RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, మే 2025, గురువారం

కన్నె పిల్లవని కన్నులున్నవని | Kannepillavani Kannulunnavani | Song Lyrics | Akali Rajyam (1980)

కన్నె పిల్లవని కన్నులున్నవని



చిత్రం: ఆకలి రాజ్యం (1980) 

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి : 


తన తనననతన తననన 

తననననన తాన తన్న తననా 


ఓహో కన్నెపిల్లవని కన్నులున్నవని 

యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ 


లల లల లల లలలలల 

లలలల లలలల లాలల 


చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి 

యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి 


కన్నెపిల్లవని కన్నులున్నవని 

యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ 

చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి 

యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి 


యేమంటావ్....సంగీతం 

న న నా ఉమ్మ్....నువ్వైతే 

రి స రీ... సాహిత్యం......

ముం..ముం..ముం..నేనవుతా 


సంగీతం నువ్వైతే 

సాహిత్యం నేనవుతా 


చరణం 1: 


న న న న న...  Say it once again 

న న న న న 

ముం..... స్వరము నీవై 

తరనన తరరనన 

స్వరమున పదము నేనై....ఓ.కె 

తానే తానే తాన 

ఒహో అలాగా.... గానం గీతం కాగా 

తరన తాన...  కవిని నేనై 

తాన తనన తాన...  

నాలో కవిత నీవై 

నాననాననా లలలా నననా తరనా...  

beautiful  

కావ్యమైనదీ..తలపు పలుకు మనసూ 


చరణం 2 : 


ఇప్పుడు చూద్దాం 

తనన తనన తన్నా.. 

మూ...తనన తనన అన్నా 

తాన తన్నా తానం తరనాతన్నా 

తానా అన్న తాళం ఒకటే కదా 


తననతాన తననన తాన 

అహ అయ్యబాబోయ్... 

తననతాన తనన తాన 

ముమ్మ్...పదము చేర్చి 

పాట కూర్చలేదా 


శెభాష్... 

దనిని దసస అన్నా 

నీదా అన్నా స్వరమే రాగం కాదా 

నీవు నేననీ అన్నా మనమే కాదా 

నీవు నేననీ అన్నా మనమే కాదా... 


కన్నె పిల్లవని కన్నులున్నవని 

కవిత చెప్పి మెప్పించావే గడసరీ 

చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి 

కలిసి నేను మెప్పించేదియెప్పుడని..


కన్నె పిల్లవని కన్నులున్నవని 

కవిత చెప్పి మెప్పించావే గడసరీ 

చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి 

కలిసి నేను మెప్పించేదియెప్పుడని..


- పాటల ధనుస్సు 


కూటి కోసం కూలి కోసం | Kootikosam Kulikosam | Song Lyrics | Akali Rajyam (1980)

కూటి కోసం కూలి కోసం



చిత్రం: ఆకలి రాజ్యం (1980) 

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత: శ్రీశ్రీ 

నేపధ్య గానం: బాలు 


పల్లవి: 


కూటి కోసం కూలి కోసం 

పట్టణంలో బ్రతుకుదామని 

తల్లి మాటలు చెవిని పెట్టక 

బయలుదేరిన బాటసారికి 

యెంత కష్టం.... యెంత కష్టం 


కూటి కోసం కూలి కోసం 

పట్టణంలో బ్రతుకుదామని 

కూటి కోసం కూలి కోసం 

పట్టణంలో బ్రతుకుదామని... 

తల్లి మాటలు చెవిని పెట్టక 

బయలుదేరిన బాటసారికి 

యెంత కష్టం.... యెంత కష్టం 


చరణం 1: 


మూడు రోజులు ఒక్క తీరుగ 

నడుస్తున్నా దిక్కు తెలియక 

నడిసముద్రపు నావ రీతిగా 

సంచరిస్తూ సంచలిస్తూ 


దిగులు బడుతూ దీనుడౌతూ 

తిరుగుతుంటే... 

చండ చండం తీవ్ర తీవ్రం.... 

జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే.... 


మబ్బు పట్టి గాలి కొట్టి... 

వాన వస్తే... వరద వస్తే... 

చిమ్మ చీకటి కమ్ముకొస్తే... 

దారి తప్పిన బాటసారికి 

ఎంత కష్టం.... యెంత కష్టం! 


కళ్ళు వాకిట నిలిపి చూసే...

పళ్ళెటూళ్ళో తల్లి 

యేమని పలవరిస్తోందో! 

కళ్ళు వాకిట నిలిపి చూసే...

పళ్ళెటూళ్ళో తల్లి 

యేమని పలవరిస్తోందో 


కూటి కోసం కూలి కోసం 

పట్టణంలో బ్రతుకుదామని 

తల్లి మాటలు చెవిని పెట్టక 

బయలుదేరిన బాటసారికి 

యెంత కష్టం.... యెంత కష్టం


- పాటల ధనుస్సు 


గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య | Gussa Rangaiah | Song Lyrics | Akali Rajyam (1980)

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య



చిత్రం: ఆకలి రాజ్యం (1980)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: సుశీల


పల్లవి:


గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య

కోపం మనిషికి ఎగ్గయ్యా..

గుస్సా రంగయ్య.. కొంచం తగ్గయ్య...

కోపం మనిషికి ఎగ్గయ్యా..

ఈ లోకం మారేది కాదు..

ఈ శోకాలు తీరేవి కావు..

ఈ లోకం మారేది కాదు..

ఈ శోకాలు తీరేవి కావు..

దోర పాకాన వున్నాను నేను

కొత్త లోకాన్ని నాలోన చూడు


గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య

కోపం మనిషికి ఎగ్గయ్యా..


చరణం 1:


దేశాన్ని దోచేటి ఆసాములున్నారు..ఊ..

దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారు..ఊ...

ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారు..ఊ...

మనిషికీ మంచికీ సమాధి కట్టారు..ఊ...


మహాత్ములెందరు సహాయ పడిన 

మంచి జరగ లేదు..

మహాత్ములెందరు సహాయ పడిన 

మంచి జరగ లేదు...

జాతివైద్యులే కోత కోసినా 

నీతి బ్రతకలేదు...

భోగాలు వెతుకాడు వయసు..

అనురాగాల జతి పాడు మనసు..

నీ దాహాని కనువైన సొగసు...

నీ సొంతాన్ని చేస్తుంది పడుచు...


ఆ..గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య

కోపం మనిషికి ఎగ్గయ్యా..


చరణం 2:


ఆ...కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవి..ఈ..

మల్లెలెట్టిన కురులలో మాపులున్నవి..ఈ...

వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవి..ఈ...

అన్ని నీవే అనుటకు రుజువులున్నవి..ఈ...


చక్కని చుక్కా సరసనుండగ 

పక్క చూపు లేల..

చక్కని చుక్కా సరసనుండగ 

పక్క చూపు లేల..

బాగుపడని ఈ లోకం కోసం 

బాధ పడేదేల..

మోహాన్ని రేపింది రేయి..

మన పేగుల్లో వుందోయి హాయి...

ఈ అందానికందివ్వు చేయి...

ఆనందాల బంధాలు వేయి...


గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య

కోపం మనిషికి ఎగ్గయ్యా..


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నె పిల్లవని కన్నులున్నవని | Kannepillavani Kannulunnavani | Song Lyrics | Akali Rajyam (1980)

కన్నె పిల్లవని కన్నులున్నవని చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు, జానకి  పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు