RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

15, మే 2025, గురువారం

కాపురం కొత్త కాపురం | Kapuram Kotha Kapuram | Song Lyrics | Kotha Kapuram (1975)

కాపురం కొత్త కాపురం



చిత్రం :  కొత్త కాపురం (1975)

సంగీతం :  కె. వి. మహదేవన్

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం :  సుశీల, బాలు

 


పల్లవి :


కాపురం కొత్త కాపురం.. 

కాపురం కొత్త కాపురం

ఆలుమగలు కట్టుకున్న..  

అనురాగ గోపురం

కాపురం కొత్త కాపురం

ఆలుమగలు కట్టుకున్న..  

అనురాగ గోపురం.. 

కాపురం కొత్త కాపురం


చరణం 1 :


పాకలో ఉన్నా అది 

పసిడి మేడగా.. 

మండుటెండలో ఉన్నా 

మల్లెల  నీడగా

పాకలో ఉన్నా అది 

పసిడి మేడగా..  

మండుటెండలో ఉన్నా 

మల్లెల  నీడగా


ఉన్నంతలో చెప్పలేని 

తీపిని అందించేది

గోరంతలో కొండంత 

తృప్తిని కలిగించేది   


కాపురం కొత్త కాపురం .. 

ఆలుమగలు కట్టుకున్న..

అనురాగ గోపురం.. 

కాపురం కొత్త కాపురం 


చరణం 2 :


తన పతియే కనిపించే 

దైవమనీ.. 

తన సతియే ఫలియించిన 

పుణ్యమనీ

తన పతియే కనిపించే 

దైవమనీ..

తన సతియే ఫలియించిన 

పుణ్యమనీ

ఒకరినొకరు తెలుసుకునీ.. 

ఒకటిగా నడచుకొనీ 

బ్రతుకంతా పచ్చదనం

బ్రతుకంతా పచ్చదనం.. 

అందించుకొనేదే.. 

కాపురం కొత్త కాపురం

     

చరణం 3 :


చీకటిలో చిరునవ్వులు 

వెలిగించుకొనీ.. 

బాధలలో అనందం 

పంచుకొనీ

చీకటిలో చిరునవ్వులు 

వెలిగించుకొనీ.. 

బాధలలో అనందం 

పంచుకొనీ

కలిమిలో పొంగక.. 

లేమిలో క్రుంగక 

వెలుగునీడ లొక్కటిగా 

కలబోసి చూసేదే.. 


కాపురం కొత్త కాపురం.. 

ఆలుమగలు కట్టుకున్న..

అనురాగ గోపురం.. 

కాపురం కొత్త కాపురం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు