RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, జూన్ 2025, బుధవారం

అమ్మ కదే బుజ్జి కదే | Ammakade Bujji kade | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

అమ్మ కదే  బుజ్జి కదే



చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య  గానం :  జానకి


పల్లవి:


అమ్మ గదే .. బుజ్జి గదే .. 

నాపై కోపమా

దానికదే దీనికిదే అంటే నేరమా

సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా

గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా


అమ్మ గదే ..బుజ్జి గదే.. 

నాపై కోపమా

I love you..I love you

I love you..I love you


చరణం 1:


ఈ పడుచు కోపాలు తాటాకు మంట

అవి రేపు తాపాలే కలిపేను జంట

మెరిసింది కొసమెరుపు... 

తెలిసిందిలే వలపు

రానివ్వు నా వైపు ... 

రవ్వంత నీ చూపు

వెంటబడ్డా వేడుకున్నా..  

జంటరాను వెళ్ళు వెళ్ళుమంటే

ఏట్లోనొ తోట్లోనొ పడతాను చస్తానులే .. 

నే సచ్చి నీ ప్రేమ 

సాధించుకుంటానులే


అమ్మ గదే .. బుజ్జి గదే .. 

నాపై కోపమా

దానికదే దీనికిదే అంటే నేరమా

సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా

గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా


అమ్మ గదే ..బుజ్జి గదే.. 

నాపై కోపమా


చరణం 2:


సరసాలు విరసాలై వచ్చింది తంటా

రగిలింది గుండెల్లో పొగలేని మంట

ఈ వెక్కిరింతల్తో..  వేధించి చంపొద్దు

నీ ఎత్తిపొడుపుల్తో ప్రాణాలు తియ్యొద్దు


Bye bye good bye.. 

Good luck to you darling

ఇన్నాళ్ళ బంధాలు ఈనాడే తీరేనులే... 

కన్నీటి వీడ్కోలు కడసారి చెప్పాలిలే 


అమ్మ గదే బుజ్జి గదే రావే తల్లిగా

దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా


I love you..I love you

I love you..I love you


- పాటల ధనుస్సు 


మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా | Manaku Dosti Okate | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా



చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు


పల్లవి:


మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా.. 

జబరుదస్తీ చేస్తే శాస్తిరా

విడిపోకు చెలిమితో..  

చెడిపోకు కలిమితో

జీవితాలు శాశ్వతాలు కావురా..

దోస్తీ.. ఒకటే ఆస్తిరా.. 

జబరుదస్తీ చేస్తే శాస్తిరా


చరణం 1:


కాదురా ఆటబొమ్మ..  

ఆడదే నీకు అమ్మ

ఎత్తరా కొత్త జన్మ..  

ప్రేమ నీ తాత సొమ్మా


తెలుసుకో తెలివిగా మసలుకో

ఉన్నదా నీకు దమ్ము 

దులుపుతా నీకు దుమ్ము

అలుసుగా ఆడకు మనసుతో


ఆ ప్రేమ ధనికుల విలువలు గని .. 

నీ వంటి ధనికులు వెలవెలమని

ఆ ప్రేమ ధనికుల విలువలు గని .. 

నీ వంటి ధనికులు వెలవెలమని

జీవిస్తే ఫలితమేమిటి .. 

శ్రీరాగమున కీర్తనలు మానరా


దోస్తీ..  ఒకటే ఆస్తిరా .. 

జబరుదస్తీ చేస్తే శాస్తిరా


చరణం 2:


ప్రేమకై నీవు పుట్టు..  

ప్రేమకై నీవు బ్రతుకు

ప్రేమకై నీవు చచ్చి..  

ప్రేమవై తిరిగి పుట్టు

మరణమే లేనిది మనసురా...


క్షణికమే యవ్వనమ్ము..  

కల్పనే జీవనమ్ము

నమ్ముకో..  దిక్కుగా ప్రేమనే

ఈ జనన మరణ వలయములనిక 

ఛేదించి మమతను మతమనుకుని

ఈ జనన మరణ వలయములనిక 

ఛేదించి మమతను మతమనుకుని

జీవించే మోక్షమార్గము .. 

శ్రీరస్తననుచు దీవెనగ దొరికిన


దోస్తీ ఒకటే ఆస్తిరా .. 

జబరుదస్తీ చేస్తే శాస్తిరా

విడిపోకు చెలిమితో 

చెడిపోకు కలిమితో .. 

జీవితాలు శాశ్వతాలు కావురా

దోస్తీ ఒకటే ఆస్తిరా .. 

జబరుదస్తీ చేస్తే శాస్తిరా


- పాటల ధనుస్సు 


మనసా శిరసా నీ నామము | Manasa Sirasa Nee Namamu | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ



చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు (1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి


పల్లవి:


మనసా.. శిరసా.. 

నీ నామము చేసెదనీ వేళ

మనసా శిరసా 

నీ నామము చేసెదనీ వేళ


భవ బంధనమో భయ కంపనమో .. 

శివశంకర వణికింపగ శరణని

మనసా.. శిరసా.. 

నీ నామము చేసెదనీ వేళ


చరణం 1:


తాండవమాడే నటుడైనా..ఆ..ఆ..ఆ... 

తలిచిన వేళ హితుడేలే

తాండవమాడే నటుడైనా...  

తలిచిన వేళ హితుడేలే

గిరిజనులే ఆ శివున్ని 

గురి విడక ధ్యానించు

ఆ శివ శంకర నామము చేసిన 

నీకిక చింతలు ఉండవులే

బెరుకుమాని ప్రేమించి .. 

ప్రేమ మీద లాలించె

యముడు చూపు తప్పించి .. 

తప్పులున్న మన్నించేయ్

ఇష్టదైవమతని మీద దృష్టిని 

నిలిపి శివుని పిలవ వేళ ..

ఓ మనసా..  శిరసా..  

నీ నామము చేసెదనీ వేళ


భవ బంధనమో భయ కంపనమో .. 

శివశంకర వణికింపగ శరణని

మనసా శిరసా 

నీ నామము చేసెదనీ వేళ


చరణం 2:


సప్త మహర్షుల సన్నిధిలో ..

గరి రిస సని నిద దప

పగమ పదస పద సరిగమ గ .. 

సప్త మహర్షుల సన్నిధిలో

సప్త మహర్షుల సన్నిధిలో .. 

సప్త స్వరాల ప్రియ శృతిలో

గౌరి వలె ఆ శివుని 

గౌరవమే కాపాడు


ఆ నవజాతకు ఈ భువజాతకు 

కలిసిన జాతకమీ వరుడే

లంక చెరను విడిపించి .. 

శంకలన్నీ తొలగించి

ఈసులన్నీ కరిగించి .. 

నీ సుశీల మెరిగించె

లగ్నమైన మనసుతోడ పెళ్ళికి 

లగ్నమిపుడు కుదురు వేళ ..


ఓ మనసా శిరసా 

నీ నామము చేసెదనీ వేళ

భవ బంధనమో భయ కంపనమో .. 

శివశంకర వణికింపగ శరణని

మనసా శిరసా 

నీ నామము చేసెదనీ వేళ

మనసా శిరసా 

నీ నామము చేసెదనీ వేళ


- పాటల ధనుస్సు 


సలసల నను కవ్వించనేల | Salasala Nanu Kavvinchanela | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

సలసల నను కవ్వించనేల



చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి


పల్లవి:


సలసల నను కవ్వించనేల

గిలగిల నను బంధించనేల


సాయంకాల సందేశాలు 

నాకే పంపనేల...

ఓ మై లవ్... లల.. లల ...లల..

సలసల నను కవ్వించనేల

గిలగిల నను బంధించనేల...


చరణం 1:


L O V E ... అనే పల్లవి

K I S S ...అనుపల్లవి


నీ చలి గిలి సందేళ 

కొత్త సంధి చెయ్యగా...

మల్లెలే ఇలా మన్నించి 

వచ్చి గంధమివ్వగా...

నాకు నీవు.. నీకు  నేను... 

లోకమవ్వగా చిలిపిగా...


సలసల నను కవ్వించనేల..

గిలగిల నను బంధించనేల...

సాయంకాల సందేశాలు 

నాకే పంపనేల...

ఓ మై లవ్.. లల.. లల ...లల..


చరణం 2:


sweety beauty అనే పిలుపులు

మాటీ చోటీ అనే వలపులు

కౌగిళింతలే ఈ వేళ 

జంట కాపురాలుగా...

పాడుకో చెలి ఈ నాటి 

ప్రేమ రాగమాలికా...

కోకిలమ్మ  తుమ్మెదయ్య... 

వంత పాడగా... చిలిపిగా...


గిలగిల నను బంధించనేల...

సలసల నను కవ్వించనేల

సాయంకాల సందేశాలు 

నాకే పంపనేల...

ఓ మై లవ్..  లల.. లల ...లల..

సలసల నను కవ్వించనేల..

గిలగిల నను బంధించనేల...


- పాటల ధనుస్సు 


కొలువైనాడే ఊరికి కొరివైనాడే | Koluvainade Ooriki | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

కొలువైనాడే ఊరికి కొరివైనాడే

 


చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు 


పల్లవి :


కొలువైనాడే ఊరికి కొరివైనాడే 

మా కొబ్బరికాయల సుబ్బారాయడే 

కొలువైనాడే ఊరికి కొరివైనాడే 

మా కొబ్బరికాయల సుబ్బారాయడే 


కురిడీ పెట్టి బురిడీ గొట్టి 

ధరలో బుట్టి ధరలే పెంచీ 

కురిడీ పెట్టి బురిడీ గొట్టి 

ధరలో బుట్టి ధరలే పెంచీ  


కొలువైనాడే ఊరికి కొరివైనాడే 

మా కొబ్బరికాయల సుబ్బారాయడే


చరణం 1 :


కోనసీమ తోటల్లోన 

కొండముచ్చు వీడేనమ్మా

కొబ్బరికాయ చూశాడమ్మా 

కోతిలాగ గెంతాడమ్మా 


తాళ్ళే పేనాడు 

మారాముళ్ళే వేశాడు

తైలం తీశాడు 

మా తలకే రాశాడు


కొబ్బరి రుబ్బి సబ్బులు 

చేసి అమ్మాడు హోయ్

సారాబట్టీ పెట్టి కోట్లే పట్టాడు


ఓయమ్మో మాయమ్మో 

ఓయమ్మో మాయమ్మో

కొలువైనాడే కొండచిలువైనాడే 

మా కొబ్బరికాయల సుబ్బారాయడే 

కొలువైనాడే కొండచిలువైనాడే 

మా కొబ్బరికాయల సుబ్బారాయడే


చరణం 2 :


తధిగిణతోం తద్ధీంగిణ్ణ 

తొడగడితే టపడపడప్ప 

కలబడతాం డిష్షుం డిష్షుం 

తలకొడతాం హా...


తధిగిణతోం తొడగడితే 

కలబడతాం తలకొడతాం 

ఓరోరి కొబ్బరిబొండాం ఐతే 

మా ఊరికి గండం ఖాళీరో  

ఓరోరి కొబ్బరిబొండాం ఐతే 

మా ఊరికి గండం ఖాళీరో


పడతాం నీ పాశం హాం.. 

హాం... హాం.. హాం...

తీస్తాం నీ మైకం వెల్కం 

వెల్కం వెల్కం వెల్కం 


పడతాం నీ పాశం 

కకకక్కకం కంకం కంకం 

తీస్తాం నీ మైకం 

దదద్దిగుదిగు దగదిగుదోం

పగపడతాం పనిపడతాం చెరబడతాం 

తకదిమి తకదిమి తకదిమి 


పగపడతాం పనిపడతాం చెరబడతాం 

తకదిమి తకదిమి తకదిమి 

కొలువైనాడే కోట్ల విలువైనాడే 

మా కొబ్బరికాయల సుబ్బారాయడే 

కొలువైనాడే కోట్ల విలువైనాడే 

మా కొబ్బరికాయల సుబ్బారాయడే


చరణం 3 :


ఈ నారికేళుని చోరగాథలు 

వీనుల వినుడు

తందానతాన తానతందన

కొబ్బరిలంకలో గొప్పగా కొలువైన 

కొత్త లంకేశ్వరుడి గోలగాథలు మీరు

హో హో హో హో


రక్షకభటుల తోడ న్యాయవాదుల తోడ 

మంత్రిమాన్యుల తోడ 

చిత్రగుప్తుల తోడ


దర్పాలు మీర దర్బారు సేయు దర్జాలు 

చూడ తరమా మా తరమా ఆయ్...

తరమా మా తరమా


అయ్యో కోకాసురుడే కోట్ల బాకాసురుడే 

మా కొబ్బరికాయల సుబ్బారాయడే  

అయ్యో కోకాసురుడే కోట్ల బాకాసురుడే 

మా కొబ్బరికాయల సుబ్బారాయడే  


- పాటల ధనుస్సు 


2, జూన్ 2025, సోమవారం

ఏమని నే చెలి పాడుదునో | Emani Ne Cheli paduduno | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

ఏమని నే చెలి పాడుదునో



చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య  గానం :  బాలు, జానకి


పల్లవి:


ఏమని నే..  చెలి పాడుదునో

తికమకలో ఈ మకతికలో

తోటలలో .. పొదమాటులలో .. 

తెరచాటులలో...


ఏమని నే మరి పాడుదునో

తికమకలో ఈ మకతికలో


చరణం 1:


నవ్వు .. చిరునవ్వు .. 

విరబూసే పొన్నలా

ఆడు .. నడయాడు .. 

పొన్నల్లో నెమలిలా


పరువాలే పార్కుల్లో .. 

ప్రణయాలే పాటల్లో

నీ చూపులే నిట్టూర్పులై .. 

నా చూపులే ఓదార్పులై

నా ప్రాణమే నీ వేణువై .. 

నీ ఊపిరే నా ఆయువై ..

సాగే తీగ సాగే రేగిపోయే 

లేత ఆశల కౌగిట.. 


ఏమని నే.. మరి పాడుదునో.. 

తికమకలో ఈ మకతికలో


చరణం 2:


చిలక .. గోరింక .. 

కలబోసే కోరిక

పలికే .. వలపంతా .. 

మనదేలే ప్రేమికా


దడ పుట్టే పాటల్లో .. 

ఈ దాగుడుమూతల్లో

ఏ గోపికో దొరికిందని .. 

ఈ రాజుకే మరుపాయెనా

నవ్విందిలే బృందావని.. 

నా తోడుగా ఉన్నావని..

ఊగే తనువులూగే.. 

వణకసాగె రాసలీలలు ఆడగ 


ఏమని నే..  మరి పాడుదునో ..

తొలకరిలో తొలి అల్లరిలో 

మన అల్లికలో..


ఏమని నే..  చెలి పాడుదునో

తికమకలో ఈ మకతికలో


- పాటల ధనుస్సు 


1, జూన్ 2025, ఆదివారం

పెళ్ళంటె పందిళ్ళు | Pellante Pandillu | Song Lyrics | Trishulam (1982)

పెళ్ళంటె పందిళ్ళు



చిత్రం: త్రిశూలం (1982) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


పెళ్ళంటే... 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ 

మూడే ముళ్ళు.. 

ఏడే అడుగులు.. 

మొత్తం కలిసీ నూరేళ్ళు 

ఆ...ఆ...ఆ...ఆ..... 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ 

మూడే ముళ్ళు.. 

ఏడే అడుగులు.. 

మొత్తం కలిసీ నూరేళ్ళు 


పెళ్ళైతే... 


పెళ్ళైతె ముంగిళ్ళు.. 

లోగిళ్ళు ముగ్గులు.. 

ముత్తైదు భాగ్యాలూ.... 

ముద్దూ ముచ్చట్లు.. 

మురిసే లోగుట్లు.. 

చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు.. 

ఆ...ఆ...ఆ...ఆ..... 


పెళ్ళైతె ముంగిళ్ళు.. 

లోగిళ్ళు ముగ్గులు 

ముత్తైదు భాగ్యాలూ.... 



చరణం 1: 


గోదారి ఒడ్డున.. 

గోగుల్లు పూచిన వెన్నెలలో 

కొసరాడు కోర్కెలు.. 

చెరలాడు కన్నుల సైగలలో 

ఆ ఆ.. గోదారి ఒడ్డున.. 

గోగుల్లు పూచిన వెన్నెలలో 

కొసరాడు కోర్కెలు.. 

చెరలాడు కన్నుల సైగలలో 


మమతానురాగాల 

మరుమల్లెలల్లిన పానుపులూ... 

హృదయాలు పెదవుల్లో.. 

ఎరుపెక్కు ఏకాంత వేళల్లో 

వలపు పులకింతలో.. 

వయసు గిలిగింతలో.. 

వింతైన సొగసుల వేడుకలో.. 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ... 

మూడే ముళ్ళు.. 

ఏడే అడుగులు.. 

మొత్తం కలిసీ నూరేళ్ళు 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ.. 


చరణం 2: 


కలలన్ని కలబోసి.. 

వెలసిన ఈ పంచవటిలో 

ఇల్లాలు నేనై.. 

ఇలవేల్పు నీవైన కోవెలలో 

ఆ... కలలన్ని కలబోసి.. 

వెలసిన ఈ పంచవటిలో 

ఇల్లాలు నేనై.. 

ఇలవేల్పు నీవైన కోవెలలో 


సిరిమువ్వ రవళుల 

మరిపించు నీ నవ్వు సవ్వడిలో... 

కులమన్నదే లేని 

అలనాటి వేదాల ఒరవడిలో 

సామగానాలము.. 

సరసరాగాలము 

ప్రేమికులమన్న 

కులమున్న లోకంలో 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ 

మూడే ముళ్ళు.. 

ఏడే అడుగులు.. 

మొత్తం కలిసీ నూరేళ్ళు 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ.... 


- పాటల ధనుస్సు 


వెలుగుకు ఉదయం | Veluguku Udayam | Song Lyrics | Trishulam (1982)

వెలుగుకు ఉదయం చెలిమికి హృదయం



చిత్రం : త్రిశూలం (1982)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


వెలుగుకు ఉదయం.. 

చెలిమికి హృదయం

నొసటికి తిలకం.. 

కురులకు కుసుమం

జతపడి ఉన్నవి అనాదిగా..  

జన్మజన్మల ఋణాలుగా

జతపడి ఉన్నవి అనాదిగా.. 

జన్మజన్మల ఋణాలుగా


వెలుగుకు ఉదయం.. 

చెలిమికి హృదయం

నొసటికి తిలకం.. 

కురులకు కుసుమం

జతపడి ఉన్నవి అనాదిగా..  

జన్మజన్మల ఋణాలుగా

జతపడి ఉన్నవి అనాదిగా.. 

జన్మజన్మల ఋణాలుగా 


చరణం 1 :


చేయి చేయి చేసిన బాసకు 

ఊపిరి నీవైనావు

చెలిమి కలిమి అల్లిన తీగకు 

పందిరి నీవైనావు

చేయి చేయి చేసిన బాసకు 

ఊపిరి నీవైనావు

చెలిమి కలిమి అల్లిన తీగకు 

పందిరి నీవైనావు


నా ఆశకు రూపం నీవై.. 

నా ఆశయదీపం నీవై

నా ఆశకు రూపం నీవై.. 

నా ఆశయదీపం నీవై

నీవు నేను మనమౌదాం.. 

నీవు నేను మనమౌదాం

మనమే మనకొక మతమౌదాం


వెలుగుకు ఉదయం.. 

చెలిమికి హృదయం

నొసటికి తిలకం.. 

కురులకు కుసుమం

జతపడి ఉన్నవి అనాదిగా..  

జన్మజన్మల ఋణాలుగా

జతపడి ఉన్నవి అనాదిగా.. 

జన్మజన్మల ఋణాలుగా 


చరణం 2 :


జీవంపోసే రాగంకోసం 

వేచిన పల్లవి నేను

భావం తెలిసిన గీతం కోసం 

వెతికిన రాగం నేను

జీవం పోసే రాగం కోసం 

వేచిన పల్లవి నేను

భావం తెలిసిన గీతం కోసం 

వెతికిన రాగం నేను


ఈ మమతకు శృతినే నేను.. 

ఈ నడతకు లయనే నేను

ఈ మమతకు శృతినే నేను.. 

ఈ నడతకు లయనే నేను

నేను నేనను ఇద్దరము..  

నేను నేనను ఇద్దరము

నిన్న రేపటి సంగమము 


వెలుగుకు ఉదయం.. 

చెలిమికి హృదయం

నొసటికి తిలకం.. 

కురులకు కుసుమం

జతపడి ఉన్నవి అనాదిగా..  

జన్మజన్మల ఋణాలుగా

జతపడి ఉన్నవి అనాదిగా.. 

జన్మజన్మల ఋణాలుగా 


- పాటల ధనుస్సు 


పన్నెండేళ్ళకు పుష్కరాలు | Pannendellaku Pushkaralu | Song Lyrics | Trishulam (1982)

పన్నెండేళ్ళకు పుష్కరాలు



చిత్రం: త్రిశూలం (1982)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


తం తననం తం తననం

తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. 

పదహారేళ్ళకు పరువాలు

ఆనాడు చేసేవి తానాలు.. 

ఈనాడు వచ్చేవి తాపాలు

తాపాలు ఆరాలి తానాలతో.. 

పరువాలు కలవాలి తాపాలతో


తం తననం తం తననం

తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. 

పదహారేళ్ళకు పరువాలు

ఆనాడు చేసేవి తానాలు.. 

ఈనాడు వచ్చేవి తాపాలు

తాపాలు ఆరాలి తానాలతో.. 

పరువాలు కలవాలి తాపాలతో


తం తననం తం తననం

తం తననం తం తననం 


చరణం 1 :


ముద్దుగా పుట్టాను పొదలలో 

పువ్వులాగా

దిద్దితే ఎదిగాను పలకలో 

రాతలాగా

అల్లరిగా జల్లులుగా కదిలావు 

ఏరులాగా

ఒంపులుగా సొంపులుగా కులికావు 

ఈడురాగా


ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా.. 

తోడైనవాడితో కలిసిపోగా హా..

ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా.. 

తోడైనవాడితో కలిసిపోగా

గలగలలుగ కిలకిలలుగ.. 

తొలికలలుగ వడి సెలలుగ

గలగలలుగ కిలకిలలుగ.. 

తొలికలలుగ వడి సెలలుగ

ఉరికాను నిన్ను చేరగా


తం తననం తం తననం

తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. 

పదహారేళ్ళకు పరువాలు


చరణం 2 :


మొక్కువై ముడుపువై ఉన్నావు 

ఇన్నినాళ్ళు

మక్కువై మనసువై తీర్చుకో 

మొక్కుబళ్ళు

మేలుకొని కాచుకొని వెయ్యైనవి 

రెండు కళ్ళు

చేరుకొని ఆనుకొని నడవాలి 

కాళ్ళు కాళ్ళు


చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు

నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు

చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు

నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు


చెరిసగముగ సరిసమముగ.. 

చిరుజగముగ చిరునగవుగ

చెరిసగముగ సరిసమముగ.. 

చిరుజగముగ చిరునగవుగ

చేద్దాము కాపురాలు


తం తననం తం తననం

తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. 

పదహారేళ్ళకు పరువాలు

ఆనాడు చేసేవి తానాలు.. 

ఈనాడు వచ్చేవి తాపాలు

తాపాలు ఆరాలి తానాలతో.. 

పరువాలు కలవాలి తాపాలతో


తం తననం తం తననం

తం తననం తం తననం 


- పాటల ధనుస్సు 


అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ | Anukoledamma Ila Vuntundani | Song Lyrics | Trishulam (1982)

అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ



చిత్రం: త్రిశూలం (1982) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 

ఏదో మత్తుందనీ మతే పోతుందనీ 

అనుభవమైన ఇప్పటి దాకా 

అనుకోలేదమ్మా 


నేనూ అనుకోలేదమ్మ 

ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 

ఏదో మత్తుందనీ మతే పోతుందనీ 

అనుభవమైన ఇప్పటి దాకా 

అనుకోలేదమ్మా 


అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 


చరణం 1: 


ఒక్క క్షణంలో నాకే తెలియక 

ఏదో జరిగింది 

సిగ్గు వచ్చి నా చెంప మీటితే 

ముద్దని తెలిసింది 


ఒక్క క్షణంలో నాకే తెలియక 

ఏదో జరిగింది 

సిగ్గు వచ్చి నా చెంప మీటితే 

ముద్దని తెలిసింది 


నిన్ను చూసుకొని అనురాగానికి 

వేగం వచ్చింది 

నిన్ను చూసుకొని అనురాగానికి 

వేగం వచ్చింది 

కన్నె పెదవిపై ముద్ర వేసి 

అది హద్దును చెరిపింది 


సిగ్గు... చెంప... పెదవీ... ముద్దు 

సిగ్గు... చెంప... పెదవీ... ముద్దు 

వలపుల తావులనీ వావీ వరసలనీ... 

అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ... 


చరణం 2: 


గాలి వీచితే పరవశమంది 

తీగే ఊగిందో 

తీగ ఊగితే పరువం వచ్చి 

గాలే వీచిందో... 


గాలి వీచితే పరవశమంది 

తీగే ఊగిందో..ఓ..ఓ.. 

తీగ ఊగితే పరువం వచ్చి 

గాలే వీచిందో 


తేటి పాపకు ఆకు చాటునా 

పువ్వే విరిసిందో 

తేటి పాపకు ఆకు చాటునా 

పువ్వే విరిసిందో 

పువ్వు సొగసుకు తేటి గొంతులో 

పాటే పలికిందో 


గాలి... తీగ... పువ్వూ... తుమ్మెదా... 

గాలి... తీగ... పువ్వూ... తుమ్మెదా... 

కలిసిన జంటలనీ... కలవక ఉండవనీ 

నేను అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 

ఏదో మత్తుందనీ మతే పోతుందనీ 

అనుభవమైన ఇప్పటి దాకా 

అనుకోలేదమ్మా 


నేనూ అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 

ఏదో మత్తుందనీ మతే పోతుందనీ


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు