RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

31, మే 2025, శనివారం

నమస్తే సుస్వాగతం | Namaste Suswagatham | Song Lyrics | Kirayi Kotigadu (1983)

నమస్తే సుస్వాగతం



చిత్రం: కిరాయి కోటిగాడు (1983)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

నమస్తే.. సుస్వాగతం...

సమస్తం నీ అధీనం...

అజంతా అందాలు ..

ఎల్లోర శిల్పాలు ..

ఇస్తున్నా అంకితం

ఇదే ..ఇదే ..ఇదే ..

నా ఆహ్వానం....


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఓహో..

నమస్తే...ఓ సుందరి..

క్షమిస్తా..నీ అల్లరి..

నీలోనీ అందాలు..

అవి తీసే రాగాలు ...

ఇస్తుంటే అంకితం

అదే కదా ..సదా 

నీ అభిమానం...


చరణం 1:


పెళ్ళిపెద్దగారు 

లగ్గమేదో పెట్టి వస్తుంటే...

ఖద్దరంచు పంచ ..

కండువాల ఠీవి చూస్తుంటే...

పెళ్ళికానిపిల్ల 

తుళ్ళి తుళ్ళి మీదికొస్తుంటే...

కళ్ళు పడ్డ చోట.. 

గళ్ళు పడ్డ కోక చూస్తుంటే...


తెల్ల మబ్బు గొడుగేస్తుంటే...

ఆ..ఆ...చల్లగాలి మనసిస్తుంటే...

సిరిమల్లి చిరునవ్వులే..ఏ...

చినదాని సిగపువ్వులై...ఈ..

ఘుమా ఘుమా ఘుమా 

విరిసే నా కోసం

నమస్తే... హ...సుస్వాగతం...
సమస్తం నీ అధీనం... హ...


చరణం 2:


ఒంపుకొక్క సొంపు 

వంతెనేసుకున్న అందాలే...

వాలు పొద్దుకాడ 

లేత ముద్దులిస్తే..అందా..లే...

మల్లెచెండులోన 

మంచుతేనే పిండు చిన్నోడే...

దోరనవ్వులిచ్చి 

దొండపండు దోచుకున్నాడే...

చీకటమ్మ చిటికెస్తుంటే...

ఆ..ఆ...ఆకలమ్మ అడిగేస్తుంటే....

మన పల్లే కలిపిందిలే..ఏ....

వలపల్లే మన జంటనే..ఏ..

ఇదే కదా...కలుసుకున్న 

అనుబంధం...


నమస్తే...హా..ఓ సుందరి..

క్షమిస్తా...హ....నీ అల్లరి..

అజంతా అందాలు ...

ఎల్లోర శిల్పాలు... 

ఇస్తున్నా అంకితం...

అదే కదా ...సదా 

నీ అభిమానం...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన | Guttapalli Chelalona | Telugu Folk Song Lyrics | RKSS Creations

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన జానపద గేయం  రచన : రామకృష్ణ దువ్వు  పల్లవి :  గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన పాలకంకి సొగసులున్న నవరంగీ గుత్త...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు