RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
poornima jayaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
poornima jayaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జూన్ 2025, బుధవారం

అమ్మ కదే బుజ్జి కదే | Ammakade Bujji kade | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

అమ్మ కదే  బుజ్జి కదే



చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య  గానం :  జానకి


పల్లవి:


అమ్మ గదే .. బుజ్జి గదే .. 

నాపై కోపమా

దానికదే దీనికిదే అంటే నేరమా

సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా

గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా


అమ్మ గదే ..బుజ్జి గదే.. 

నాపై కోపమా

I love you..I love you

I love you..I love you


చరణం 1:


ఈ పడుచు కోపాలు తాటాకు మంట

అవి రేపు తాపాలే కలిపేను జంట

మెరిసింది కొసమెరుపు... 

తెలిసిందిలే వలపు

రానివ్వు నా వైపు ... 

రవ్వంత నీ చూపు

వెంటబడ్డా వేడుకున్నా..  

జంటరాను వెళ్ళు వెళ్ళుమంటే

ఏట్లోనొ తోట్లోనొ పడతాను చస్తానులే .. 

నే సచ్చి నీ ప్రేమ 

సాధించుకుంటానులే


అమ్మ గదే .. బుజ్జి గదే .. 

నాపై కోపమా

దానికదే దీనికిదే అంటే నేరమా

సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా

గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా


అమ్మ గదే ..బుజ్జి గదే.. 

నాపై కోపమా


చరణం 2:


సరసాలు విరసాలై వచ్చింది తంటా

రగిలింది గుండెల్లో పొగలేని మంట

ఈ వెక్కిరింతల్తో..  వేధించి చంపొద్దు

నీ ఎత్తిపొడుపుల్తో ప్రాణాలు తియ్యొద్దు


Bye bye good bye.. 

Good luck to you darling

ఇన్నాళ్ళ బంధాలు ఈనాడే తీరేనులే... 

కన్నీటి వీడ్కోలు కడసారి చెప్పాలిలే 


అమ్మ గదే బుజ్జి గదే రావే తల్లిగా

దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా


I love you..I love you

I love you..I love you


- పాటల ధనుస్సు 


సలసల నను కవ్వించనేల | Salasala Nanu Kavvinchanela | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

సలసల నను కవ్వించనేల



చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి


పల్లవి:


సలసల నను కవ్వించనేల

గిలగిల నను బంధించనేల


సాయంకాల సందేశాలు 

నాకే పంపనేల...

ఓ మై లవ్... లల.. లల ...లల..

సలసల నను కవ్వించనేల

గిలగిల నను బంధించనేల...


చరణం 1:


L O V E ... అనే పల్లవి

K I S S ...అనుపల్లవి


నీ చలి గిలి సందేళ 

కొత్త సంధి చెయ్యగా...

మల్లెలే ఇలా మన్నించి 

వచ్చి గంధమివ్వగా...

నాకు నీవు.. నీకు  నేను... 

లోకమవ్వగా చిలిపిగా...


సలసల నను కవ్వించనేల..

గిలగిల నను బంధించనేల...

సాయంకాల సందేశాలు 

నాకే పంపనేల...

ఓ మై లవ్.. లల.. లల ...లల..


చరణం 2:


sweety beauty అనే పిలుపులు

మాటీ చోటీ అనే వలపులు

కౌగిళింతలే ఈ వేళ 

జంట కాపురాలుగా...

పాడుకో చెలి ఈ నాటి 

ప్రేమ రాగమాలికా...

కోకిలమ్మ  తుమ్మెదయ్య... 

వంత పాడగా... చిలిపిగా...


గిలగిల నను బంధించనేల...

సలసల నను కవ్వించనేల

సాయంకాల సందేశాలు 

నాకే పంపనేల...

ఓ మై లవ్..  లల.. లల ...లల..

సలసల నను కవ్వించనేల..

గిలగిల నను బంధించనేల...


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు