RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
veluguku udayam song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
veluguku udayam song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జూన్ 2025, ఆదివారం

వెలుగుకు ఉదయం | Veluguku Udayam | Song Lyrics | Trishulam (1982)

వెలుగుకు ఉదయం చెలిమికి హృదయం



చిత్రం : త్రిశూలం (1982)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


వెలుగుకు ఉదయం.. 

చెలిమికి హృదయం

నొసటికి తిలకం.. 

కురులకు కుసుమం

జతపడి ఉన్నవి అనాదిగా..  

జన్మజన్మల ఋణాలుగా

జతపడి ఉన్నవి అనాదిగా.. 

జన్మజన్మల ఋణాలుగా


వెలుగుకు ఉదయం.. 

చెలిమికి హృదయం

నొసటికి తిలకం.. 

కురులకు కుసుమం

జతపడి ఉన్నవి అనాదిగా..  

జన్మజన్మల ఋణాలుగా

జతపడి ఉన్నవి అనాదిగా.. 

జన్మజన్మల ఋణాలుగా 


చరణం 1 :


చేయి చేయి చేసిన బాసకు 

ఊపిరి నీవైనావు

చెలిమి కలిమి అల్లిన తీగకు 

పందిరి నీవైనావు

చేయి చేయి చేసిన బాసకు 

ఊపిరి నీవైనావు

చెలిమి కలిమి అల్లిన తీగకు 

పందిరి నీవైనావు


నా ఆశకు రూపం నీవై.. 

నా ఆశయదీపం నీవై

నా ఆశకు రూపం నీవై.. 

నా ఆశయదీపం నీవై

నీవు నేను మనమౌదాం.. 

నీవు నేను మనమౌదాం

మనమే మనకొక మతమౌదాం


వెలుగుకు ఉదయం.. 

చెలిమికి హృదయం

నొసటికి తిలకం.. 

కురులకు కుసుమం

జతపడి ఉన్నవి అనాదిగా..  

జన్మజన్మల ఋణాలుగా

జతపడి ఉన్నవి అనాదిగా.. 

జన్మజన్మల ఋణాలుగా 


చరణం 2 :


జీవంపోసే రాగంకోసం 

వేచిన పల్లవి నేను

భావం తెలిసిన గీతం కోసం 

వెతికిన రాగం నేను

జీవం పోసే రాగం కోసం 

వేచిన పల్లవి నేను

భావం తెలిసిన గీతం కోసం 

వెతికిన రాగం నేను


ఈ మమతకు శృతినే నేను.. 

ఈ నడతకు లయనే నేను

ఈ మమతకు శృతినే నేను.. 

ఈ నడతకు లయనే నేను

నేను నేనను ఇద్దరము..  

నేను నేనను ఇద్దరము

నిన్న రేపటి సంగమము 


వెలుగుకు ఉదయం.. 

చెలిమికి హృదయం

నొసటికి తిలకం.. 

కురులకు కుసుమం

జతపడి ఉన్నవి అనాదిగా..  

జన్మజన్మల ఋణాలుగా

జతపడి ఉన్నవి అనాదిగా.. 

జన్మజన్మల ఋణాలుగా 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు