RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, మే 2025, బుధవారం

హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో | Harivillu Divinundi | Song Lyrics | Kurukshetram (1977)

హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో



చిత్రం: కురుక్షేత్రం (1977) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత: ఆరుద్ర 

నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల 

 

సాకి :


సంధ్యకెంజాయలో...ఓ.. 

సరసాల సరసి దరినీ... 

కలిసినవి ఇరుకన్నులు... 

మెరసినవి...పలు వన్నెలు...

ఆ..ఆ..ఆ.ఆ...ఆ... 


పల్లవి:


హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో 

హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో 

ప్రణయాల విరిజల్లు కురిపించెనేమో 

మురిపించెనేమో...మైమరపించెనేమో... 

హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో 


చరణం 1: 


విరియని విరజాజులు... 

నా వలపులా లేతలపులు... 

విరియని విరజాజులు... 

నా వలపులా లేతలపులు... 

పెదవుల దరహాసము...

నే దాచితీ నీ కోసము... 

నీ కథలు విన్నాను చిననాటి నుంచి... 

నే కలలు కన్నాను అనురాగమెంచి.... 


హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనేమో 

ప్రణయాల విరిజల్లు కురిపించెనేమో 

మురిపించెనేమో...మైమరపించెనేమో... 


చరణం 2: 


నునుసిగ్గు చెలరేగి..పులకింతలాయే... 

తొలిప్రేమ మురిపాల చిగురింతలాయే.... 


హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనోయి.. 

ప్రణయాల విరిజల్లు కురిపించెనోయి.. 

మురిపించెనోయి...మైమరపించెనోయి... 

హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనోయి..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

సుందర సురనందన | Sundara Suranandana | Song Lyrics | Pooja Phalam (1964)

సుందర సురనందన చిత్రం : పూజాఫలం (1964) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం : పి. సుశీల పల్లవి: సుందర సురనందన  ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు