RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, మే 2025, శనివారం

తారలు దిగి వచ్చిన వేళ | Taralu Digivachina vela | Song Lyrics | Premabhishekam (1981)

తారలు దిగి వచ్చిన వేళ



చిత్రం : ప్రేమాభిషేకం (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : దాసరి నారాయణరావు 

నేపధ్య గానం : బాలు


పల్లవి:


తారలు దిగి వచ్చిన వేళ 

మల్లెలు నడిచొచ్చిన వేళ

చందమామతో ఒక మాట చెప్పాలి 

ఒక పాట పాడాలి

చందమామతో ఒక మాట చెప్పాలి 

ఒక పాట పాడాలి


తారలు దిగి వచ్చిన వేళ 

మల్లెలు నడిచొచ్చిన వేళ

తారలు దిగి వచ్చిన వేళా...


చరణం 1:


ఊరంతా ఆకాశానా గోరంత దివ్వెగా

పిడికెడంత గుండెలోనా 

కొండంత వెలుగుగా

కనిపించే రంగులన్ని 

సింధూరపు చీరెలా

కనిపించని సిగ్గులన్ని 

ముసుగేసిన మబ్బుగా


కనిపించే రంగులన్ని 

సింధూరపు చీరెలా

కనిపించని సిగ్గులన్ని 

ముసుగేసిన మబ్బుగా

నిలిచిపొమ్మని మబ్బుగా

కురిసిపోమ్మని వానగా

విరిసిపొమ్మని వెన్నెలగా

మిగిలిపొమ్మని నా గుండెగా


చందమామతో ఒక మాట చెప్పాలి 

ఒక పాట పాడాలి

చందమామతో ఒక మాట చెప్పాలి 

ఒక పాట పాడాలి


తారలు దిగి వచ్చిన వేళ 

మల్లెలు నడిచొచ్చిన వేళ

తారలు దిగి వచ్చిన వేళా...


చరణం 2:


నీలిరంగు చీకటిలో 

నీలాల తారగా

చూడనంత శూన్యములో 

దొరకనంత ఆశగా


వేటాడే చూపులన్ని 

లోలోన ప్రేమగా

వెంటాడే వలపులన్ని 

కాబోయే పెళ్ళిగా


వేటాడే చూపులన్ని 

లోలోన ప్రేమగా

వెంటాడే వలపులన్ని 

కాబోయే పెళ్ళిగా


చెప్పి పొమ్మని మాటగా

చేసి పొమ్మని బాసగా

చూపి పొమ్మని బాటగా

ఇచ్చి పొమ్మని ముద్దుగా


చందమామతో ఒక మాట చెప్పాలి 

ఒక పాట పాడాలి

చందమామతో ఒక మాట చెప్పాలి 

ఒక పాట పాడాలి


తారలు దిగి వచ్చిన వేళ 

మల్లెలు నడిచొచ్చిన వేళ

తారలు దిగి వచ్చిన వేళా...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు | Nee Jadakuchulu Naa Medakuchulu | Song Lyrics | Shubhalekha (1982)

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు  చిత్రం : శుభలేఖ (1982) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి సాకి :  ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు