RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

30, అక్టోబర్ 2024, బుధవారం

ఏవడంట ఏవడంట నిన్ను ఎత్తుకుంది | Yevvadanta Yevvadanta | Song Lyrics | Bahubali (2015)

ఏవడంట ఏవడంట నిన్ను ఎత్తుకుంది



చిత్రం : బాహుబలి (2015)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

గీతరచయిత : ఇనగంటి సుందర్ 

నేపధ్య గానం : మౌనిమ, ఎం ఎం కీరవాణి 


జటా కటాహ సంబ్రమాబ్రహ్మ

నిలింప నిర్జరి

విలోల వీచి వలరి

విరాజ మన మూర్ధని

ధగ దగా ధగజ్ జ్వాల

లలాటా పట్టా పావకే

కిశోర చంద్ర శేఖరేయ్

రతి ప్రతి క్షణం మమ


ఏవడంట ఏవడంట నిన్ను ఎత్తుకుంది

ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది

ఎవరు కనంది

ఎక్కడ వినంది

శివుని ఆన అయిందేమో

గంగ దరికి లింగమే

కదిలొస్తానంది


దార ధరేంద్ర నందిని

విలాస బంధు బాండురా

స్ఫురదౄగంత సంతతి

ప్రమోద మాన మనస్సే

కృప కటాక్ష ధోరణి

నిరుత్త దుర్ధరపడి

త్వచిత్ దిగంబర్ మనో

వినోదమేతు వాస్తుని


జటా భుజంగ పింగళ స్ఫురత్

ఫన మని ప్రభ

కదంబ కుంకుమ ద్రవ

ప్రలిప్త దిగ్వడు ముఖేయ్


మదందా సిందూర

స్ఫూర్తవగు ఉత్తరీయా మేదురేయ్

మనో వినోదమద్భుతం

భిభర్తు బూతా భర్తరి


ఏవడంట ఏవడంట నిన్న ఎత్తుకుంది

ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది

ఎవరు కనంది

ఎక్కడ వినంది

శివుని ఆన అయిందేమో

గంగ దరికి లింగమే

కదిలొస్తానంది


- పాటల ధనుస్సు 

మమతల తల్లి | Mamathala Thalli | Song Lyrics | Bahubali (2015)

మమతల తల్లి 



చిత్రం : బాహుబలి (2015)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

గీతరచయిత : శివ శక్తి దత్త,

నేపధ్య గానం : సత్య యామిని 



మమతల తల్లి 

వోడి బాహుబలి

లాలన తేలి శతధా వరాలి

ఎదలో ఒక పాల్కడలి

మధనం జరిగేయ్ స్థలి


మాహిష్మతి వరక్షత్రకులి

జిత క్షాత్రవ బాహుబలి

సహస విక్రమ ధీశాలి

రణతాంధ్ర కల కుశలి


ఎదలో ఒక పాల్కడలి

మధనం జరిగే స్థలి


వెచింత కండించే ఖడ్గం

తోసింత చేదింజే బాణం

చదరంగి ఆ దృఢసంకల్పం

తానే సేనాయి తోచే

తల్లే తన గురువు దైవం

అల్లా తోనే సహవాసం

ధేయం అందరి సంక్షేమం

రాజ్యం రాజు తానే ఓ


శాసన సమం శివగామి వచనం

సదసత్రణరంగం ఇళ్లనం 

జనని హృదయం 

ఎదలో ఒక పాల్కడలి

మధనం జరిగే స్థలి


- పాటల ధనుస్సు 


25, అక్టోబర్ 2024, శుక్రవారం

కొండ కోనలలోన కొలువైన స్వామీ | Kondakonalalona Koluvaina Swamy | Sri Lakshmi Narasimha | Omkaram | RKSS Creations

 కొండ కోనలలోన కొలువైన స్వామీ

 


రచన : రామకృష్ణ దువ్వు

Creation : RKSS Creations

 

పల్లవి :


కొండ కోనలలోన

కొలువైన స్వామీ

నిండు మనసుతోటి

నిను చేరినాము

గండముల పారద్రోలి

మము బ్రోవుమయ్య

చండ ప్రచండ తేజోమయ

శ్రీ లక్ష్మి నారసింహా

శ్రీ లక్ష్మి నారసింహా

 

కొండ కోనలలోన

కొలువైన స్వామీ

నిండు మనసుతోటి

నిను చేరినాము

గండముల పారద్రోలి

మము బ్రోవుమయ్య

చండ ప్రచండ తేజోమయ

శ్రీ లక్ష్మి నారసింహా

శ్రీ లక్ష్మి నారసింహా

 

 

చరణం 1:


రూపమున నిను చూడ

భీకరాకారా

మనమున కాంచిన

కరుణామూర్తీ

 

రూపమున నిను చూడ

భీకరాకారా

మనమున కాంచిన

కరుణామూర్తీ

 

ప్రతికూల స్తితులెన్నో

పగబట్టి నాయీ

ఉగ్ర ప్రఛండాగ్ని జ్వాలల

భష్మీకరించీ

అకాల మృత్యువుల నుండి

కాపాడు స్వామీ

 

ప్రతికూల స్తితులెన్నో

పగబట్టి నాయీ

ఉగ్ర ప్రఛండాగ్ని జ్వాలల

భష్మీకరించీ

అకాల మృత్యువుల నుండి

కాపాడు స్వామీ

 

కొండ కోనలలోన

కొలువైన స్వామీ

నిండు మనసుతోటి

నిను చేరినాము

గండముల పారద్రోలి

మము బ్రోవుమయ్య

చండ ప్రచండ తేజోమయ

శ్రీ లక్ష్మి నారసింహా

శ్రీ లక్ష్మి నారసింహా

 

చరణం 2 :


దివిలోన భువిలోన

అణువణువు లోనా

నీవు కలవంటు

ప్రహ్లాదు పలుకగా

 

దివిలోన భువిలోన

అణువణువు లోనా

నీవు కలవంటు

ప్రహ్లాదు పలుకగా

 

ద్వార పాలకుని

శాపముపహరింపగా

స్థంబమున కనిపించె

ఉగ్ర రూపముగా

పాపాలు హరియించి

కరుణించు స్వామీ

 

ద్వార పాలకుని

శాపముపహరింపగా

స్థంబమున కనిపించె

ఉగ్ర రూపముగా

పాపాలు హరియించి

కరుణించు స్వామీ

 

కొండ కోనలలోన

కొలువైన స్వామీ

నిండు మనసుతోటి

నిను చేరినాము

గండముల పారద్రోలి

మము బ్రోవుమయ్య

చండ ప్రచండ తేజోమయ

శ్రీ లక్ష్మి నారసింహా

శ్రీ లక్ష్మి నారసింహా

 

 - ఓంకారం : RKSS Creations...

24, అక్టోబర్ 2024, గురువారం

దువ్విన తలనే దువ్వడం | Duvvina Talane Duvvadam | Song Lyrics | Naa Autograph (2004)

దువ్విన తలనే దువ్వడం 



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: కీరవాణి, సుమంగళి 


పల్లవి :


దువ్విన తలనే దువ్వడం 

అద్దిన పౌడర్ అద్దడం

దువ్విన తలనే దువ్వడం 

అద్దిన పౌడర్ అద్దడం


అద్దం వదలక పొవడం 

అందానికి మెరుగులు దిద్దడం

నడిచి నడిచి ఆగడం 

ఆగి ఆగి నవ్వడం 

ఉండి ఉండి అరవడం 

తెగ అరిచి చుట్టూ చూడటం 

ఇన్ని మార్పులకు కారణం 

ఏమైవుంటుందోయి


ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e


చరణం 1 :


ముఖమున మొటిమే రావడం

మనసుకి చెమటే పట్టడం

మతిమరుపెంతో కలగడం 

మతి స్తిమితం పూర్తిగ తప్పడం 

త్వరగా స్నానం చెయ్యడం

త్వర త్వరగా భొంచేస్తుండటం 

త్వరగా కలలోకెళ్ళడం

ఆలస్యం గ నిదరొవడం 

ఇన్నర్ధాలకి ఒకే పదం 

ఏమైవుంటుందోయి


ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e

ఇది కాదా l o v e


- పాటల ధనుస్సు 


23, అక్టోబర్ 2024, బుధవారం

ఆడే పాడే పసివాడా | Adepade Pasivada | Song Lyrics | Pelli Kanuka (1960)

ఆడే పాడే పసివాడా



చిత్రం  :  పెళ్లి కానుక (1960)

సంగీతం  :  ఏ.ఎం. రాజ

గీతరచయిత  : చెరువు ఆంజనేయశాస్త్రి

నేపధ్య గానం  :  సుశీల


పల్లవి:


ఆడే పాడే పసివాడా...

ఆడేనోయీ నీ తోడా

ఆనందం పొంగేనోయి దీపావళి

ఇంటింట వెలుగు దీపాల మెరుగు

ఎనలేని వేడుకరా... 

ఎనలేని వేడుకరా...


చరణం : 1


చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా

అరుదైన చిరుముద్దు అరువీయరారా

చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా

అరుదైన చిరుముద్దు అరువీయరారా


నా మదిలో నీకు నెలవే కలదూ

నా మదిలో నీకు నెలవే కలదూ

బదులే నాకూ నీవీయవలదు

నీపై మేము నిలిపిన ఆశలు

నిజమైన చాలునురా... ఆ.. ఆ..

నిజమైన చాలునురా


చరణం : 2


చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు

చిటపటమని పూలు చిమ్మే మతాబు

చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు

చిటపటమని పూలు చిమ్మే మతాబు


నీ రూపమే ఇంటి దీపము బాబూ

నీ రూపమే ఇంటి దీపము బాబూ

మాలో పెరిగే మమతవు నీవు

మంచనిపించి మము మురిపించిన

మరివేరే కోరమురా... ఆ.. ఆ..

మరివేరే కోరమురా


ఆడే పాడే పసివాడా...

ఆడేనోయీ నీ తోడా

ఆనందం పొంగేనోయి దీపావళి

ఇంటింట వెలుగు దీపాల మెరుగు

ఎనలేని వేడుకరా... 

ఎనలేని వేడుకరా...


- పాటల ధనుస్సు 

ఏదో తెలియని బంధమిది | Edo Teliyani Bandhamidi | Song Lyrics | Nayakudu (1987)

ఏదో తెలియని బంధమిది



చిత్రం: నాయకుడు (1987)

సంగీతం: ఇళయరాజా 

నేపధ్య గానం: బాలు, ఎస్. పి. శైలజ  

గీతరచయిత : వేటూరి సుందరరామమూర్తి 


పల్లవి :


ఏదో తెలియని బంధమిది

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది


చరణం 1 :


పూజకు నోచని పువ్వును కోరి

వలచిన స్వామివి నువ్వేలే...

రూపం లేని అనురాగానికి

ఊపిరి నీ చిరు నవ్వేలే...

కోవెల లేనీ....

కోవెల లేని దేవుడవు...

గుండెల గుడిలో వెలిశావు...ఊ..

పలికే జీవన సంగీతానికి

వలపుల స్వరమై ఒదిగావు...

తనువూ మనసూ ఇక నీవే... 


ఏదో తెలియని బంధమిది 

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది


చరణం 2:


వేసవి దారుల వేసటిలోన

వెన్నెల తోడై కలిశావు...

పూచే మల్లెల తీగకు నేడు

పందిరి నీవై నిలిచావు...

ఆశలు రాలే...ఏ..ఏ

ఆశలు రాలే శిశిరంలో...ఓ..

ఆమని నీవై వెలిశావు...ఊ..

ఆలుమగల అద్వైతానికి

అర్థం నీవై నిలిచావు...

తనువూ మనసూ ఇక నీవే...ఏ..ఏ


ఏదో తెలియని బంధమిది

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది హా..ఆ


- పాటల ధనుస్సు 

నా నవ్వే దీపావళి | Naa Navve Deepavali | Song Lyrics | Nayakudu (1987)

నా నవ్వే దీపావళి



చిత్రం: నాయకుడు (1987)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత : శ్రీరాధే  ఖండూజా 

నేపధ్య గానం: జముణా రాణి, సుశీల 


పల్లవి:


నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి

నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి

అరవిందం... నా వయసే

అతిమధురం... నా మనసే

నా నవ్వే నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి


చరణం 1:


కనని వినని అనుభవమే ఇదిరా

చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా

కనని వినని అనుభవమే ఇదిరా

చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా

అందాలన్నీ పూచెను నేడే

ఆశల కోటా వెలిసెను నేడే

స్నేహం నాది దాహం నీది

కొసరే రేయీ నాదే నీది

ఆడి పాడి నువ్వే రా...

నా నవ్వే..


నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి

అరవిందం... నా వయసే

అతిమధురం... నా మనసే

నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి


చరణం 2:


లలలాల లాల లాలలాలలాలా

లాలలా లాలలాలాలాల


కడలి అలలు నీ చెలి కోరికలే

నా కలల కథలు వణికెను గీతికలే

కడలి అలలు నీ చెలి కోరికలే

నా కలల కథలు వణికెను గీతికలే

వన్నెలు చిందే వెచ్చని ప్రాయం

పలికించేను అల్లరి పాఠం

పరువం నాలో రేగే వేళ

వయసే బంధం వేసే వేళ

ఆడి పాడి నువ్వే రా...

నా నవ్వే


నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి

అరవిందం... నా వయసే

అతిమధురం... నా మనసే

నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి


- పాటల ధనుస్సు 

మనోహరి మనోహరి | Manohari Manohari | Song Lyrics | Bahubali (2015)

మనోహరి మనోహరి



చిత్రం : బాహుబలి (2015)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

గీతరచయిత : చైతన్య ప్రసాద్,

నేపధ్య గానం : మోహన భోగరాజు, LV రేవంత్, 


పల్లవి :


ఇర్రుక్కుపో హత్తుకుని వీరా వీరా

కోరుకుపో ని తన్వి తీరా తీరా

తొణక బేనక్క వయసు తెరల్ని

తీరా తీరా

ఉళక్క పలక్క దుడుకు

పనేధో ఛైరా ఛైరా


మనోహరి మనోహరి


చరణం 1 :


తెనలోన నాని ఉన్న 

ద్రాక్ష పళ్ళ గుత్తిల

మాటలన్నీ మత్తుగున్నావే

ఇంతలేసి కళ్ళు ఉన్న 

ఇంతులంతా చేరి

వెంటపడిథెయ్ విన్తగున్నదే

ఒళ్లంత తుళ్లింత ఈ వింత 

కవింత లేల బాల


ఇర్రుక్కుపో హత్తుకుని వీరా వీరా

కొరుక్కుపో ని తన్వి తీరా తీరా


మనోహరి మనోహరి


చరణం 2 :


చేప కన్నుల్లోని కైపులు నీకిచ్చేనా

నాటు కొడవల్లాంటి 

నడుమే రాసి ఇచ్చేనా

నీ కండల కొండలపైనా

కైదండలు వేసేయనా

నా పై ఎద సంపాదనే

ఇక నీ సైయగ చేసేన

సుకించగా రా


మనోహరి మనోహరి


చరణం 3 :


పువ్వులన్ని చుట్టుముట్టి 

తేనె జల్లుతుంటే

కొట్టుకుంధీ గుండెయ్ తుమ్మెదయ్

ఒళ్ళంతా తుళ్లింత

ఈ వింత కవింత లేల బాల


ఇర్రుక్కుపో హత్తుకుని వీర వీర

కోరుకుపో ని తన్వి తీరా తీరా


- పాటల ధనుస్సు 


22, అక్టోబర్ 2024, మంగళవారం

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని | Nuvvante Pranamani | Song Lyrics | Naa Autograph (2004)

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: విజయ్ ఏసుదాస్ 


పల్లవి:


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప

కన్నులకి కళలు లేవు నీరు తప్ప


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప

కన్నులకి కళలు లేవు నీరు తప్ప


చరణం 1 :


మనసు వుంది మమతా వుంది

పంచుకునే నువ్వు తప్ప

ఊపిరి వుంది ఆయువు వుంది

ఉండాలనే ఆశ తప్ప


ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా

ప్రేమిస్తే సుదీర్ఘ నరకం నిజమేనా


ఎవరిని అడగాలి నన్ను తప్ప

చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని


చరణం 2 :


వెంటొస్తనన్నావు వెళ్ళొస్తానన్నావు

జంటై ఒకరి పంటైయి వెళ్ళావు

కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు

బరువై మెడకు ఊరివై పోయావు


దేవత లోను ద్రోహం ఉందని తెలిపావు

దీపం కూడా దహి ఇస్తుందని తెలిచావు


ఎవరిని నమ్మాలి నన్ను తప్ప

ఎవరిని నిందించాలి నిన్ను తప్ప


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని

ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప

కన్నులకి కళలు లేవు నీరు తప్ప


- పాటల ధనుస్సు 


మన్మథుడే బ్రహ్మను పూని | Manmadhude Brahmanu pooni | Song Lyrics | Naa Autograph (2004)

మన్మథుడే బ్రహ్మను పూని 



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: సందీప్ భౌమిక్, గంగ 


పల్లవి:


మన్మథుడే బ్రహ్మను పూని 

సృష్టించాడేమో గాని

యాభై కేజీ ల మందారాన్నీ

అయిదున్నర అడుగుల బంగారాన్నీ


పలికింది ఆకాశ వాణీ 

ఈ కొమ్మ ని ఎళుకొమ్మనీ


మన్మథుడే బ్రహ్మను పూని 

సృష్టించాడేమో గాని

యాభై కేజీ ల మందారాన్నీ

అయిదున్నర అడుగుల బంగారాన్నీ


చరణం 1 :


దీన్నీ తెలుగులో కారం అంటారు 

మరీ మలయాళంలో

ఇరివు

ఓహో ఇది తీపీ మీ భాషలో

మధురం

మరీ చేదు చేదు చేదు చేదు

కైకు


ఆరె రుచులని అనుకున్నానే 

నిన్నటివరకు నిన్నటివరకు

ఏడో రుచీనే కనుగొన్నానే 

నీ ప్రేమతో


రాజిగాల్లారిందా న్యాంకాండో మిన్నల్ 

వరయేల్ మిన్నల్ వరయేల్

ఇయం రుచియం ఉండిందరినీయం 

నీ ప్రేమతో


నిన్నటీ దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో

ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎంతో దట్టీల

హే మనసులాయో


నీ పలుకులే కీరవాణీ 

నా పెదవితో తాళమేయ్యనీ


మాధవుడే బ్రహ్మను పూని 

సృష్టించాడేమో గానీ

అరవై కేజీ ల చిలిపితనాన్ని

అలుపన్నది ఎరుగని రవితేజాన్నీ


చరణం 2 :


పెదాల్ని ఏమంటారు చుండు

నడుం నీ ఇడుపు

నా పెదాలతో నీ నడుం మీద 

ఇలా చేస్తే ఏమంటారో

ఆస దోస ఆమెమంద మీశ

ఏయ్ చెప్పమంటుంటే చెప్పనా


రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు

ఉందొ లేదో చూడాలంటే నీ నడుముని

వందలకొద్దీ కావాలంట 

జలపాతాలు జలపాతాలు

పెరీగే కొద్దీ తీర్చాలంటే నీ వేడినీ


లెక్కకుమించి జరగాలమ్మా 

మొదటి రాత్రులూ

మక్కువ తీరగా చెయ్యాలంటే 

మధురయాత్రలూ


విన్నాను నీ హృదయవాని 

వెన్నళ్లలో నిను చేరనీ


మన్మథుడే బ్రహ్మను పూని 

సృష్టించాడేమో గాని

అరవై కేజీ ల దుడుకుతనాన్నీ

అలుపన్నది ఎరుగని రవితేజాన్నీ


పలికింది ఆకాశ వాణీ 

ఈ కొమ్మనే ఎళుకొమ్మనీ


- పాటల ధనుస్సు 

గామ గామ హంగామా | Gama Gama Hangama | Song Lyrics | Naa Autograph (2004)

గామ గామ హంగామా



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: బాలు, శ్రీవర్ధిని


పల్లవి:


గామ గామ హంగామా

మనమే హాయి చిరునామా

పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా

గామ గామ హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


గామ గామ హంగామా

మనమే హాయి చిరునామా

పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా


గామ గామ హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


చరణం 1:


నీ రాకతో రాయిలాంటి 

నా జీవితానికే జీవం వచ్చిందీ

నీ చూపుతో జీవం వచ్చిన రాయే 

చక్కని శిల్పం అయ్యిందీ

చేయూతతో శిల్పం కాస్తా 

నడకలు నేర్చీ కోవెల చేరిందీ

నీ నవ్వుతో కోవెల చేరిన 

శిల్పంలోన కోరిక కలిగింది

ఆ కోరికేమిటో చెప్పని

నను వీడి నువ్వు వెళ్ళొద్దని

మళ్ళీ రాయిని చెయ్యొద్దనీ


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


గామ గామ హంగామా

మనమే హాయి చిరునామా

పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా


చరణం 2:


నీ మాటతో నాపై నాకే ఏదో 

తెలియని నమ్మకమొచ్చిందీ

నీ స్పూర్తితో ఎంతో ఎంతో 

సాధించాలని తపనే పెరిగిందీ

నీ చెలిమితో ఊహల్లోన 

ఊరిస్తున్న గెలుపే అందిందీ

ఆ గెలుపుతో నిస్పృహలోన 

నిదురిస్తున్న మనసే మురిసిందీ

ఆ మనసు అలిసిపోరాదని

ఈ చెలిమి నిలిచిపోవాలని

ఇలా బ్రతుకును గెలవాలనీ


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


గామ గామ హంగామా

మనమే హాయి చిరునామా

పాత బాధ గదినీ ఖాళీ చేద్దామా


గామ గామ హంగామా

కష్టం ఖర్చు పెడదామా

కొత్త సంతోషం జమ చేద్దామా


రప రప్పప్పారప్పారపా 

రప రప్పప్పారప్పా

రప రప్పప్ప రర రప్పప్పా 

రర పారపరపా


- పాటల ధనుస్సు 


గుర్తుకొస్తున్నాయి | Gurthukostunnayi | Song Lyrics | Naa Autograph (2004)

గుర్తుకొస్తున్నాయి



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: కృష్ణకుమార్ 


పల్లవి:


గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి

ఎదలోతులో ఏమూలనో

నిదురించు జ్ఞాపకాలూ 

నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


ఈగాలిలో ఏమమతలో

మా అమ్మ మాటలాగా 

పలకరిస్తున్నాయి...

గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


చరణం 1:


మొదట చూసినా 

టూరింగ్ సినిమా

మొదట మొక్కినా 

దేవుని ప్రతిమా


రేగుపళ్ళకై పట్టిన కుస్తీ

రాగిచెంబుతో చేసిన ఇస్త్రీ

కోతికొమ్మలో బెణికిన కాలు

మేకపొదుగులో తాగిన పాలూ

దొంగచాటుగా కాల్చిన బీడీ

సుబ్బుగాడిపై చెప్పిన చాడీ

మోటబావిలో మిత్రుని మరణం

ఏకధాటిగా ఏడ్చిన తరుణం...


గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


చరణం 2:


మొదటిసారిగా గీసిన మీసం

మొదట వేసినా ద్రౌపది వేషం

నెలపరీక్షలో వచ్చిన సున్నా

గోడకుర్చి వేయించిన నాన్న

పంచుకున్న ఆ పిప్పరమెంటు

పీరు సాయిబూ పూసిన సెంటూ

చెడుగుడాటలో గెలిచిన కప్పు

షావుకారుకెగవేసిన అప్పు


మొదటి ముద్దులో 

తెలియని తనమూ

మొదటి ప్రేమలో 

తియ్యందనమూ...


గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


ఎదలోతులో ఏమూలనో

నిదురించు జ్ఞాపకాలూ 

నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నె పిల్లవని కన్నులున్నవని | Kannepillavani Kannulunnavani | Song Lyrics | Akali Rajyam (1980)

కన్నె పిల్లవని కన్నులున్నవని చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు, జానకి  పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు