RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
challani chirugali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
challani chirugali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మే 2025, శనివారం

చల్లని చిరుగాలీ నిన్నొక సంగతి అడగాలి | Challani Chirugali | Song Lyrics | Maa Daivam (1976)

చల్లని చిరుగాలీ నిన్నొక సంగతి అడగాలి



చిత్రం :  మా దైవం (1976)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


చల్లని చిరుగాలీ..

నిన్నొక సంగతి అడగాలి

చల్లని చిరుగాలీ..

నిన్నొక సంగతి అడగాలి



ఈ రాజునేకొమ్మ వలచెనో..

తన ఎదలోన ఏ బొమ్మ నిలిచెనో..


చల్లని చిరుగాలీ...

నీకొక సంగతి తెలపాలీ..

చల్లని చిరుగాలీ..

నీకొక సంగతి తెలపాలీ..


మనసైన ఒక కొమ్మ వలచింది... 

నాలో మాటాడే బొమ్మ నిలిచింది....

చల్లని చిరుగాలీ..

నీకొక సంగతి తెలపాలీ..


చరణం 1:


కొమ్మ అనగానే సరిపోతుందా

బొమ్మ అనగానే అయిపోతుందా

పే..రే..లేదా..ఆ..దానికీ ఊరే లేదా..


పరువం..ఉరుకుతుంది..

ఆ పచ్చని మేని వంపులలో

బిడియం తొణుకుతుంది..

ఆ అడుగులు సాగనీ నడకలలో

ఎవరనుకున్నావు ఆ బొమ్మా..

రవ్వల అందాల వన రాచగుమ్మా..

చల్లని చిరుగాలీ.. 

నిన్నొక సంగతి అడగాలి..


చరణం 2:


కబురులతోనే సరిపోయిందా...

కవితలల్లితే అయిపోయిందా..

కన్నియ మనసే... 

కాస్తా కనుగొన్నావా...


ఉదయం పొంగుతుందీ...

ఆ సుధకి ధరహాస కిరణాలలో..

హృదయం పలుకుతుందీ.. 

ఆ ముదిత మూగ నయనాలలో..

ఎప్పుడో..ఓ.. ఎప్పుడో..ఓ..

ఈ నేను..ఆ యదనాగలో 

వొదిగిపోయాను..


చల్లని చిరుగాలీ.. 

నీకొక సంగతి తెలపాలీ..

ఈ రాజు వలచిన కొమ్మా..

నా యదలోని ఈ పైడి బొమ్మా..ఆ

చల్లని చిరుగాలీ...

ఆహ...ఆహ..ఆహ..ఆ..ఆ.ఆఅ

ఆహ..ఆహ..ఆహా..ఆహా...ఆ..ఆ

ఓహో..ఓహో..ఓహో..ఓ..ఓ..ఓ..ఓ


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు