RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

31, మే 2025, శనివారం

చల్లని చిరుగాలీ నిన్నొక సంగతి అడగాలి | Challani Chirugali | Song Lyrics | Maa Daivam (1976)

చల్లని చిరుగాలీ నిన్నొక సంగతి అడగాలి



చిత్రం :  మా దైవం (1976)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


చల్లని చిరుగాలీ..

నిన్నొక సంగతి అడగాలి

చల్లని చిరుగాలీ..

నిన్నొక సంగతి అడగాలి



ఈ రాజునేకొమ్మ వలచెనో..

తన ఎదలోన ఏ బొమ్మ నిలిచెనో..


చల్లని చిరుగాలీ...

నీకొక సంగతి తెలపాలీ..

చల్లని చిరుగాలీ..

నీకొక సంగతి తెలపాలీ..


మనసైన ఒక కొమ్మ వలచింది... 

నాలో మాటాడే బొమ్మ నిలిచింది....

చల్లని చిరుగాలీ..

నీకొక సంగతి తెలపాలీ..


చరణం 1:


కొమ్మ అనగానే సరిపోతుందా

బొమ్మ అనగానే అయిపోతుందా

పే..రే..లేదా..ఆ..దానికీ ఊరే లేదా..


పరువం..ఉరుకుతుంది..

ఆ పచ్చని మేని వంపులలో

బిడియం తొణుకుతుంది..

ఆ అడుగులు సాగనీ నడకలలో

ఎవరనుకున్నావు ఆ బొమ్మా..

రవ్వల అందాల వన రాచగుమ్మా..

చల్లని చిరుగాలీ.. 

నిన్నొక సంగతి అడగాలి..


చరణం 2:


కబురులతోనే సరిపోయిందా...

కవితలల్లితే అయిపోయిందా..

కన్నియ మనసే... 

కాస్తా కనుగొన్నావా...


ఉదయం పొంగుతుందీ...

ఆ సుధకి ధరహాస కిరణాలలో..

హృదయం పలుకుతుందీ.. 

ఆ ముదిత మూగ నయనాలలో..

ఎప్పుడో..ఓ.. ఎప్పుడో..ఓ..

ఈ నేను..ఆ యదనాగలో 

వొదిగిపోయాను..


చల్లని చిరుగాలీ.. 

నీకొక సంగతి తెలపాలీ..

ఈ రాజు వలచిన కొమ్మా..

నా యదలోని ఈ పైడి బొమ్మా..ఆ

చల్లని చిరుగాలీ...

ఆహ...ఆహ..ఆహ..ఆ..ఆ.ఆఅ

ఆహ..ఆహ..ఆహా..ఆహా...ఆ..ఆ

ఓహో..ఓహో..ఓహో..ఓ..ఓ..ఓ..ఓ


- పాటల ధనుస్సు 


1 కామెంట్‌:

  1. సుధ కి కాదు.... సుదతి దరహాస.... సుదతి అంటే స్త్రీ అని అర్థం....
    రవ్వల కాదు... ఱవల అందాల...ఇక్కడ... ఒక మొండి వైఖరి కలిగిన స్త్రీ అని అర్థం.
    యదనాగ తప్పు. ఎలనాగ...
    దీని అర్థం కూడా అందమైన స్త్రీ అని.

    సుదతి
    ముదిత
    ఱవల
    ఎలనాగ

    ఇవన్నీ స్త్రీ పర్యాయపదాలు.. సందర్భోచితంగా... నారాయణ రెడ్డి గారి సాహితీ పటిమకు ఈ పాట ఒక తార్కాణం

    రిప్లయితొలగించండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు