RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kotappa kondaku vastanani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kotappa kondaku vastanani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మే 2025, శనివారం

కోటప్పకొండకు వస్తానని | Kotappakondaku vastanani | Song Lyrics | Premabhishekam (1981)

కోటప్పకొండకు వస్తానని


చిత్రం :  ప్రేమాభిషేకం (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : దాసరి నారాయణరావు 

నేపధ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా 

కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా  


ఆరుబయట ఎండలో... 

సరుగుతోట నీడలో

కన్నెపిల్ల కనిపిస్తే...  

కన్ను కన్ను కలిపేస్తే

నూటొక్క టెంకాయ కొడతానని


కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా

కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా  


ఆరుబయట ఎండలో...  

సరుగుతోట నీడలో

బుజ్జిబాబు కనిపిస్తే 

నా కోసం పడిచస్తే

నూటొక్క టెంకాయ కొడతానని


కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా ...  అహహా..

కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా  


చరణం 1 :


హలో...  హలో...   

హలో...  హలో...

హలో...  హలో...


హలో హలో అనమంటుంది 

కుర్రమనసు

చలో చలో పొమ్మంటుంది 

బుల్లిమనసు

పొమ్మని పైపైకి అంటుంది... 

రమ్మని లోలోన ఉంటుంది


పొమ్మని పైపైకి అంటుంది... 

రమ్మని లోలోన ఉంటుంది

పొమ్మని రమ్మంటే అది స్వర్గం

రమ్మని పొమ్మంటే అది నరకం

ఆ స్వర్గంలోనే తేలిపోవాలి

ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి


ఔనంటే నువ్వు ఊ... అంటే...

ఔనంటే నువ్వు ఊ... అంటే... 

నూటొక్క టెంకాయ కొడతానని

కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా ...  అహహా..

కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా  


చరణం 2 :


గొంతు గొంతు కలిపి పాడితే 

యుగళ గీతం

పెదవి పెదవి కలిపి పాడితే 

ప్రణయగీతం

కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము

కళ్లు కుట్టుకుంటే గుణపాఠము

కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి

ఒళ్లు ఝల్లుమంటుంది... తొలిసారి


ఆ జల్లుల్లోనే...  తడిసిపోవాలి

ఆ తడి కౌగిల్లో...  అలిసిపోవాలి

ఔనంటే నువ్వు ఊ... అంటే...

ఔనంటే నువ్వు ఊ... అంటే... 

నూటొక్క టెంకాయ కొడతానని


కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా 

ఆరుబయట ఎండలో... 

సరుగుతోట నీడలో

కన్నెపిల్ల కనిపిస్తే...  

కన్ను కన్ను కలిపేస్తే

నూటొక్క టెంకాయ కొడతానని


కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా ...  ఏహేహే..

కోటప్పకొండకు వస్తానని 

మొక్కుకున్నా


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు