RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, మే 2025, బుధవారం

నా రాశి కన్య రాశి | Naa Rasi Kanya Rasi | Song Lyrics | Allari Pillalu (1978)

నా రాశి కన్య రాశి



చిత్రం :  అల్లరి పిల్లలు (1978)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  రాజశ్రీ

నేపథ్య గానం :  బాలు,  సుశీల


పల్లవి :


నా రాశి కన్య రాశి 

నా రాశి మిథున రాశి

కలిసేనా జాతకాలు.. 

కలవాలి జీవితాలు


నా రాశి.. కన్య రాశి.. 

నా రాశి.. మిథున రాశి

కలిసేనా జాతకాలు.. 

కలవాలి జీవితాలు

నా రాశి.. కన్య రాశి...


చరణం 1 :


రాముడు వెలసిన శుభలగ్నములో.. 

నేను నీకై వెలిశాను

జానకి వెలసిన శుభఘడియలలో.. 

నేను నీకై వెలిశాను  


అయితే మనలో అనురాగం.. 

కథగా నిలుచును కలకాలం

మనకిక తప్పదు సహవాసం.. 

నీతో రానా వనవాసం... 


నీ రాశి.. కన్య రాశి.. 

నా రాశి.. మిథున రాశి

కలిసేనా జాతకాలు.. 

కలవాలి జీవితాలు

నా రాశి.. కన్య రాశి...


చరణం 2 :


ఎవరూ చూడని ఏకాంతములో 

ఎదలు ఒకటైపోవాలి..

నాలుక పలికే మాటల వెనుక 

నీ కథలన్నీ తెలియాలి..

ఎవరూ చూడని ఏకాంతములో 

ఎదలు ఒకటైపోవాలి..

నాలుక పలికే మాటల వెనుక 

నీ కథలన్నీ తెలియాలి..


సాగించాలి సంసారం.. 

లేదా రేపే సన్యాసం..

వద్దు ఎందుకు సన్యాసం.. 

బుద్ధిగ చేద్దాం సంసారం..   


నీ రాశి.. కన్య రాశి.. 

నీ రాశి.. మిథున రాశి

కలిసేను  జాతకాలు.. 

కలవాలి జీవితాలు

నా రాశి.. కన్య రాశి...

అహహాహ.. ఆహహహా..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు