , 

గీతరచయిత: శ్రీ శ్రీ  , 

నేపధ్య గానం: సుశీల


పల్లవి:

వినుము చెలి తెలిపెదనే 

పరమ రహస్యం

అది మరి ఎవరూ తెలియరాని 

మధుర రహస్యం


వినుము చెలి తెలిపెదనే 

పరమ రహస్యం

అది మరి ఎవరూ తెలియరాని 

మధుర రహస్యం


హృదయములు నయనములు 

ఏకమాయెనే

మా ఇరువురికి భేదమింక 

లేకపోయెనే..ఏ..


వినుము చెలి తెలిపెదనే 

పరమ రహస్యం

అది మరి ఎవరూ తెలియరాని 

మధుర రహస్యం


చరణం 1:


వచ్చెనులే నిల్చెనులే 

వాకిలి ముందు

కాంచితిని కాంచితిని 

కన్నుల విందు

ఓహోహో.. ఓ..ఓ..ఓ.. ఓహోహో.. 

ఓ..ఓ..ఓ.. ఓహోహో.. ఓ..ఓ..ఓ..ఓ..

వచ్చెనులే నిల్చెనులే 

వాకిలి ముందు

కాంచితిని కాంచితిని 

కన్నుల విందు

నా జడలో పూవులలో 

తురిమెద నేనే..ఏ..

నా నొసట తిలకము నే 

దిద్దెద నేడే..ఏ..


వినుము చెలి తెలిపెదనే 

పరమ రహస్యం

అది మరి ఎవరూ తెలియరాని 

మధుర రహస్యం


చరణం 2:


అతడే నా పతియనుచూ 

పాట పాడుతా

అతని దెందెమున అందముగ 

నటనమాడుతా

ఆ.. అతడే నా పతియనుచూ 

పాట పాడుతా

అతని దెందెమున అందముగ 

నటనమాడుతా

వివరముల తెలుపుటకే 

సమయము కాదు

ఆ విషయముల తీరికగ 

తెలిపెద నీకూ..ఊ..


వినుము చెలి తెలిపెదనే 

పరమ రహస్యం

అది మరి ఎవరూ తెలియరాని 

మధుర రహస్యం


హృదయములు నయనములు 

ఏకమాయెనే

మా ఇరువురికి భేదమింక 

లేకపోయెనే..ఏ..


వినుము చెలి తెలిపెదనే 

పరమ రహస్యం

అది మరి ఎవరూ తెలియరాని 

మధుర రహస్యం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు