వస్తా... వెల్లొస్తా
చిత్రం : మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
వస్తా... వెల్లొస్తా.. వెల్తుండా..
వస్తా... ఎల్లొస్తా.. మళ్ళెప్పుడొస్తా?
రేపు సందేలకొస్తా..
చూస్తా..ఎదురు చూస్తా
చూస్తా.. ఎదురు చూస్తా
జాగు చేస్తే... సగం చస్తా..
రాకపోతే అసలు చస్తా
వస్తా... ఎల్లొస్తా... మళ్ళెప్పుడొస్తా ?
రేపు సందేలకొస్తా...
రేపు సందేలకొస్తా...
రేపు సందేలకొస్తా...
చరణం 1 :
వచ్చా.. వచ్చొచ్చొచ్చా..
వచ్చావులే.. మహా
నీకేం.... ఎవరన్నా చూస్తారని
ఎంత హడలి సచ్చా....
ఆ....ఎవరన్నా చూసారా ?
చూడకుండవుంటారా....చుప్పనాతోళ్లు....
పిట్ట చూసి పెట్ట తోటి గుట్టు చెప్పిందీ...
మబ్బు చూసి చందమామను
మాట రమ్మందీ
ఆహా.. గాలి చూసి ఈలవేసి
గోలచేసిందీ...
కాలెనక్కు మనసు ముందుకు
లాగిలాగి జాగైంది
వస్తా...ఎల్లొస్తా మళ్ళెప్పుడొస్తా ?
రేపు సందేలకొస్తా
రేపు సందేలకొస్తా ....
రేపు సందేలకొస్తా
చరణం 2 :
మావా... ఓ మావా... ఏం మ్మా.. కోపమా..
లే.. సంబడం..
వచ్చానుగా
వచ్చావులేమ్మా... చల్లారె ఏళకు
వచ్చావులేమ్మా... చల్లారె ఏళకు..
ఏం సెయ్యను ?
గడప దాటేతలకి నన్ను
కామయ్య కాచాడు
నక్కి నక్కి వస్తుంటే
నరసయ్య తగిలాడు...
ఏడిశాడు
రావులోరి గుడికాడ
రంగయ్య సకిలించాడు
నా గుండె దడ దడ సూడకుండా
కోపగిస్తావు...
నువ్వూ.. కోపగిస్తావు... వస్తా...
ఎహె...సూడనియ్యవే మనకేటె బయం
అందరినీ ఓ కంట సూసే దేవుడున్నాడు
ఆడి ముందు రేపే నీకు తాళిగడతాను
మేము ఆలుమగలం పొండిరా అని..
అరీచి చెబుతాను
ఒప్పినోళ్ళు మెచ్చనీ..
ఒప్పనోళ్ళు చచ్చనీ
వస్తా...ఎళ్ళొస్తా... మళ్లెప్పుడొస్తా
పెళ్ళప్పుడొస్తా... మన పెళ్ళప్పుడొస్తా...