RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
mayadari malligadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mayadari malligadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, మే 2024, శనివారం

నవ్వుతూ బతికాలిరా | Navvuthu Bathakalira | Song Lyrics| Mayadari Malligadu (1973)

నవ్వుతూ బతికాలిరా 



చిత్రం :  మాయదారి మల్లిగాడు (1973)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు


పల్లవి:


ఏయ్... హహహహహ...


నవ్వుతూ బతికాలిరా.. తమ్ముడూ.. 

నవ్వుతూ సావాలిరా..

ఏయ్.. నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ నవ్వుతూ సావాలిరా..


సచ్చినాక నవ్వలేవురా.. 

ఎందరేడ్చినా బతికి రావురా.. 

తిరిగిరావురా..

అందుకే.. నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ.. నవ్వుతూ సావాలిరా..


చరణం 1:


సంపేది ఎవడురా.. 

సచ్చేది ఎవడురా..

హోయ్.. సంపేది ఎవడురా.. 

సచ్చేది ఎవడురా..

శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా..

శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా..

కుడితే సావాలని.. వరమడిగిన సీమ..

కుట్టీ కుట్టక ముందే.. 

సస్తోంది సూడరా..ఆ..ఆ..ఆ..


అందుకే..నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ.. నవ్వుతూ సావాలిరా..


చరణం 2:


బతికుండగా నిన్ను ఏడిపించినోళ్ళు.. 

నువ్వు సస్తే ఏడుత్తారు దొంగనాయాళ్ళు

హహ.. దొంగనాయాళ్ళు..

అది నువ్వు సూసేది కాదు.. 

నిను కాసేది కాదు

అది నువ్వు సూసేది కాదు.. 

నిను కాసేది కాదు

నువ్వు పోయినా..ఆ..ఆ..ఆ..

నువ్వు పోయినా.. 

నీ మంచి సచ్చిపోదురా..

ఏయ్ సన్నాసి.. నవ్వరా


అందుకే.. నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ.. 

నవ్వుతూ సావాలిరా.. అరేయ్..


చరణం 3:


ఉన్నాడురా దేవుడు.. 

తోడు వస్తాడురా..ఆ.. 

తమ్ముడూ..

ఎప్పుడు?

అన్నాయం జరిగినప్పుడు 

అక్కరమం పెరిగినప్పుడు

అన్నాయం జరిగినప్పుడు 

అక్కరమం పెరిగినప్పుడు

వస్తాడురా...ఆ..ఆ..ఆ

సచ్చినట్టు వస్తాడురా..


అందుకే..నవ్వుతూ..

హైహై.. నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ నవ్వుతూ సావాలిరా..

సచ్చినాక నవ్వలేవురా.. 

ఎందరేడ్చినా బతికి రావురా.. 

తిరిగిరావురా..

అందుకే..నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ నవ్వుతూ సావాలిరా.. అరేయ్..


- పాటల ధనుస్సు  

మల్లె పందిరి నీడలోన జాబిల్లి | Mallepandiri Needalona | Song Lyrics | Mayadari Malligadu (1973)

మల్లె పందిరి నీడలోన జాబిల్లి



చిత్రం :  మాయదారి మల్లిగాడు (1973)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. 

మంచమేసి ఉంచినాను జాబిల్లి

మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. 

మంచమేసి ఉంచినాను జాబిల్లి

మా అన్నకు.. మా చంద్రికి.. 

ఇది తొలి రేయి.. నాకిది వరమోయి..ఈ..

కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. 

తెల్లవారనీయకోయి ఈ రేయి..


చరణం 1:


గడుసు పిల్లకు వయసు నేడే.. 

గురుతుకొచ్చిందీ..ఈ..

మొరటువాని మనసు దానికి 

పులకరించిందీ..ఈ..


గడుసుపిల్లకు వయసు నేడే 

గురుతుకొచ్చిందీ..ఈ..

మొరటువాని మనసు దానికి 

పులకరించిందీ..ఈ..


ఇద్దరికీ ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి

ఆ ముద్దు చూసి చుక్కలే నిను వెక్కిరించాలి


కళ్ళు కుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. 

తెల్లవార నీయకోయి ఈ రేయి..


చరణం 2:


పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ..ఈ..

పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ..ఈ..


పెళ్లి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ..ఈ..

పసుపు తాడే నోచుకోని బ్రతుకు నాదీ..ఈ..


ఈ పెళ్ళి చూసి నేను కూడా ముత్తైదువైనాను

ఈ పుణ్ణెమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి


మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. 

మంచమేసి ఉంచినాను జాబిల్లి

మా అన్నకు.. మా చంద్రికి.. 

ఇది తొలి రేయి.. నాకిది వరమోయి..ఈ..

కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. 

తెల్లవారనీయకోయి ఈ రేయి..


ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ..

ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ...


- పాటల ధనుస్సు  


తుర్రుపిట్ట త్రురుపిట్ట | Turrupitta Tirrupitta | Song Lyrics | Mayadari Malligadu (1973)

తుర్రుపిట్ట త్రురుపిట్ట



చిత్రం :  మాయదారి మల్లిగాడు (1973)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


అహా...  ఓహో.... హో ఆహ... 

హా హా.. హా... హా... తుర్….

తుర్రుపిట్ట...త్రురుపిట్ట  తోట చూస్తావా... 

నా తోడు వుంటావా 

తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోట చూస్తావా... 

నా తోడు వుంటావా 


దోరపండు రంగు చూసి కాటు వేస్తావా..  

నా ఏటు చూస్తావూ...

దోరపండు రంగు చూసి కాటు వేస్తావా..  

నా ఏటు చూస్తావూ... తుర్

తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోట చూస్తావా... 

నా తోడు వుంటావా 


చరణం 1 :


ఎన్నుకొచ్చి పంటచేను ఏపుగున్నాదీ..  

వయసు వచ్చీ కన్నెపిల్ల ఒంటిగున్నాది

ఎన్నుకొచ్చి పంటచేను ఏపుగున్నాదీ..  

వయసు వచ్చీ కన్నెపిల్ల ఒంటిగున్నాది 


కన్నెకైనా సేనుకైనా..  కంచె వుండాలీ... 

ఓ కాపు వుండాలీ....తుర్

తుర్రుపిట్ట... త్రురుపిట్ట తోట చూస్తావా... 

నా తోడు వుంటావా  


చరణం 2 : 


ముంజెలాటి మనసున్నాది... 

ఆ మనసుతోటి నంజుకోను సొగసున్నాదీ 

ఆ...ఆ..ఆ...ఆ

ముంజెలాటి మనసున్నాది... 

ఆ మనసుతోటి నంజుకోను సొగసున్నాదీ

సొగసుమాత్రం జుర్రుకోను వీలుకాదు...  

దాన్ని పొగరన్న ముసుగేసి దాచినాను...


 తుర్.... తుర్....తుర్....తుర్....

తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా... 

నా తోడు వుంటావా 


చరణం 3 :


కొమ్మకున్న పళ్ళగుత్తి కులుకుతున్నాదీ...  

గడుసుపిల్లా చేతిలోన వడిసేలున్నాదీ

కొమ్మకున్న పళ్ళగుత్తి కులుకుతున్నాదీ...  

గడుసుపిల్లా చేతిలోన వడిసేలున్నాదీ

దమ్ములుంటే కొమ్మవంచి.. అందుకోవాలీ....   

నీ అంతు తేలాలీ.....తుర్....


తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోట చూస్తావా... 

నా తోడు వుంటావా

దోరపండు రంగు చూసి కాటు వేస్తావా...  

నా ఏటు చూస్తావూ...

ఆహా.....  ఆహా..... ఆహా.....


- పాటల ధనుస్సు  


28, ఏప్రిల్ 2024, ఆదివారం

వస్తా వెల్లొస్తా | Vasta Vellosta | Song Lyrics | Mayadari Malligadu (1973)

వస్తా... వెల్లొస్తా



చిత్రం :  మాయదారి మల్లిగాడు (1973)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల, బాలు 



పల్లవి :


వస్తా... వెల్లొస్తా..  వెల్తుండా..

వస్తా... ఎల్లొస్తా..  మళ్ళెప్పుడొస్తా?

రేపు సందేలకొస్తా.. 


చూస్తా..ఎదురు చూస్తా

చూస్తా.. ఎదురు చూస్తా

జాగు చేస్తే... సగం చస్తా.. 

రాకపోతే అసలు చస్తా 


వస్తా... ఎల్లొస్తా...  మళ్ళెప్పుడొస్తా ?

రేపు సందేలకొస్తా...

రేపు సందేలకొస్తా...

రేపు సందేలకొస్తా...

  

చరణం 1 :


వచ్చా.. వచ్చొచ్చొచ్చా..

వచ్చావులే.. మహా

 నీకేం.... ఎవరన్నా చూస్తారని 

ఎంత హడలి సచ్చా....

ఆ....ఎవరన్నా చూసారా ?

చూడకుండవుంటారా....చుప్పనాతోళ్లు....


పిట్ట చూసి పెట్ట తోటి గుట్టు చెప్పిందీ...  

మబ్బు చూసి చందమామను 

మాట రమ్మందీ

ఆహా.. గాలి చూసి ఈలవేసి 

గోలచేసిందీ... 

కాలెనక్కు మనసు ముందుకు 

లాగిలాగి జాగైంది


వస్తా...ఎల్లొస్తా  మళ్ళెప్పుడొస్తా ?

రేపు సందేలకొస్తా

రేపు సందేలకొస్తా  ....

రేపు సందేలకొస్తా 



చరణం 2 : 


మావా... ఓ మావా... ఏం మ్మా.. కోపమా.. 

లే.. సంబడం.. 

వచ్చానుగా

వచ్చావులేమ్మా... చల్లారె ఏళకు

వచ్చావులేమ్మా... చల్లారె ఏళకు..  

ఏం సెయ్యను ?


గడప దాటేతలకి నన్ను 

కామయ్య కాచాడు

నక్కి నక్కి వస్తుంటే 

నరసయ్య తగిలాడు...  

ఏడిశాడు

రావులోరి గుడికాడ 

రంగయ్య సకిలించాడు

నా గుండె దడ దడ సూడకుండా 

కోపగిస్తావు...

నువ్వూ.. కోపగిస్తావు... వస్తా...


ఎహె...సూడనియ్యవే మనకేటె బయం

అందరినీ ఓ కంట సూసే దేవుడున్నాడు

ఆడి ముందు రేపే నీకు తాళిగడతాను

మేము ఆలుమగలం పొండిరా  అని.. 

అరీచి చెబుతాను

ఒప్పినోళ్ళు మెచ్చనీ.. 

ఒప్పనోళ్ళు చచ్చనీ


వస్తా...ఎళ్ళొస్తా...  మళ్లెప్పుడొస్తా

పెళ్ళప్పుడొస్తా... మన పెళ్ళప్పుడొస్తా...


- పాటల ధనుస్సు  

తలకి నీళ్లోసుకొని కురులారబోసుకొని | Talaki neelosukoni | Song Lyrics | Mayadari Malligadu (1973)

తలకి నీళ్లోసుకొని కురులారబోసుకొని



చిత్రం :  మాయదారి మల్లిగాడు (1973)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి:


తలకి నీళ్లోసుకొని.. 

కురులారబోసుకొని.. 

నిలుసుంటే...

నువ్వు నిలుసుంటే.. 

నా మనసు నిలవనంటది..

ఎంత రమ్మన్నా 

నిన్నొదిలి రానంటది..


తలకి నీళ్లోసుకొని 

తడియారబెట్టుకొని.. 

నిలుసుంటే..

నువ్వు నిలుసుంటే 

నా మనసు నిలవనంటది..

ఎంత రమ్మన్నా 

నిన్నొదిలి రానంటది..


చరణం 1:


పొద్దుపోని సూరీడు.. 

పొంచి పొంచి సూస్తుంటే..

పొద్దుపోని సూరీడు..ఊ.. 

పొంచి పొంచి సూస్తుంటే..

ముద్దు మొగం మీద 

నీటి ముత్తాలు మెరుస్తుంటే..

సొగసులకే బానిసను పిల్లోయ్.. 

నీ సొగసులకే బానిసను పిల్లోయ్..


తడిసి తడిసి నీళ్లల్లో.. 

నీ బిరుసెక్కిన కండరాలు..ఊ..

తడిసి తడిసి నీళ్లల్లో.. 

నీ బిరుసెక్కిన కండరాలు..ఊ..

నీరెండ ఎలుగుల్లో 

నిగానిగా మంటుంటే..

మగసిరికిదాసినోయ్ మావా.. 

నీ మగసిరికి దాసినోయ్ మావా..


తలకి నీళ్లోసుకొని.. 

కురులారబోసుకొని.. 

నిలుసుంటే...

నువ్వు నిలుసుంటే.. 

నా మనసు నిలవనంటది..

ఎంత రమ్మన్నా 

నిన్నొదిలి రానంటది..


చరణం 2:


ఆరీ ఆరని కోక.. 

అరకొరగా సుట్టుకుంటే..

ఆరీ ఆరని కోక..ఆ.. 

అరకొరగా సుట్టుకుంటే..

దాగీదాగని అందం 

దా..దా.. అంటుంటే..

దాహమేస్తున్నాది పిల్లోయ్.. 

సెడ్డ దాహమేస్తున్నాది పిల్లోయ్..


సూస్తున్న నీ కళ్ళూ.. 

సురకత్తులవుతుంటే..

సూస్తున్న నీ కళ్ళూ..ఊ.. 

సురకత్తులవుతుంటే..

ఓపలేక నా ఒళ్లు 

వంకరలు పోతుంటే..

ఏడుపొస్తున్నాది మావోయ్.. 

సెడ్డ ఏడుపొస్తున్నాది మావోయ్..


తలకి నీళ్లోసుకొని 

తడియారబెట్టుకొని.. 

నిలుసుంటే..

నువ్వు నిలుసుంటే 

నా మనసు నిలవనంటది..

ఎంత రమ్మన్నా 

నిన్నొదిలి రానంటది...


చరణం 3:


సల్లగాలి ఆ పక్కా.. 

సలిసలిగా సోకుతుంటే..

పిల్లగాలి ఈ పక్కా.. 

ఎచ్చెచ్చగ ఏపుతుంటే..

నడిమద్దె నలిగాను పిల్లోయ్..


ఈ పక్క ఆ పక్క 

ఇరకాటం నీకుంటే..

నాకెదటేమో కుర్రతనం.. 

ఎనకేమో కన్నెతనం..

ఎటుపోతే ఏమౌనో మావోయ్.. 

హోయ్..హోయ్..హోయ్..


తలకి నీళ్లోసుకొని.. 

కురులారబోసుకొని.. 

నిలుసుంటే...

నువ్వు నిలుసుంటే.. 

నా మనసు నిలవనంటది..

ఎంత రమ్మన్నా 

నిన్నొదిలి రానంటది..


- పాటల ధనుస్సు  

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు